ఇక్కడ చూసినవన్నీ తనకు చెప్పేస్తావా....
నీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడటం లేదని
నా కళ్ళలో తిరిగే కన్నీరు చెప్పే కథలన్నీ దాచేస్తున్నా అని
నా పరిస్థితి తెలిసి ఒక నిమిషం కూడా తాను బాధ పడటం
నాకు ఇష్టం లేదని
మేము కలిసే ఆ ఒక్క క్షణం
అద్భుతమైన రోజైతే
ఎడబాసిన ఈ యుగాలన్ని
అంతులేని రాత్రులని
తన కళ్ళలో ఉన్న
మహిమలేవో చూడగానే
నా గుండెల్లో ప్రశాంతత
అంతా హరించేస్థాయని
తాను లేదని ఎప్పటికి రాదనీ
తెలిసీ నేను పడే గుండె కోత
ఉన్నది ఉన్నట్టే తనకు వివరిస్తావా
నా గుండెల్లో వెలుగునింపే
ప్రేమ అనే కొవ్వొత్తి
సమూలంగా నన్ను
దహించేస్తుందని
నిద్రరాని కళ్ళల్లో
అలసిన ఈ దేహంతో
రాని తనకోసం
వినపడని తన పిలుపుకోసం
యుగాలుగా వేచిఉన్నాఅని
Marvelous
ReplyDeleteExcellent sir
ReplyDelete