చిలుకూరు బాలాజీ దేవాలయం.
5-6 ఏళ్ళ క్రితం ఎలా ఉందో అలానే ఉంది. అక్కడ జరిగే పూజాదికాలు , ప్రదక్షిణాలు, జన సందోహం గురించి నేను రాయబోవటం లేదు. రాష్ట్రం లో ఎక్కడా లేని ఒక సంప్రదాయం గురించి, చిలుకూరు ప్రారంభించిన ఒక పోరాటం గురించి రాయాలని పించింది.
చిలుకూరులో హుండీ లేదు. ఎటువంటి కానుకలు స్వీకరించ బడవు. ఎవరైనా దేవుని ముందు సమానమే అన్న భావన ప్రతిఫలిస్తూ గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా వరసలో నిలబడే దర్శనం చేస్కోవాలి. దర్సనానికి ఎటువంటి టికెట్లు లేవు. దేవుని ముందు అందరూ సమానమే. మరి ఇక్కడ కానుకలకు ప్రత్యేకతలకు అధికార దర్పానికి ఎటువంటి చోటు లేదు. దేవుని మీద అచంచలమైన భక్తీ, నమ్మకమే దేవుని చేరే దారులైతే , భక్తులనుంచి ఇవి తప్ప ఇంకేమి ఆశించనిది చిలుకూరు బాలాజీ ఆలయమే అని ఘoటా పధం గా చెప్పవచ్చు.
మనది లౌకిక రాజ్యం. కాని మనం కేదార్ నాథ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వం. ఎండోమెంట్ డిపార్టుమెంటు కేవలం ఒక మతం వ్యవహారాల మీదే అజమాయిషీ చెలాయిస్తుంది. వారి హుండీ కానుకలలో వాటా తీస్కుంటుంది. సినిమాలలో కామెడీ షోలలో ఒక మతం దేవుళ్ళే అభాసు పాలవుతారు. సెన్సార్ కూడా వాటిని చూసి నవ్వి వూరుకుంటుంది.కొన్ని మతాల సంస్తలకు మాత్రమె ప్రత్యెక వేసులుబాట్లు వుంటాయి. ఇలాంటి విషయాలు విశదీకరించి రాయటం మళ్ళీ మళ్ళీ మనల్ని మనం అభాసు పాలు చేసుకోవడం కాబట్టి , ఇంతటితో ముగిస్తాను.
ఏ మతానికైనా వ్యవస్థ కైనా పునరిజ్జీవం అవసరం. ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చిన్న గానే ప్రారంభం అవుతుంది. ఇలాంటి చిన్న ప్రయత్నం చిలుకూరు లో జరుగుతుంది. చిలుకూరు బాలాజీ వీసా బాలాజీ గా ప్రసిద్ది. వేలాది మంది భక్తులు ప్రతి రోజు ప్రదక్షిణాలు చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏ దేవాలయం లో లేనట్లు ఆలయ పూజారులు భక్తుల నుద్దేశించి ప్రసంగించడం విశేషం. వారు వివరించే విషయాలు ఆలయంలో వ్యవహారాల నుంచి స్వధర్మ వినాశన కారణాల వరకు, కుంచిచుకు పోతున్న నైతిక విలువల నుంచి, ధర్మ పరిరక్షన దిశ గా సాగుతాయి. సర్వ ధర్మాలు దేవుని చేరేవే అయితే స్వధర్మ పాలనలో , దాని రక్షణలో ఏ మాత్రమూ అలసత్వం పనికి రాదనీ ప్రభోదిస్తాయి. ఇది తప్పని సరిగా చేయవలసిన మంచి ప్రయత్నం. హుండీ లేని దేవాలయం, ఎండోమెంట్ ఆంక్షలకు అందని దేవాలయం, దేవునికి భక్తునికి డబ్బు దస్కం అడ్డురాకూడనే ప్రభల ప్రయత్నం ఎంత సఫలమైనదో మీరు ఒక సారి చిలుకూరు దర్శించి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయము దీనిని ఒక నమూనా గా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంలో మనుస్మృతి నుంచి ఒక వాక్యం "ధర్మో రక్షతి రక్షితః "
avunu
ReplyDeleteidi nijamgaa dharmaanni rakshistunna kemdramu
But i have few concerns abt the temple. It is famous. ok. but congested with shops and not clean. On any given day, devotees have to dive through the coconut shells and pieces to save their feet in the temple complex. And I feel the monopoly of the priest seems obstructive to the development. Begging is rampant. Parking area is not maintained. Devotees will have to shell money anyway. I feel if the chief priest wishes, he can accept donations to improve the facilities in and around the temple. The visit to the temple should not be unpleasant to any devotee who travels far from the city with faith. Commercial it is. I feel that this is one extreme case. Sorry if u take offence. But sir, this is what I felt.
ReplyDeleteసుజాత గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. చాలా దేవాలయాల దగ్గర ఇటువంటి పరిస్ధితే. దేవాలయ సందర్శనం "unpleasant" గా తయారవకూడదని సుజాత గారు అన్నది అక్షరాలా సత్యం.
ReplyDelete