Sunday, December 23, 2012

ఎచ్చటికో ఈ పయనం ....అమెరికతలు-23

తల్లి దాస్యము తెంచిన తెగువ కానగ  రాదు..
పర పాలక ఏలికల పీచమణచిన మహోగ్ర విప్లవ జ్వాల చూడగా లేదు...

వంగ ఉత్కళ మన్న భేదమిక్కడ లేదు..
భరతమంతా  చూడ చీడ పట్టిన జాడ...

ఇన్ని మాటలేల మరల చెప్పగనేల...
ఏ దిశను పరికించ మకిలమయ్యిన మనము..

మద్య రాత్రిన మగువ స్వేచ్చ నడిచిన దినము
స్వతంత్ర మేతేన్చునన్న  మహాత్ము మాట..

ఏ నేల  పడతి పూజించ బడునో దేవతలందు
నడయాడురన్న వేద ఘోష..

మానవత్వము మరచి మధ గోషలో
పెరుగు కీచకుల తెలియని తత్వమేమో  ఇది..

రాజదానము కాని చిన్ని గ్రామము కాని
ఎడనేడా  వలువలు లేని విలువలు..

ఎక్కడికీ పయనం..
ఎవరు దీనికి కారణం..

మతం నేర్పని కులం చూపని
పుస్తకాల్లో చదవని క్రౌర్యం ...
కలకాలం వేదించే దైన్యం...

యువతరం కదలాలి
నవతరం రగలాలి...

నిస్త్రానమై నిద్రించు  ప్రభుత కళ్ళు తెరవాలి...

జనం ఐతే ప్రభంజనం
మరో యుగం ఆవిష్కృతం

ఎక్కడ స్వేచ్చా స్వాతంత్రం
కాళ రాత్రుల కరాల నృత్యాలలో
కానరాక కరిగి పోదో...

ఎక్కడ మహిళ మాత్రు  స్తానంలో
మహోన్నతమై వెలుగొందుతుందో...

ఆ  ఊహా ప్రపంచం లోకి
నా దేశాన్ని మేలుకొలుపు  తండ్రీ..












2 comments: