నాకు నువ్వు ఎప్పటి నుంచి తెలుసంటే ఏం చెప్పను ...
నువ్వు నా మీద చూపించే ప్రేమ చూస్తే మనం జన్మ జన్మలనుంచి పరిచయస్తులమే ...
రోజు నువ్వు నా మీద చూపించే శ్రద్ధ చూసి మురిసిపోయాను
నిన్ను నాకు పరిచయం చేసిన ఆ దేవుడ్ని మరీ మరీ పొగిడాను
భగ భగ మండే వేసవి ఎండల్లో
మనసులే గడ్డ కట్టే చలి కాలపు రోజుల్లో
నా తోడై నిలిచావు నీ తోడిదే లోకమన్నావు
ఇలాగే గడిస్తే కల కాలం
ఇంకేంవద్దని పించింది
ఇలాగే నడిస్తే కాలం
కధలో ఇక మలుపేముంది
ప్రతీ రోజు వచ్ఛే లా ఆ రోజూ వచ్చింది
ఈ ఘోరమిక చూడలేనని ఆకాశం నల్లబారింది
నా నేస్తం నా తో వ్యాహ్యాళికి నడిచింది
నీతో నా బ్రతుకిక నీతో నా చావిక
నీవుంటే నాతొ ఇక ప్రతీ క్షణం
ఒక మరపు రాని కానుక
ఆ క్షణం అనిపించలేదు
నువ్వు నన్ను తీసుకెళ్తుంది
బలిపీఠానికని
ఆ లిప్తలో తెలియలేదు
నువ్వు నన్నెప్పుడు ప్రేమించలేదని
కాలమనే కసాయికి నువ్వు నన్ను అప్పగిస్తావని
పదే పదే నీ కళ్ళకు నేనెదురైనా తప్పించుకు పోతావని
తెలుసు కున్నాక మ్రాన్పడి పోయాను
తప్పించుకునే అవకాశమున్నా నేను పరుగు తీయలేదు
నువ్వే నన్ను వద్దనుకున్నాక ఎక్కడికి పరిగెత్తాలి
కొన ఊపిరిలో కూడా నీ రూపమే
కావాలనే నా కళ్ళకి ఒక్క సారి కనిపిస్తావా
నీ కళ్ళల్లో తొంగి చూడాలని ఉంది
నీ కళ్ళలో కన పడే ఆ సన్నని కన్నీటి తెర
ఆనంద భాష్పాలు కాదు నా కోసం జారిన కన్నీరని
చివరిసారి మోసపోవాలని ఉంది