కన్నీళ్లు....
కలలు కనే నా కళ్ళకు అడ్డు పడే పరదాలు...
నిన్ను చూసి మురిసే భాగ్యమూ ఇవ్వని ఈ లోకపు పట్టింపులు..
జలతారు వెన్నెలలో కరిగే లెక్కలేని కాలాలలో
చిరకాలం నన్ను వెక్కిరించే కరకు విధాత లెక్కలు..
ఆకాశం...
చిన్నప్పుడు మా తగాదాలు తీర్చే వాడు మా తాతయ్య..
గోలీల కోసమో కానీల కోసమో చెలరేగిన చిరు తుఫానులు..
చేతులు వెనక్కు కట్టుకొని వయస్సు ఇచ్చిన వాలిన నడుముతో..
మసక బారిన ఆ కళ్ళ జోళ్ళ వెనక
చిలిపిగా నవ్వే ఆ కళ్ళు ..
హేమంతమో..గ్రీష్మమో..శరత్తో...
మెరుపులో..ఉరుములో..వానలో..వరదలో..
ఋతువులు చేసే చిలిపి చేతలు చూసి
మెల్లగా నవ్వుకునే పెద్ద మనిషి..
నా నేస్తం...
కన్నీళ్ళలో కష్టాలలో
పూట గడవని పాత రోజుల్లో
వెన్నంటే నిలచిన నా నీడ..