లిఫ్ట్ బటన్ నొక్కాను. పైనుంచి బీప్ శబ్దం వినపడుతుంది. లిఫ్ట్ వచ్చి ఆగింది. డోర్ తీస్కోని లోపలి కెల్లాను. సెల్లార్ బటన్ నొక్కాను.లిఫ్ట్ మెల్లగా కిందకు కదులుతుంది. ౨ ఫ్ల్లోర్ కిర్రు మన్న శబ్దం. బైట బోరునకురుస్తున్న వాన ఇంకా తగ్గినట్టు లేదు. ఒక పఫ్ కొడదామని కింద బడ్డి కొట్టు దగ్గరకు వెళ్తున్నాను. బైట మసక వెలుతురు లో ఒక రూపం. అస్పష్టం గా,మనిషి రూపం. నైట్ గౌన్ వేసుకున్న అమ్మాయి.ఇప్పుడే తల స్నానం చేసిందేమో, జుట్టు తుడుచు కోవడానికి బైట కొచ్చి నట్టుంది. ౧ ఫ్లోర్ మెల్లగా కిందకు దిగుతుంది లిఫ్ట్.బైట ఎవరో కుడి వైపు నుండి ఎడమ వైపుకు వెళ్ళారు. నేను కొంచెం ఆశ్చర్య పోయ్యా. అదే అమ్మాయి, అదేమిటి ఇందాకే కదా ౨ ఫ్లోర్ లో ఉంది అనుకున్నా. ఏమన్నా ఆట ఆడుతుందా అంటే ఇంకెవరు లేరు. ఇంత రాత్రి పూట, ఇదేమి ఆనందం. గ్రౌండ్ ఫ్లోర్ మల్ల అదే అమ్మాయి. ఈ సారి నన్నే చూస్తుంది. తనకు నాకు మద్య ౨ డోర్లు. కటకటాల మద్య లోంచి కొంచెం బయపడుతూనే చూసా. సగం మొహం జుట్టు కప్పేసింది. మంచి కలర్ ఏమో చాల బాగా కనపడింది మిగతా బాగం. కాదు కలర్ కాదు అదేదో, రోగం వచ్చి పాలి పోయి నట్టు.తెల్లగా, అదేదో రకం గా. గుంటల్లో ఉన్నకళ్ళు, నా మొహం లో ఏదో వెతుకుతున్నట్టు. చెప్పొద్దూ, కొంచెం భయం వేసింది. మరీ దగ్గర గా ఉన్నామేమో, ఆమె వంటి నుంచి అదేదో వాసన. ఏదో శవం నుంచి వస్తున్నట్టు. ఇంతలో కిర్రు మంటూ లిఫ్ట్ ఆగింది.
వాచ్ మాన్ కుక్క ఎప్పుడు ఆ లిఫ్ట్ పక్కనే పడుకుంటుంది. తలుపు తీసుకొని బైటకి రాగానే, నా వైపు చూసింది. ఇంత వరకు అది అలా మొరగటం నేను వినలేదు. భయానకం గా అరుస్తూ పరిగెత్తి పోయింది. అది నన్ను కాదు నా వెనక చూస్తుందని అర్ధం అయ్యింది. ఎవరో వెనక నిలబడ్డట్టు అలికిడి.సెల్లార్ లో వాన దెబ్బ కి చల్లటి గాలి వీస్తున్నా, నా నుదుటి మీద చెమట చెంప మీదకు జారటం తెలుస్తూనే ఉంది. నా గుండె వేగం గా కొట్టు కుంటుంది. మెల్లగా తల పక్కకు తిప్పి చూసా. ఎవరు లేరు కాని అదేదో నీడ కదిలి నట్టు అనిపించింది. చప్పున ముందుకు తిరిగాను. సెల్లార్ లో చల్లటి గాలి మొహాన కొట్టింది.మెల్లగా బైటకు నడుస్తున్నాను. జోరున గాలి వాన. మా మియాపూర్ లో ఈ దెబ్బకి ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు. కార్ల మద్య నుంచి నడుస్తున్నాను.దూరం లో వాచ్ మాన్ రాములు ఇల్లు. చిన్న లైట్ కనపడుతుంది. దాని పక్కనే, బడ్డి కొట్టు.
చుట్టు పక్కల వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ అవి ఇవి కొనడానికి రావటం కద్దు.నేను వెళ్ళే టప్పటికి ఎవరో అమ్మాయి ఆ కొట్టు వాడితో మాట్లాడుతోంది.ఏదో కొంటుంది కామోసు. నేను సిగరెట్టు తీస్కోని డబ్బులివ్వ బోతూ ఎధాలాపం గా అటు చూసాను. అవే కళ్ళు. కాని ముక్కు లో నుంచి ఏదో ద్రవం కారు తోంది. చిక్కగా,రక్తమే అది...అప్పుడే కరెంట్ పోయిందేమో, కొట్టువాడు వెలిగించిన కొవ్వొత్తి గాలికి రెప రెప లాడుతుంది.ఆ వెలుతురూ లోంచి ముఖం మీద పడ్డ జుట్టు లోంచి లీల గా కాన పడుతుంది ఆమె మొహం.ఇందాక చూసినప్పుడు కళ్ళు ఉన్న ప్రాంతం లో అదే ఆకారం లో తెల్లగా, ఉన్న కనుగుడ్లు నాలో భయాన్ని రేకెత్తించాయి.ఉన్నట్టుండి ఒక కంట్లోంచి వచ్చిన పేడ పురుగు చిన్నగా పాకి ఇంకో కంట్లో కి వెళ్ళింది.
