ప్రేమంటే రెండు గుండెల చప్పుడే కావక్కర్లేదు
ఒక గుండె పడే వేదనా ప్రేమ కావచ్చు
ప్రేమంటే వసంత సమీరమే కావక్కర్లేదు
వేసవి వడగాల్పు కూడా ప్రేమ కావచ్చు
ప్రేమంటే గాఢ పరిశ్వన్గమే కావక్కర్లేదు
ఒంటరి నిట్టుర్పు ప్రేమే కావచ్చు
ప్రేమంటే తలుక్కున మెరిసే ప్రేయసి నవ్వే కావక్కర్లేదు
ప్రియతము గానని కంటి నీరే కావచ్చు
ప్రేమంటే ఒక కలయికే కావక్కర్లేదు
నిరీక్షణ కూడా ప్రేమ కావచ్చు
ప్రేమంటే నువ్వే కావక్కర్లేదు
నీ ఊహల్లో నిండా మునిగిన నేను కావచ్చు
No comments:
Post a Comment