Friday, May 11, 2018

అయోధ్య నరేశా....

అయోధ్య నరేశా
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ  2

కరుణరస సింధు   వంశాన నీవు
వెలసినావంటా దశరధుని ఇంట 2
శివధనువును భేదించియే  వైదేహిని   మనువాడ
జయము జయము నీకు కళ్యాణ రామా

కైకమ్మ మాట శిరసావహించి
కదిలినావంటా కానల వెంట 2
లంకేశుడు చెరబట్టిన సీతమ్మను విడిపించి
శత్రునాశకాశ్రీ హనుమ ప్రియ రామా

అయోధ్య నరేశా
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ

ఈ క్రింది పాటకి నా తెలుగు అనువాదం
https://www.youtube.com/watch?v=2DjGizq2Cas