బాబోయ్..చిన్నగా నా నోట్లోంచి వచ్చిన కేక అక్కడే ఆగి పోయింది. ఇంకేమన్నా కావాలా అన్ని కొట్టు వాడి మాటలతో ఈ లోకం లోకి వచ్చాను.వాడికి డబ్బులు ఇచ్చి ఇటు చూసేంతలో మాయ మైంది.ఆ చీకట్లో కళ్ళు మిటకరించి చూసాను. దూరం గా స్మశానం లో ఏదో నీడ కదిలి పోతుంది. మా అపార్ట్మెంట్ కి స్మశానానికి మద్య ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. మనుష్యులు దూకే అవకాశం లేదు. ఆ ఆకారం అలా ఆగి, నా వైపు చూసినట్టు అనిపించింది. వన్ను లో వణుకు మొదలైంది. బాగా రాత్రి అయిందేమో, కొట్టు వాడు కొట్టు మూసేసి,బయలుదేరాడు. చుట్టు పక్కల నిర్మానుష్యం.భోరున వాన. గాలి. కరెంట్ పోవడం తో కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. generator ఉన్నవాళ్ళ అపార్ట్మెంట్ లోంచి వెలుతురూ పడుతోంది.నెమ్మది గా మెట్ల వైపు నడిచాను.
గ్రౌండ్ ఫ్లోర్ దాటాక వినిపించింది. సన్నని ఏడుపు.కర్ణ కటోరంగా.చిన్నగా ప్రారంభమై,కాసేపటి తరవాత ఆగిపోతుంది. తెరలు తెరలు గా, నిదానం గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను.౧ ఫ్లోర్ మెట్ల మీద కుర్చుని ఉంది. ఆమె. అదే నైట్ గౌన్, కాని ఆమె కాళ్ళ దగ్గరనుంచి ఏదో కారి మెట్లమీద పారుతుంది. చిక్కటి రక్తం, అదే శవం వాసన. ఉన్నట్టుండి ధైర్యం పున్జుకున్నాను.వడి వడి గా ఆమె పక్కనుంచి పోదామని.ముంగాళ్ళ మీద కుర్చుని సన్నగా ఏడుస్తోంది. తల వొడిలో పెట్టుకోవడం తో ఏమి ముఖం కన పడట్లేదు. ఆమె కూర్చున్న మెట్టు దగ్గరకి రాగానే తలెత్తి చూసింది. అప్పుడు గమనించాను ఆమె పళ్ళు.నల్లగా గార పట్టి, నోట్లోంచి ఆకు పచ్చటి రంగులో...గబా గబా మేట్లేక్కబోయాను. ఆమె నన్ను వెంబడించింది. ఆమె ఆ మెట్ల మీద విచిత్రం గా పాకుతుంది. చేతులు ముందు మెట్ల మీద పెట్టి, పైకి పాకుతుంది చిన్న పిల్లల్లా. ఇంకో మెట్టు, నా కాలు అందుకుంది.గట్టిగా పట్టి లాగింది.
నా పట్టు సడలింది. నేను జారి పోవడం నాకు తెలుస్తుంది.వెనక్కి చూసాను. చిత్రమైన శబ్దం చేస్తూ, ఆమె నా పైకి వస్తుంది. మెట్ల మీద పడి పోయాను. క్రమక్రమం గా ఆమె నా మీద కోస్తోంది. భయంకరమైన ఆమె మొహం నా మొహం మీదకు...
దిగ్గున లేచి కూర్చున్నాను. వళ్ళంతా తడిచి పోయింది. మంచం కింద పడి ఉన్నాను.చిన్నగా బాటిల్ అందుకుని మొత్తం తాగేశాను. ఓ...ఇదంతా కలా...బతికించావు దేవుడా...ఆనుకొని ఒకసారి గడియారం చూసాను. ౩:౦౦ AM మల్లా చిన్నగా నిద్రకుపక్రమించాను.మా రూం వాళ్ళంతా, ఊళ్లకు వేల్లారేమో ఒక్కన్నే ఉన్నాను.
టింగ్ టింగ్ డోర్ బెల్.ఈ టైం లో ఎవరు...కొంపదీసి...బయ పడుతూనే,కీ హోల్ లోంచి చూసాను. అవే కళ్ళు...అదే మొహం...ఆశ గా కీ హోల్ ని చూస్తుంది...
(ఇప్పుడే చుసిన హారర్ సినిమా కి నా పైత్యం జోడించి ;) )
No comments:
Post a Comment