ఇంగ్లాండ్, పాకిస్తాన్ లతో అద్భుతమైన పరాజయాల తర్వాత, బి సి సి అయ్ ఈ క్రింది దేశాలతో క్రికెట్ ఆడటం నిషేదించింది. వారు విడుదల చేసిన ప్రకటన లో దీనికి కారణాలు ఈ విధం గా ఉన్నాయి.
1. పాకిస్తాన్ : శత్రు దేశం కాబట్టి...ఎల్లాగు శివసేన వద్దంది కాబట్టి.
2. ఇంగ్లాండ్ : 200 ఏళ్ళు మనలను బానిసలు చేసారు
3. శ్రీ లంక: తమిళ్ పార్టీ లు వద్దన్నాయి కాబట్టి
4. ఆస్ట్రేలియా : మనవాళ్ళ పైన జాత్యా హంకార దాడులకు ప్రతిగా
5. న్యూ జీలాండ్: ఆస్ట్రేలియా పక్కనే ఉంది కాబట్టి
6. సౌత్ ఆఫ్రికా: వాళ్ళ ప్రెసిడెంట్ పాకిస్తాన్ వెళ్ళినందుకు నిరసన గా
7. వెస్ట్ ఇండీస్ : దూరం ఎక్కువ కాబట్టి
ఇంకా ఈ క్రింది దేశాలతో ఆడటానికి నియమాలు వర్తిస్తాయి అని ప్రకటించారు.
1. జింబాబ్వే : మంచి వానా కాలం లో ఆడాలి. మద్యలో వాన పడి ఆట ఆగి పోయినప్పుడు ఇండియా నే గెలిచినట్టు ప్రకటించాలి.
2. బంగ్లా దేశ్ : మా క్రీడాకారులు యాడ్ కాంపెయిన్ లో లేనప్పుడే ఆడగలరు.
3. హాంగ్ కాంగ్ / రష్యా /అమెరిక/ జిబౌటి లాంటి అనామక దేశాలు : ఎప్పుడైనా ఆడ వచ్చు.కాని కొన్ని పరిమిత స్టేడియం లలో మాత్రమె.
( పాకిస్తాన్ పై మన వాళ్ళ భయంకరమైన బాటింగ్ దెబ్బకి కడుపు మండి పై పైత్యం :))
హ్ మ్మ్ మ్ మ్ మీకు బలే ఐడియాలు వస్తాయి...మీకు కూడా నాలా తిక్క రేగినట్టు ఉంది మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి....
ReplyDeleteధన్యవాదాలు..ఏం చేస్తాం లెండి..మనకింతే ప్రాప్తం..
Deleteమనోల్ల ఆట చుస్తే ఒక్కోసారి వైరాగ్యం వచ్చేస్తుంది..:)
నిన్న మనవాళ్లు ఆడిన ఆటకు భలే మంచి చురకలు..
ReplyDelete