Thursday, August 22, 2013

మరీచిక...

నిజమే 

నేను   నిన్ను  ప్రేమించాను 
కళ్ళలో  వేయి వత్తులు వేసుకొని  
నీకై వేచాను 

నిజమె..నీ ప్రేమ ప్రవాహంలో 
అనంత అనందం అనుభవించాను 

నా తలపులలో 
వలపు వేలుపువై నిలస్తే 
తెలవారులు తలచి 
పులకరిస్తాను 

నీ ఊహలలో ఊసులలో 
ప్రపంచాన్నే మరచాను 
తెలతెల వారిందన్న 
తెరపే లేదు 

ఉదయ భానుని చివుక్కుమనే 
కిరణాలతో నిజం తెలుసుకున్నా... 

కలకాలం కరగని 
స్వప్నానివి నువ్వు.. 

నేనేనాటికి చేరుకోలేని మరీచికవు 

7 comments:

  1. ప్రతిపాదం మనసునితాకిందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. ఏదో మీ అంత కాక పోయినా అప్పుడప్పుడు ఏదో గీకేస్తుంటాను :)

      Delete
  2. prati padam baavundi chalaa baagaa manasu petti raasaaru

    ReplyDelete