బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించిపలుకుట మేల
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతి
ఈ సుమతి శతకం ప్రస్తుత భారత క్రికెట్ జట్టుకి అతికి నట్టు సరిపోతుంది. వరల్డ్ కప్ టైంలో ఓవర్ ఆప్టిమేస్టిక్ మిత్రులతో వాదించలేక , ధోనికి పిల్లి ఎదురోచ్చిందని , విరాట్ కోహ్లి రూంలో బల్లి చచ్చిందని అందుకే మనోళ్ళు సెమి ఫైనల్లో బాటు తిప్పలేక ఎయిర్పోర్ట్ దారి పట్టారని ముఖ పుస్తకాలు ఎక్కి వాదించే మేధావులతో ఇప్పుడు మల్ల మాట్లాడతాం అని... మా కొలీగు ఒకాయన్ని కదిలిస్తే ఆ రోజుకి ఈ రోజుకి పోలికేవిటోయ్ అని ఒక నవ్వు నవ్వేసి చక్కా వెనక్కితిరక్కుండా కాంటీన్ దారి పట్టాడు.
ఇంకా చెప్పొచ్చే దేంటంటే, మన జట్టు దిక్కుమాలిన డొక్కు ప్రదర్శన కి చాల కారణాలు కనిపిస్తున్నాయ్
1. ఓవర్ క్రికెట్ : వరల్డ్ కప్, ఐ పీ ఎల్ లలో నాన్ స్టాప్ గా ఆడి ఆడి అలసిపోయి ఉండొచ్చు
2. ఓవర్ ఆడ్స్ : మనోళ్ళు ఒళ్ళు దగ్గరేట్టుకొని చేసే పనులు. వీటిలో స్మైల్ ఇచ్చి ఇచ్చి మైదానంలో ఎం చేయాలో మనోళ్ళు మరచి పోయి ఉండవచ్చు
3. వెర్రివాళ్ళు అమాయకులు మీదు మిక్కిలి ఆశా జీవులైన అభిమానులు : మీరేమైనా అనండి... ఈ మద్య కాలంలో మన క్రికెట్ టీం యవ్వారం కాకుండా స్టార్ల భాగోతం అయిపోయింది. ఆడలేనయ్యకు బాటు వంకర అన్నట్టు , పూర్తిగా అన్ని రంగాల్లో మట్టి గరిచి సెమీఫైనల్ లో ఇంటి దారి పట్టిన వాళ్ళను ప్లేయర్ ప్లేయర్ కి భజన బృందాలు మొదలయ్యాయి. టీం మొత్తం ఆడక పొతే పాపం పసోడు ధోని ఏం చేస్తాడని ఒకాయన అంటే, విరాట్ విశ్వరూపం ఫైనల్ కోసం దాచాడు కాబట్టి ఆ తొక్కలే అని సెమి ఫైనల్ లో ఆడలేదని వ్యూహాత్మకం గా వాదన చేసేది ఇంకో కాయన.
4. జట్టేనా అది : మన బౌలింగ్ మంచి డాల్ డమాల్ అని అందరికి తెలుసు. ప్రపంచంలో క్రికెట్ అదే అన్ని దేశాల బాట్స్మన్ కి రికార్డ్స్ ఇవ్వడానికి బౌలింగ్ చేస్తున్నారా అన్నట్టు అనుమానాలు రావడం సహజమే . ఇక మహారధులతో కూడిన మన బాటింగ్ మంచి బహుళ అంతస్తుల పేక మేడ. అబ్బో ధావన్ వామ్మో కోహ్లి అనుకునే లోపల మైదానం లో చలి ఎక్కువుందని అందరు డ్రెస్సింగ్ రూం కి పరిగేట్టుకోచ్చేస్తారు.
నా మటుకి నేను మ్యాచ్ చూడటం మానేసి చానా కాలమైంది. అంటే మనోళ్ళు సన్నాసులని కాని ఇంకోటి కాని నా స్తిరాభిప్రాయం కానే కాదు. ఓడి పోవటంలో ఇన్ని రకాలు గా ఓడిపోవచ్చు అని ప్రయోగం చేసే గొప్ప శాస్త్రజ్ఞులలా అనిపిస్తున్నారు ఈ మద్య. అందుకే ఆ ప్రయోగాలేవో పూర్తయ్యాక చూడచ్చు లెద్దు. సంవత్స్తరం పొడుగునా దొరికేది క్రికెట్ ఏగా ...ఎప్పుడైనా చూసి ఏడవచ్చు అని...

No comments:
Post a Comment