Thursday, October 1, 2015

నా వస్తువులు కొన్ని

నా వస్తువులు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి
తిరిగిస్తావా...

కాఫీ షాపుల్లో కరిగిన లెక్కలేని వర్షపు రాత్రులు
మనిద్దరమే ఈ లోకంలో అనేలా ఎన్నెన్నో ఊసులు













మొదటి వానతో పులకరించిన మట్టి వాసన
జోరు వానలో ఇద్దరు పట్టని గొడుగులో
సగం సగం తడుస్తూ కలసి నడిచిన దారులు

తడిచిన నా హృదయం నీ వాకిట్లో పడుందేమో
తిరిగిస్తావా

ఆకురాలు కాలం లో కొన్ని ఆకులు రాలిన చప్పుడు
వారాంతపు దూర ప్రయాణాల్లో మన సాంగత్యం

ఇంకా ఆరని నీ మెహంది
ఊసు పోనీ గిల్లి కజ్జాలు

నా కెంతో వెలలేనివై  నీకేమి కానివి
అన్నీ మర్చిపోకుండా వెతికి పంపిస్తావా

నా వస్తువులు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి
తిరిగిస్తావా...

( Inspired by one and only Gulzar)





1 comment:

  1. కాఫీ షాపుల్లో కరిగిన లెక్కలేని వర్షపు రాత్రులు
    మనిద్దరమే ఈ లోకంలో అనేలా ఎన్నెన్నో ఊసులు...గుర్తుండిపోయే, నచ్చిన లైన్స్

    ReplyDelete