అశాంతితో స్మశాన ప్రశాంతత నిండిన నా హృదిలో
శరత్కాల వెన్నెల వన్నెలతో తలుక్కున మెరిసావు నువ్వు
జీవితం క్షణ భంగురమే కాని
దానిలో కాలాని కందని అనుభూతులెన్నో
నీ స్నేహం అజరామరం
నీ పలుకులే జీవన వేదం
రుద్రభూమిలో విరిసిన చిరునవ్వువు నువ్వు
వడగాలుల్లో మెరిసి మురిపించే చిరుజల్లువు
వివర్ణమైన నా జీవితఆకాశంలో వేయి వర్ణాల హరి విల్లువు నీవు
మతిలేని మరీచికల మద్య నిలిచి మురిపించే ఒయాసిస్సువు
నీ సాంగత్యం శాస్వతం
మిగిలిన ఈ జగమంతా నిస్తేజం నిరాకారం
నీ నవ్వుల కాంతుల్లో ఉదయమైనదోయి
నిద్రించే నీ కనుదోయి సాయంత్రపు చల్లని హాయి
చల్లని సాయంత్ర సమీరమే చివ్వున మోమున తగిలింది
కాల మెరుగని మన ప్రణయం మొదటి నాడే ముగిసింది
చెదరిన ఊహలో చివుక్కున చుట్టూ చూసాను
నీ స్తానం పదిలమనే నా మదిలో వెతికాను
చప్పున స్పురించినది నిన్న చదివిన ప్రణయ కావ్యం
అందులో కావ్యనాయిక వర్ణన నిత్య నూతనం
నా ఊహల వుద్రుతికి చిన్నబోయి నిలచాను
కావ్య నాయకలతో ప్రణయం సరికాదని తలచాను
Wow...good one
ReplyDeleteThanks...Your Comment makes it really a good one :)
Delete