Saturday, September 17, 2011

ఉపవాసం...అపహాస్యం..


ఈ మద్య ఇండియా లో ఉపవాస దీక్షా కాలం నడుస్తోంది. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్క పిల్ల కాదేది కవిత కనర్హం అన్న మహాకవి బతికుంటే, దీని మీద కూడా ఏమన్నా చెప్పేవాడే.పైనుండి మహాత్మా గాంధీ తెగ మురిసిపోతూ ఉండొచ్చు.పోనిలే నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటైన ఈ వెధవాయిలకు వంట పట్టిందని.


నిజం చెప్పాలంటే, ఈ విషయం లో కూడా మన దేశానికి ఘన చరిత్ర వుంది.మణిపూర్ లో సైనిక బలగాలను తగ్గించాలని షర్మిల పదేళ్ళ నుండి చేస్తున్న వుపవాసాలనుండి, నేడు మోడి కి వ్యతిరేకం గా ( నాకు ఇలాగే అర్ధం అయ్యింది) కాంగిరేసు వాళ్ళు చేస్తున్న ఉపవాసాల దాక అబ్బో...చెప్పాలంటే కధ శానా వుంది.కాని కొసమెరుపు ఏమి టంటే, ప్రపంచం లో మొట్టమొదటి సారి కుటుంబ నియంత్రణ పద్దతులు మొదలెట్టిన మన దేశం, మన నాయకా గ్రన్యుల వోటు రాజకీయాలలో వోట్లు పుట్టించి పుట్టించి, ( మనం నిజంగా జనం ఏనా...అనుమానమే), ఎందుకంటే మనం అయిదేల్లకోకసారే యాది కొస్తం కాబట్టి,  దాదాపు ముప్పై మూడు శాతం వోట్లు రోజు చేసేది ఉపవాస దీక్షే. మరి వాళ్ళు చేసేటిది, ఏ అవినీతి అన్తానికో, కనపడని శాంతి కోసమో కాదు.అదో నిరంతర జీవన యుద్ధం. ఎవరేమనుకున్నా, తప్పనిది తప్పించుకోలేనిది. ఇక మిగిలిన అరవై ఏడు శాతం కొస్తే, వాళ్ళూ ఉపవాసాలు గట్రా చేసేస్తారు.ఎలాగంటార, ఈ నూతన జీవన విధానాల లో తిన్నది అరగక. మరి ఎవరండి ఈ కొత్తగా ఉపవాసాలు అని బయలుదేరింది.

ఇక నేటి విషయానికొస్తే, ఉపవాసం మహా శక్తి వంతమైనది.అదే సమయంలో అతి బలహీనమైనది.అది ఒక సామాన్యుడి చేతి ఆయుధమై, ప్రభుత్వం మెడలు వంచగలదు. అల్లాగే, రాజకీయులచేతిలో రాయి అయితే, వాళ్ళ పళ్ళే రాల గొట్టగలదు.రెండో వ్యాఖ్య మీద మీకు భేదాభిప్రాయలు  ఉండవచ్చు.దీనికి మల్లి రెండు పార్వాలు ఉన్నాయి. సామాన్యుడు ఉపవాసం చెయ్యడం చాల సులభం. అంబలి తాగి గుడి వసారాలో పడుకునే వ్యక్తీ, రెండురోజులు అంబలి మానేస్తే వస్తే నష్టమేమి. అదే మన రాజకీయులు చెయ్యగలరా...
రెండో   పార్శ్వం లో వీళ్ళు  ఉపవాసాలు చేస్తారంటే నమ్మేదెవరు.మీరు నమ్మకున్నా నేను నమ్ముతాను. పశువులు మేసే గడ్డి నుండి, గనుల్లో తుప్పు పట్టిన ఇనుము దాక భోంచేసాక అరగోద్దూ..మరి ఆమాత్రం ఉపవాసం చెయ్యాల్సిందే.



ఇదే స్పూర్తి తో ఇక రాబోయే ఉపవాసాలు:
౧. ఇండియా చైనా పెట్రోలు వాడకూడదని ఒబామా.
౨. జన లోక్పాల్ బిల్ కి వ్యతిరేకంగా ప్రస్తుత కేంద్ర కాబినెట్ లో మంత్రులందరి రిలే నిరాహార దీక్ష.
౩. వీలైనంత భూమి భోన్చేసినా వ్యతిరేకిన్చాకూడదని చైనా ప్రెసిడెంట్ దీక్ష అరుణాచల్ ప్రదేశ్ లో.
౪. హుజీ లతో ఇఫ్తార్ విందు తర్వాత, పాకిస్తాన్ ప్రధాని దీక్ష వాళ్ళ దేశం లో తీవ్రవాదులు ఉన్నారన్న ప్రాపగాండా కి వ్యతిరేకం గా..
౫.రాహుల్ తర్వాత తన పేరు ప్రధాని గా ప్రకటించాలని ప్రియాంక గాంధీ కొడుకు గంట ఉపవాసం.
౬.బాంబు పేలుళ్ళ పై పదే పదే ప్రెస్సు వాళ్ళు ప్రశ్నలు అడిగినందుకు అలిగి హోం మంత్రి దీక్ష.
౭. దేశం లో వీడియొ కెమెరాలు, సెల్ ఫోన్ లలో రికార్డింగ్ సౌకర్యం  నిషేదించాలని నిత్యానంద నాయకత్వం లో బాబాలు అమ్మాలా ఉపవాసం. దీనికి వై ఎస్ ఆర్ పార్టీ నేత ఒకాయన మద్దత్తు ;)
౫. వీల్లందిరితో నాకెందుకు, బరువు తగ్గటానికి నాది ఈ పూట ఉపవాసం ;)