మనదైన కాస్త సమయం కరిమబ్బులు కమ్మేస్తాయ్
ఆకాశం అర్ణవమై రుధిరాక్షరాలు రాసినా రాస్తుంది
మనం కలిసిన ప్రతీసారి ప్రళయమో విలయమో
ఎవరు తలవని వైపరీత్యమో
నువ్వు నాదానివన్నా ఊహ వచ్చిన మరుక్షణం
కాలమైనా ఆగిపోతుంది లోకమైన ఊగిపోతోంది
మనం కలిస్తే నన్దనవనాలు స్మశాన సదృశాలవుతాయేమో
రేయి పగలు తేడా లేక కుంభవ్రుష్టులు కురుస్తాయేమో
సమస్య అదేదీ కాదంటే నీకు నేను ఏమవుతానంటావ్
అప్పుడే మురిపిస్తావ్ మరుక్షణం మరిపిస్తావ్
నేను నీ దానినని బాసలు చేస్తావ్
కానీ ఓ నాలుగడుగులు కలిసి నడవ్వు
నీ సాంగత్యంలో ఈ భువిని స్వర్గం చేస్తావ్
మరుక్షణం మరీచికలా మాయమవుతావ్
నీ వొడిలో పసిపాపలా సేదదీరే లోపు
కరకు కత్తుల లాంటి మాటలతో నా ఊహల కుత్తుక కోస్తావ్
ఎప్పుడో నువ్వన్నట్టు మనకు రాసిలేదు
ఆ కళ్ళు కుట్టిన దేవుడికి మన ఊసే రాదు
కాలం కర్మం కలిసొస్తే మరు జన్మకు కలుద్దాం
ఏది ఏమైనా కానీ కలకాలం కలిసుందాం
ఎవరో అడిగారు నన్ను..ఈ కవితేదో
అర్దాన్తరం గా ఉందని,,
ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను
ఇంతకన్నా నాకు వేరే ముగింపు తోచలేదని
మరు జన్మలో అన్నా కలుస్తామనే పిచ్చి ఆశ
నా ఒక్కడిదేనని చెప్పలేక చేతకాక...
నీ కళ్ళలో ద్యోతకమయ్యే వేల కళల్లో
నా కలలు ఎపుడైనా తళుక్కున మెరుస్తాయేమో అని
కాలాలు మరిచి వేచి చూసే నీ........