Sunday, February 7, 2010

పదండి చింపి పారేద్దాం..రాష్ట్రం లో మరో ఉద్యమ స్ఫూర్తి :)

ఉత్తర భారత దేశం లో జనం అంతా ఆర్యులు, దక్షిణ భారతదేశం లో ని ద్రవిడులు కలిసుండటం సాద్యం కాదు కాబట్టి..దేశం రెండు దేశాలు గ విడి పోతె ఇక వైరుధ్యాలు ఉండవు కావున భలే గా అభివృద్ధి చెందిపోవచ్చని మన కృష్ణ బాబు తే దే పా మాజీ ఎమ్మెల్యే గారు డిసైడ్ అయిపోయారు…సరే ఆయన అయిపోయారు అయిపోయిన పెద్దమనిషి ఇంట్లో వాళ్లకు చెప్పి గమ్మునున్నాడా లేదు…ఐన దానికి కాని దానికి మన మీడియా వాళ్ళు ఉన్నారు కదా ఒక ప్రకటన వదిలేసిపారేసారు…

వీల్లండి మన ప్రజా ప్రతినిధులు…అదేదో సినిమాలో చెప్పినట్టు, పెళ్లి చెయ్యడం కష్టం కాని చేడకోట్టడం యెంత సేపు ??? ఈ దేశం భిన్నత్వం లో ఏకత్వం మన తత్త్వం అని చాటి చెప్పిన దేశం. ప్రపంచ దేశాలే ముక్కున వేలేసుకుని చూసేటట్టు కలిసి ఉన్న దేశం. ఈ వైరుధ్యాలు భిన్న భాషలు మతాలు కలిసిన ఇంద్ర ధనుస్సు…నాయన కృష్ణ బాబు…ఏమి తోచక పోతె తోట పని చేస్కో…లేదంటావా ఇప్పటికే చాల విభజన ఉద్యమాలున్నాయి….వాటిలో జనం లేక భాదపడుతున్నారు…పోయి వాటిలో చేరు…ఇంకా అర్ధం కాక పోతె విశాఖ లోనో ఎర్రగడ్డ లోనో ఒక బెడ్డు ఖాలీ లేక పోదు…