1. డబ్బు కూడా వంటి బరువు లాంటిదే. ఎంత అవసరమయితే అంత వుంటే బావుంటుంది.
2. ప్రపంచం లో అన్నీ ఉన్నాయి అనుకునే వాడే ఏమిలేనివాడు. ప్రాపంచిక విషయాలన్నీ క్షనభంగురాలే. ఆత్మ సంతృప్తి కి మించిన ఆస్తి లేదు.
3. మంచి చెడులు నాణానికి రెండు వైపులు. ఎవరు ఏది చూడాలను కుంటే అదే చూస్తారు. అందరూ ఒకే వైపుని ఒకేలా పిలుస్తారని నమ్మకం పెట్టుకోకు. ఒకడికి పనికి రానిది వేరేకరు ఇంట్లో పెట్టుకోవచ్చు.
4. పాత జన్మ నుంచి ఏవీ నీకు తోడూ రావు. నీ బౌతిక శరీరం మీ జననీ జనకులు నిర్ణయిస్తే, నీ భవిష్యత్తు నీ చేతల ద్వారా నువ్వే రాసుకుంటావు.
5. సంసారి కన్నా సన్యాసి సుఖి.
6. నీ సుఖం తో దుక్ఖం తో కాలానికి లోకానికి పని లేదు. ఆహ అనో అయ్యో అనో ప్రపంచం నిన్ను మర్చి పోతుంది.
7. కన పడే దంతా నిజం కాదు... కన పడనిది అబద్దం అసలే కాదు.
8. ప్రపంచం లో అన్ని బంధాలు ఇచ్చి పుచ్చుకునేవే.
9. రాజ్యం వీర భోజ్యం. రాజకీయం సన్నాసుల చోద్యం.
10. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి.
Liked it. Satyameva jayate.
ReplyDeleteThank you
Delete