Sunday, February 6, 2011

ఆయన సైతం..

ఈ మద్య ఇంటర్నెట్ లో చూసిన జోక్. భారత ద్రవ్య ముల్యాన్కనాన్ని తిరగ రాస్తూ ఒక మిత్రుని సృష్టి.
ఒక వంద కోట్లు = ఒక ఎడ్డి (ఎడుయురప్ప)
వంద ఎడ్లు= ఒక రెడ్డి ( రెడ్డి సోదరులు)
వంద రెడ్లు = ఒక రాడియా ( టు జీ స్కాం)
వంద రాడియా లు = ఒక కల్మాడి
వంద కల్మాడి లు = ఒక పవార్ ( శరద్ పవార్)
వంద పవార్ లు= ఒక రాజా ( టు జి స్కాం)
వంద రాజాలు = ఒక సోనియా
ఇదేదో విడ్డురం అనుకోకండి.అవినీతి ని ప్రజాస్వామ్యం లో విడదీయరాని అంతర్భాగం చేసిన నేటి ప్రభుత కు, రేపో మాపో ఈ ముల్యన్కన పద్దతి ని పిల్ల ల పుస్తకాల్లో అచ్చేయించడం పెద్ద సమస్య కాదు. రేపు మీ పిల్లలో మా పిల్లలో అవన్నీ వల్లే వేయటం పెద్ద కష్టము కాదు. స్విస్స్ బ్యాంకు లలో నల్ల డబ్బు ముల్గుతుంది బాబోయ్ అని ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే, వాళ్ళ పేర్లు ప్రకటించం అని ప్రభుత్వమే ప్రకటిస్తుంటే, ఈ పై లిస్టు లో పెద్దలను ఏమి చెయ్యలేరు అనేది నిర్వివాదాంశం.
ఇక నాణానికి ఇంకో వైపు. ఆయన గొప్ప నటుడు. యావదాంద్ర లో ఆయన సినిమా వచ్చిందంటే, ౧-౨ నెలలు టికెట్లు దొరకవు. అలాంటి ఆయన సమసమాజం స్తాపిస్తానని, కొత్త పార్టీ పెట్టాడు. గాంధీ ఫులే తెరెసా బొమ్మలేట్టుకొని సేవే మార్గం అని బయలు దేరాడు. ఆయన మాటలు నమ్మి వెంట నడిచిన కొందరు కొన్ని రోజుల్లోనే కళ్ళు తెరిచి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మా లాంటి నేలబారు అభిమానులు ఇంకా ఆశ చావక ఇంకా ఆయనేదో సాదిన్చేస్తాడని నమ్మాం .నా పాత టపా లో సమైక్యంద్ర వైపు నిలబడ్డందుకు మిగతా పార్టీ ల లాగ రెండు నాల్కల ధోరణి లేనందుకు నేనే, ఆయన్ను ఒక్క మగాడు ఆనేసాను.
అలాంటి పెద్దాయన, ఈ రోజు నేను సైతం జన జీవన స్రవంతి లో కలుస్తాను అని, పైన ఉన్న లిస్టు లో ఎక్కేస్తానంటు బైలు దేరాడు. ప్రజాభోజ్యం పార్టీ గీతం నేను సైతం అపహాస్యం పాలైంది. అన్న గారన్నట్టు, కుక్క మూతి పిందె లా మిగిలి పోయింది.ఆంగ్లం లో అవినీతి, పైన పేర్కున్న ఘనత వహించిన, శతాబ్దాల చరిత్ర ఉన్న గొప్ప పార్టీ పేర్లు రెండు ఒకే అక్షరం తో
ప్రారంభం అవటం యాదృచ్చికం కాదు అనిపిస్తుంది.అల్లాంటి పార్టీ లో చేరి అయ్యవారు సామాజిక న్యాయం దేవుడెరుగు కాని, ఆయన మాత్రం బాగానే బావుకో బోతున్నాడని వినికిడి.
తొందరేముంది, త్వరలో ఆయన గారు సైతం ఏదో ఒక మంత్రి పదవో, గింత్రి పదవో చేపట్టడం ఖాయం.gమనం మల్ల వెర్రి మొహాలేస్కుని చూడటం పరిపాటే..
ఇదంతా, సామాజిక న్యాయమనో, మన మగా స్టార్ అనో వోట్లు పారేస్కున్న జనాలకు చెంపపెట్టు..డెబ్బై లక్షల మంది వేర్రినాగాన్నలకు మేలుకొలుపు...ఈ సారి ఎన్నికల్లో నైనా మనం మన వోటు విలువ తెలుసుకొని, వొళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని వినియోగించుకోవాలి.లేదంటే ఇంకో గిగా స్టార్ యో, లేక పలానా వారసులో పార్టీ పెట్టె అవకాసం ఉంది. మన వోట్లు ఆయన అమ్ముకొన్ని డబ్బు చేస్కునే ప్రమాదం లేకపోలేదు...
సరే ప్రస్తుతానికి యెంత చెడ్డా మన మగ స్టార్ కి శుభాకాంక్షలు. మీరు సైతం మీరు సైతం...బాగా వృద్ది లోకి రావాలాని, ఏదో ఒక రోజు ఆ పై లిస్టు లో చేరాలని మా ఆకాంక్ష

No comments:

Post a Comment