Kadali Movie lo Gunjukunnav ane paataku naa own lyrics :)
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..
లేని పోనీ ఆశలు రేపే కొంటె చూపేలే
తగ్గనంటుంది నా గుండె సడి తకదిమిలా...
మన ఈ ప్రణయం
రాసే నవ కవనం
ఇక ఈ లోకం అవదా నందనవనం
నా మనసు వయసు నీ వెంటే పోతుంటే పోతుంటే
నా కంటూ మిగిలేదిక ఏముందే
ఇక నీవుంటే నా వెంట
కాలమసలు కరగదుగా...
కలకాలం నా కలలా నిలుస్తోన్దిలా...
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..
పొద్దే గడవను అందే..
ప్రాయం నిలవకవుందే..
నా వంకే తొంగి చూసి
చందమామ నవ్విందే...
ముసుగుతన్ని లోకమంతా నిదరోయే వేళల్లోన..
నా వయసే నీ తోడుకై వేచి వేచి చూసిందే...
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..
నిలువంతటి నీ రూపం
కన్నుల్లో నిలిచాక
కనురెప్పలు మూయాలని ద్యాసే నాకే లేదే..
నా లో నీపై ప్రేమ
కడలి అలై పొంగితే
రగిలే నా మనసేమో
పలకలేక మూగైందే
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..
లేని పోనీ ఆశలు రేపే చూపేలే
తగ్గనంటుంది నా గుండె సడి తకదిమిలా...
మన ఈ ప్రణయం
రాసే నవ కవనం
ఇక ఈ లోకం అవదా నందనవనం
నా మనసు వయసు నీ వెంటే పోతుంటే పోతుంటే
నా కంటూ మిగిలేదిక ఏముందే
ఇక నీవుంటే నా వెంట
కాలమసలు కరగదుగా...
కలకాలం నా కలలా నిలుస్తోన్దిలా...
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే
చాలా బావుందండి మీ అనువాదం. చక్కగా, హాయిగా ఇంకా చెప్పాలంటే అద్భుతంగా !
ReplyDeleteఈ సినిమా పాటల అనువాదం నన్నెంతో నిరాశకు గురిచేసిందండి... ఆ మధ్యన ప్లస్ లో కూడా రాసా ఈ పాట గురించి... "గుంజుకోవటమేమిటో.. రాచ కురుపు అంటూ.. ప్రేమ మధ్యన రోగాలు రొష్టులు ఏమిటో... కనీసం "దాచుకున్నా..." రాయలేకపోయారే..." అని !
ధన్యవాదాలు
Deleteచాలా బావుందండి మీ అనువాదం
ReplyDeleteధన్యవాదాలు
Deletechaalaa chaalaa baagundhandee..:-)
ReplyDeleteఅమ్మయ్య ఓ పాటకు ప్రాణం పొశారు. ఆ సంగీతంలో పడి అక్షరాలు ఎంత గిజగిజలాడాయో! ఈ అనువాదంతో సేదతీరి వుంటాయి. అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలు...మీ వర్ణన బావుంది :)
Deleteహలో ఎ.ఆర్. ఆర్, ఇటు చూడవయ్యా- కొంచెం. ఎంతసేపూ వనమాలి, మణిరత్నం ఏనా ? ఇక్కడ రియల్ టాలెంటు చూడు. వాళ్ళు అరవాళ్ళు ఏమి తెలుగు పాట రాస్తారు చెప్పు ? తెలుగు పాట తెలుగు వాళ్ళతో రాయించి చూడు ! వేటూరి లేరనా ? ఇక్కడ ఒక లుక్ వేసుకో నాయనా నీకు పుణ్యముంటుంది !
ReplyDeleteధన్య వాదాలు...ఇప్పుడు నా భావాలు అంగ్లీకరించాలంటే U just made my Day :)
Delete