Friday, December 14, 2012

పిచ్చోడి చేతిలో తుపాకి-అమెరికతలు-21

ఊహించలేని భయానక ఘటన.

సి యెన్ యెన్ లో ఒక వ్యాఖ్యాత మాటలు. కనెక్టికట్ లోని ఒక చిన్న పట్టణంలోని  ఒక ప్రైమరీ స్కూల్ లో 20 మంది చిన్నారులు చనిపోయిన సంఘటన గురుంచి విన్న  మనసున్న మనిషైన ఎవరైనా ఒక కన్నీటి చుక్క రాల్చక మానరు.కాని ఇది ఎలా జరిగింది. 

ఒక స్కూల్ లో ఎవరో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగ బడటం.కాని ఒక స్కూల్ లో ఇలాంటి ఘటనలను ఎదుర్కోవటానికి ఎటువంటి సదుపాయాలూ ఉండవు. ఇలాంటివి జరుగుతాయని కూడా ఊహించడం కష్టమే. లోకమేరుగని పసిపాపలను బుల్లెట్లతో కడతేర్చే కరకు గుండెలు ఉంటాయని అనుకోవడానికే కష్టంగా ఉంది.
కాని ఈ దేశం మరెన్నో ఘటనలనకు తయ్యారవటం  మంచిది.

పాకిస్తాన్ లాంటి దేశాలలో తుపాకీలు బాంబులు మార్కెట్ లో పెట్టి అమ్మేస్తారని, గుండెలు బాదుకునే ముందు,
అమెరికా లాంటి దేశంలో మారాజుగా తుపాకీ లైసెన్స్ తీసకోవచ్చు అని మీకు తెలుసా. ఇక ఈ శుభకార్యానికి ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క పద్దతి.కాని ప్రజలని ఏమాత్రం ఇబ్బంది పెట్టని ఈ దేశం లో ఏ రాష్ట్రం లో నైన ఇదొక సులభమైన పని.ఇక కనేక్టికట్ డెబ్బయి డాలర్లు తగలేడితే మీకొక టెంపరరీ లైసెన్స్ ఇస్తారు. దాన్ని మరొక ఆఫీసు లో చూపిస్తే అసలు లైసెన్స్ ఇస్తారు. 

ఇక ఈ రోజు జరిగిన ఘటన లో హంతకుడు వాడిన మూడు తుపాకీలు వాళ్ళ అమ్మవి. అంటే, ఒక సారి లైసెన్స్ పొందిన తర్వాత వాటి భద్రతా ఆకాశ దీపమే అన్నమాట.ఇంట్లో అది ఒక మొబైల్ లానో  లేక మరో టీవి లాగానో ఒక మామూలు వస్తువులా భావించే వాళ్ళు ఉండటం అరుదేమి కాదు. మరి ఇంటికి రెండు మూడు తుపాకీలు ఉంటె, ఇలాంటి ఘటనలు జరగటం పెద్ద ఆశ్చర్య కరమే కాదు.అది నేడు ఒక మానసిక రోగి చేతిలో జరిగి ఉండొచ్చు.కాని రేపు ఇది ఒక టెర్రరిస్ట్ చేతిలో జరగోచ్చు. జీవితం పై విసిగిన ఏ ఉన్మాది చేతిలోనో జరగచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, విచ్చల విడిగా దొరికే ఆయుధాలు, ఏ బలహీన క్షణంలోనైన ఎటువంటి పని కైనా ఇలాంటి వాళ్ళని పురికోల్పచ్చు.

ఆయుధ లైసెన్స్ ఇలా విచ్చల విడిగా దొరకడాన్ని నిరోధించాలి.ఇలాంటి వాటికోచ్చే అభ్యర్ధనలను ఒకటికి పది సార్లు పరిశీలించి మరీ అత్యవసరమైతెనె కేటాయించాలి. ఇప్పుడు ఉన్న లైసెన్సులు పునః పరిశీలించడము అవసరమే.
కాని వ్యక్తీ స్వేచ్చ పదిధులు దాటి పరిఢ విల్లుతున్న ఈ దేశంలో అలాంటి చర్చ ఊసే లేదు.చనిపోయిన వాళ్ళకోసం కాండిల్లు  పట్టుకుని తిరిగే బదులు  ఇది ఎలా ఎందుకు జరిగిందో, నివారణ ఏమిటో ఆలోచిస్తే, కొన్నైనా  పసి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు.



2 comments:

  1. Gruesome incident! Columbine, VTECH and connecticut ....How many more?

    ReplyDelete
  2. నాకైతే ముగింపు కనపడటం లేదండి.

    ReplyDelete