సుచేత్ గర్హ్ ..జమ్ము ప్రాంతం...
భూమ్....
ఇండియా హోవిత్జేర్ శత్రుగ్ని ఘర్జన...
గడచిన రెండు వారాల్లో ఇన్నాళ్ళు మూగవోయిన భారత శత్రుగ్నులు అవిరామంగా ఘర్జిస్తున్నాయి. 2003 కాల్పుల నిషేద ఉల్లంఘన ఎన్నో సార్లు జరిగినా , మొదటి సారి భారత్ ఇలా స్పందించింది.
భారత రక్షణ విధానంలో ఎవరికీ అర్ధం కాని పార్శ్వాలు ఎన్నొ. పరాయి దేశం ఎన్ని సార్లు కవ్వించినా నోరు విప్పని సుషుప్తావస్తలో మునిగి తేలింది మన ప్రభుత్వం. గడచిన ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరిగినా ,
హోం మంత్రులు పేపర్లలో బొరలు విరుచు కోవడం తప్ప చేసిందేమీ లెదు. ఒక హోం మినిస్ట్రీ ఆఫీసర్ చెప్పినట్టు... మనమెప్పుడూ ఇంత భారీగా స్పందించలేదు.
ఇజ్రాయల్ లాంటి దేశాలు చుట్టూ శత్రువులతో ఉన్నప్పటికీ, వారి ఆయుధ సంపత్తి మిగతా వారికేమాత్రం తీసిపోనప్పటికీ, సరి హద్దులలో కవ్వింపులకు వారెప్పుడు సమ్మతించలెదు. మన విషయమే చుద్దామ్...
ఎప్పుడు కొత్త తీవ్రవాదులను సరి హద్దులు దాటించాలి అన్నా, శత్రు దేశం కాల్పులకు తెగబడుతుంది. అక్కడ ఎన్నికలు వచ్చినా, ప్రతిపక్షాలు రెచ్చి పోయినా, మత ఛందస వర్గాలను బుజ్జగించాలన్న, సర్వ నాశనం అయిన ఆర్ధిక వ్యవస్తల నుంచి జనం ద్రుష్టి మరల్చాలన్న, వాళ్ళకు కాశ్మీర్ గుర్తొస్తుంది. అమ్మ కొట్టిందని కొంటె కుర్రాడు పక్కింట్లో రాళ్ళు వేసినట్టు, అక్కడ ఏమి జరిగినా మనమే భరించాలి.
మరి అక్కడ ఉన్న జనా వాసాల మాటేమిటి. నిత్యం మోర్టార్ల మోతలతో ఎనిమిశాన మిన్ను విరిగి పడుతుందో, ఎప్పుడు ఆర్మీ వచ్చి ఇల్లు వదిలి సురక్షిత స్తానలకు వేల్లమంటుందో, బైటకు వెళ్ళిన కుటుంబ సబ్యులు తిరిగి వస్తారో రారో అన్న పరిస్తితి.
మరి ఈ సారి ఏమి జరిగింది. చైనా అధ్యక్షుడు మన దేశం లో ఉన్నప్పుడే , వారి బలగాలు లడఖ్లో దురాక్రమణకు పాల్పడ్డాయి. కొత్త ప్రభుత్వాన్ని , వారి విధానాన్ని పరీక్షించా దానికి చీనియుల ఎత్తుగడ కావచ్చు. కాని, మనం ఈ సరి శత్రువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాం. వారి బలగాలకు ప్రతిగా భారత్ తన బలగాలను నిలిపింది. ఈ కొత్త పరిస్తితి కి వారు ఆశ్చర్యపోయి ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు. మనం వాళ్లతో బలంలో బలగంలో సాటి కాక పోవచ్చు. కాని ప్రత్యర్ది దాన్ని అలుసుగా తీసుకోవనివ్వకూడదు. ప్రపంచం లో ఎ దేశము బలమైన ప్రత్యర్ది కోసం తన భూమి వదులుకొదు. అది ఫిలిప్పీన్స్ ఐన సరే, ఉక్రెయిన్ అయిన సరె.. శత్రువు మన భూమిని ఆక్రమించిన ప్రతి సారి అది జీవన్మరణ పోరాటమే.
ఇక ఇప్పటి స్తితికి వద్దాం. పరాయి దేశంలో ప్రభుత్వం బాగా బలహీన పడింది. వారి ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాదులతో, రాజధాని దిగ్భందనం చేసిన ప్రతిపక్షాల రాలీలతో దేశం అట్టుడుకుతోంది. ఏ క్షనానైన మరల దేశం సైన్యం చేతికి వెళ్ళే పరిస్తితి. ఇంకా ప్రభుత్వానికి మిగిలిన దారి, సరిహద్దుల్లో హడావుడి. కాని ఈ సారి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వెసారు. సరిహద్దుల్లో అటువైపునుంచి పచ్చిన ఒక తూటాకు మనం ఆరు సార్లు బదులిస్తున్నాం . ప్రత్యర్ది దేశం సైన్యం వాళ్ళవైపు జరిగిన వినాశనం ప్రచురించ వద్దని పత్రికలకు తాఖీదులిచ్చిందంటే పరిస్తితి అర్ధం చేసుకో వచ్చు.
ఇలాంటి చిన్న ఘటనలు పూర్తీ యుద్ధం గా మారే పరిస్తితి లేదు కాని, మారిన భారత దృక్పదాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తాయి. ఇకపై తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు శత్రువు పది సార్లు ఆలోచిస్తాడు.
Meeru raase, memu chadive time ki marosari satruvu gilli kajja ki kaalu duvvu thunnaadu.
ReplyDeletepedda karratho ne kottaalaa ee chinna paamuni.?
Rao Garu...message has been sent loud and clear...ika migilindantaa taataaku chappulle antaanu...chustu vundandi :)
Delete