Wednesday, November 26, 2025

ఎలా చెప్పను

మంచుకురిసిన  సాయంత్రాలలో 

పొగలో నిండిపోయిన కనిపించని ఉదయాలలో

పని పాటలతో నిండి  ఊపిరాడని రోజులలో

ఉన్నట్టుండి గుర్తొస్తావు నువ్వు


మ్రాన్పడిపోతాను నేను ....

ఏమని పలకరించను నిన్ను....

ఎలా ఉన్నానని  అడగనా సందర్భం లేకుండా...

మరి ఏమి చేస్తున్నావని వాకబు చేయనా...


అర్ధం లేని సమయాలలో 

నువ్వు ఏదో వ్యాపకంతోనో మరి వుద్యోగంతోనో 

సతమతమవుతుంటే నీతో ఒక నిమిషం మాట్లాడటం 

నీ గొంతు వింటూ నన్ను మరిచి పోవడం అంటూ

అప్రస్తుత ప్రాసంగం చేయనా 


నువ్వు గొర్తొచ్చిన ప్రతిసారీ

ఎడారిలో తప్పిపోయిన బాటసారిలా

ఏంచేస్తున్నానో కూడా మర్చిపోతానని

వందలమందిలో ఉన్నా

నీ సాంగత్యం కోసం తపిస్తానని

నీ ఊహల తుఫానుల్లో చిగురుటాకులా 

అల్లాడతానని ఎలా చెప్పను


నీకు ఏమి కానని తెలిసీ

నాకు నువ్వు అన్ని అని తెలుపలేక

మనకేమి కానీ ఈ భావాలలో

ఎవరికీ ఏమి చెప్పలేని మౌనాలలో

No comments:

Post a Comment