ఇండియా సెమి ఫైనల్ కి చేరిన తర్వాత కొన్ని ఆసక్తికర సంఘటనలు చేసుకున్నాయి. బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ అంపైర్ల నిర్ణయాల వల్లే తమ దేశం వోడిపొయిందని అవసరమైతే రాజీనమాకైనా సిద్దం అని ప్రకటించేశారు. ఒక ఫాన్స్ గా తను ఈ ఫలితాన్ని జీర్నిన్చుకోను అని దేబరించారు.
బంగ్లా మీడియా మరో అడుగు ముందుకేసి యుద్ద నేరాల కింద అంపైర్లను విచారించాలని పతాక శీర్షికలలో విషం కక్కాయి. అతి హాస్యాస్పదమైన విషయం ఆ దేశ ప్రధాని కూడా అంపైర్ల నిర్ణయాల వల్లే తమ దేశం వొడి పోయిందని ఎప్పటికైనా బంగ్లా పులులు జగజ్జేతలవుతారని జోస్యం చెప్పారు. రెండో విషయం లో ఎవరికీ ఆక్షేపనలు వుండక్కర్లేదు కాని మొదటి సంగతే అత్తా కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వి నందుకు అన్నట్టుంది.
ఇక మనం నిజా నిజాలు చూస్తే రోహిత్ ఆ వివాదాస్పదమైన బంతి కి అవుట్ అయ్యాడే అనుకుందాం. ఏమి అయి వుండేది. రోహిత్ తర్వాత 40 పరుగులు చేసాడేమో. మరి బంగ్లా జట్టు 109 పరుగుల తేడాతో కదా వొడి పోయింది.
మరి బంగ్లా జట్టు అవుట్ అవడానికి అంపైర్లే కారణం అంటే ఇంకేమి చెప్పలేం.
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఉమేష్ యాదవ్ వేసిన మొట్టమొదటి ఓవర్ నాలు గో బంతికే ఇమ్రుల్ కేస్ కాట్ బిహైండ్ రూపంలో ఔటయ్యాడు. స్నికోమీటర్ దాన్ని స్పష్టంగా చూపిం చింది కూడా. కాని అప్పీల్‌కు అంపైర్ స్పందిం చలేదు. మరి ఇదీ తప్పేగా. కాని పక్క దేశం జనాలకు మాయ బజార్ లో ప్రియ దర్శిని ఉన్నట్టుంది. వాళ్ళు వాళ్ళ ప్రియ మైనదే చూస్తారు కామొసు.
ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తె, ఇంకే పరంగాను అభివృద్ధి చెందని మన సమాజాలకు ( నేను ఇందుకో ఉప ఖండం జట్టులన్నిటిని కలుపుతున్నాను) జాతీయతా భావం మనం ఎంతో కోంత బాగా ప్రదర్శన చేస్తున్న క్రికెట్ లాంటి క్రీడల్లో బాగా ప్రతిఫలిస్తుంది.బ్రెజిల్ చిలి లాంటి దేశాల్లో ఫుట్ బాల్ కున్న క్రేజ్ ను నేను దీంతో పోలుస్తాను. సంస్కృతీ వ్యవహారాలూ పరిణతి పరిగణలోకి తీసుకుంటే, ఇండియా శ్రీలంక లతో పోలిస్తే మిగతా రెండు దేశాల్లో ఇలాంటి భావనలు విపరీతం స్తాయి చేరుతాయని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం రావల్పిండిలో ఆ దేశ క్రికెట్ కు జనం తద్దినం పెట్టిన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి.
కొంచెం ఎక్కువ అని చెప్పక పొతే తర్కానికందని ఈ జాతీయ భావాలు అనవసరమైన చోట్ల ఇలా ప్రతిఫలించడం ఆయా సమజాలకేమి మేలు చెయ్యదు. మన దేంతో గొప్ప దేశం కావచ్చు. మనం దాన్ని ఎంత గానో ప్రేమించచ్చు. కాని ఒక క్రీడ ను అదే స్పూర్తీ తో చూడాల్సిన అవసరం వుంది.
No comments:
Post a Comment