Friday, January 6, 2012

రంగుల రాట్నం...ఇండియన్ క్రికెట్ ...అమెరికతలు-౧౩

నిజమే...జీవితమే కాదు..మన క్రికెట్ కూడా..
వరల్డ్ కప్ తర్వాత మన వీరాధి వీరులు వెస్ట్ ఇండీస్ వెళ్లారు.ఎనిమిదో స్తానంలో ఉన్న పసికూనలమీద మీసం మేలేసారు.తర్వాత ఇంగ్లాండ్ వెళ్లారు.అన్ని ఫార్మట్లలోను వాళ్ళు మనల్ని ఉతికి ఆరేసారు.ఆపద్భందావుల్లా మల్లా, వెస్ట్ ఇండీస్ ఇండియా వచ్చారు. ఆ పూనం పాండే చెప్పినట్టు, హోం గ్రౌండ్ లో మనోళ్ళు చెలరేగిపోయారు.ఇక, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు మన టీం ని ఉతికి గంజి పెడుతున్నారు.

రంగుల రాట్నం అంటే ఇదే కదా.ఇంట్లో లయన్ వీదిలో కౌన్ అన్నట్టు ఉంది మన క్రికెట్ పరిస్తితి.ఆశావహులేవరైనా ఇంగ్లాండ్ లో చాల మంది గాయాల బారిన పడ్డారని సముదాయించు కోవచ్చు.కాని ఇప్పుడేమి చెబుతారు.మా దోస్తు ఒకడు ఇండియా గ్రహస్తితి బాలేదని వక్కాణించాడు.నేను కొంతవరకు ఆమోదించాను.గ్రౌండ్లో ఆడే బాలు కూడా గ్రహాలవలె గుండ్రం గానే ఉంటుంది కదా..అదే అనుకూలించట్లేదు అని చెప్పాను.సంకల్ప బలం కన్నా ఏ గ్రహబలం అక్ఖర్లేదని ఇక్కడదే కొరవడిందని చూస్తేనే తెలుస్తుంది.

ఆస్ట్రేలియా టూర్ ముందు, ఇంకేముంది ఇంత వీక్ బౌలింగ్ లైన్ అప్ తో ఉన్న వాళ్ళను చిత్తూ చిత్తూ గా వోడించ వచ్చు అనుకున్నాం. కానీ, చరిత్ర అడ్డం తిరిగింది.పులి వేటగాడి వెంట పడింది.తుపాకి చేతిలో పట్టుకొని కూడా వేటగాడు పారి పోతున్నాడు.మరి విశ్వ విఖ్యాత బాటింగ్ లైన్ అప్ గురుంచి నేనిన్కేమి చెప్పనూ.కర్ణుడి టైపు లో పుట్టడం తోనే బాట్లతో పుట్టారా అన్నట్టు ఉంటాయి మన వాళ్ళ రికార్డులు.అదీ నిజమేనేమో, మంచి యుద్ధం లో కర్ణుడికి శాపాలు ముసురుకున్నట్టు మనోల్ల బాట్లు స్కోరే చేయటం లేదు.ఇక వాళ్ళ సంగతి.ఏ టీం ఐనా ఫార్మ్ లో కి రావాలంటే, ఇండియా ని ఒక టూర్ కి పిలిస్తే చాలు అని గవాస్కర్ అన్నట్టు, అన్ని విభాగాల్లో వారు చనిపోయే వానికి సంజీవని దొరికినట్టు పునరుజ్జీవనం పొందారు.

సర్వకాల సర్వావస్తలలో   అనుమానాస్పదం గా ఉండే మన బౌలింగ్ మళ్ళీ అభాసు పాలైంది.అంతేనా,సచిన్,ద్రావిడ్ లక్ష్మణ్ బాటింగ్ లైన్ అప్ లో గొప్ప బాట్స్మాన్ అని వరసగా పిల్చుకుంటూ ఉంటె, వాళ్ళు అపార్దం చేసుకున్నట్టు ఉంది.వరసగా పెవిలియన్ దారి పడుతున్నారు. వేయి ఆవులను గుటుక్కు మని పించిన రాబందు ఒక్క తుఫానుకు హుష్ కాకి అన్నట్టు, మంచి బౌలింగ్ ఎటాక్ ముందు,మన బాటింగ్ లైన్ అప్ బుర్జ్ దుబాయ్ కాదు, పేక మేడ అని నిరూపించేస్తున్నారు.

భారత క్రికెట్ అభిమానుల్లారా...ఇక ఒకే ఒక దారి. టీం ఇండియా 4 - ౦ తో వోడిపోకుండా ఉండాలంటే...మీ మీ ఇష్ట దైవాలను ప్రార్దించండి.శక్తి కొలది ఫలమో పుష్పము తోయమో సమర్పించేసుకోండి. ఎందుకంటె, ఇక వాళ్ళే ఈ సీరీస్ లో ఏమైనా చెయ్యగలరు, ;)



1 comment: