కేంద్ర ప్రభుత్వం 7 నవంబర్ నుంచి అన్ని సర్విసుల పై .5 శాతం సెస్సు విదించింది. ఇది స్వచ్చ భారత్ అభియాన్ కోసం. అబ్బే ... వంద రూపాయల సర్వీస్ టాక్స్ లో ఇది ఇంకో యాభయ్ పైసలు మాత్రం అదనం అంతే .. అని ఆర్ధిక శాఖా తన ప్రకటనలో వక్కానించింది కూడా.
కొన్ని నెలల క్రితం, సరిగ్గా గుర్తులేదు ... ప్రాధాన్యత లేదు కాబట్టి సరైన రోజు గురుంచి వెతకలేదు ...ఈ స్వచ్ భారత్ అభియాన్ ప్రారంభమయింది. మంత్రులు , గవర్నర్లు , వారి వంది మాగధులు చేట చీపురు పట్టుకొని రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో లేని చెత్తను పోయించి మరీ చిమ్మారు. వార్తా పత్రికల నిండా నిండారు. బావుంది. సినిమా ధియేటర్ లలో, టీవి లో ఎవడైనా సిగిరేట్తో, బీడినో పట్టుకొని కనపడితే చాలు ... పొగ ప్రమాదకరం ... కాన్సర్ కారకం అని సీన్ ముందో సారి వెనకో సారి ఊదర గొట్టారు ... చాల బావుంది. అయ్యా ... ఒక నెల తర్వాత అంతా మామూలే ... స్వత్చ్ భారత్ ...ప్రారంభ రిబ్బన్ కత్తిరించాక మూలన పడే ప్రభుత్వ ప్రాజెక్ట్ లా అటకెక్కింది.
ఇక ప్రాధాన్యాల లోకేల్తే :
1. చెత్త ని ఏం చేద్దాం : నగరాల్లో పట్టణాల్లో పోగు పడ్డ చెత్త ఎక్కడో వూరికి దూరంగా వేసి కాల్చేయ్యడం లేక పూడ్చెయ్యడం మనకు అలవాటే. కాని విపరీతంగా పెరుగుతున్న జనా వాసాలతో ఇలాంటి ప్రాంతాలు కను మరుగవుతున్నాయి. హైదరాబాద్లోనే ఇలాంటి ప్రాంతాల్లో చుట్టూ పక్క కాలనీలు కాలుష్యం బారిన పడటం కద్దు .
మరి స్వచ్చ భారత్ కార్యక్రమం లో వేస్ట్ మేనేజ్మెంట్ కి ఏమన్నా పరిష్కారాలున్నయా ....
2. స్వచ్చత అంటే చెత్తేనా : మరి వాయు కాలుష్యం. వెయ్యి రెండు వేలు లంచాలు తీస్కుంటే పట్టుకునే ఏ సి బీ వేలకోట్ల అవినీతిని వదిలేసి నట్టు ... స్వచ్చ్ భారత్ అంటే కేవలం రోడ్డుమీద చెత్త వూడవడం ఏనా.. దేశ రాజధానిలో గాలి కాన్సర్ కారకం అని ఏళ్ల కిందే తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం. యూ పీ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ లో దాదాపు అన్ని నగరాల్లో గాలి మనుషులు పీల్చ డానికి పనికి రాకుండా కాలుష్యం బారిన పడిందనేది అందరికి తెలుసు... మరి దీనికి స్వచ్చ్ భారత్ లో ప్రత్యామ్యయాలున్నాయా ....
3 మరి నీరు : తొంభై శాతం కన్నా పైన నగరాలూ పట్టణాల్లోని మురికి నీరు నేరుగా నదుల్లో కాలవల్లో చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి నీటిని శుద్ధి చేసి నీటిలో విడుదల చేసే సాధనాలు ఉన్నా వేళ్ళమీద లెక్కించచ్చు.
4. ఆహారం అరహరమ్ విషం : తినే ఆహారం , పాలు చివరికి పళ్ళు అన్నీ పురుగు మందుల తో, కావాలని చేసే కల్తీలతో మనవ వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయని ఈ మద్య ప్రతి చోట వార్తలు వింటున్నాం . మరి స్వచ్చత వీటిలో వద్దా ??
దేశం లో అడుగడుగునా నిండి మనం ఎప్పుడో పట్టించుకోవడం మానేసిన అవినీతి లంచగొండితనం లా కాలుష్యం సర్వ వ్యాప్తం. సరైన ప్రణాళిక, ఆలోచన లేకుండా చేసే ప్రతి పధకం మొదట్లో మురిపించినా తర్వాత అటక ఎక్కడం మామూలే. మనకిలాంటివి కొత్త కాదు.. మరి స్వచ్చ భారత్ మరో ప్రభుత్వ పధకంలా ఫొటోలకి పేపర్ ప్రకటనలకి పరిమితమై తుస్సు మంటుందో ... లేక ఘట్టి మేలేమన్న చేస్తుందో ....

Well said. As far as i can understand this programme is aimed at building toilets for millions of people who openly defecate in Indian villages and urban slums. So we pay for the construction costs. Rest is Ram Jane.
ReplyDeletebut in the end it will end up like....LPG subsidy...leave it to build nation..ok...but can u tell how many poor families benefited....god knows....u might have already flt the pinch of this cess...theaters,restaurents, hotels, etc..etc where ever there is service...whats happening to all this money...well said...Ram jane :)
Delete