Sunday, April 30, 2017

అమ్మఅప్పుడే తెరుచుకున్న కన్నుల్లోంచి
మసగ్గా కనపడ్డ నీ రూపం

కొత్త లోకంలో కొచ్చిన దిగ్బ్రాంతిలో
బిగ్గరగా  ఏడ్చే  నన్ను పొదివి పట్టుకొని
దగ్గరకి తీసుకుంది  ఆ  దేవత

కొన్నాళ్ళు గడిచాక ఎవరో అన్నారు
ఆవిడే మా అమ్మ అని

ఆకలి రోజుల్లో
తాను తినడం మానేసి
ఉన్న కొంచెం అన్నం
నాకు పెట్టిన అమ్మ

తాను ఎలా ఉన్నా
ఏనాడు నాకు
లోటులేకుండా చూసుకున్న అమ్మ

నేను సాధించే ప్రతి చిన్న విజయానికి
ప్రపంచం జయించినంత
ఉప్పొంగిపోయే అమ్మ

నాకన్నా నేను ఎక్కువ
తెలిసిన మా అమ్మ

నీకేం కావాలి
అంటే నాకేం కావాలిరా
ఎప్పుడు నవ్వుతూ ఉండరా అనే అమ్మ


అనుబంధాల విలువ  తెలిసిన నీకు
లోకంలో ఏ సంపద తో  ఋణం
తీర్చుకోవాలి అమ్మా


ఆమె దేవత కానే కాదు
ఏ దేవతా ఇంత చెయ్యలేదు
ఆమె అమ్మే ,,,ఆమె మా అమ్మే2 comments: