జింబాబ్వే దేశ రిజర్వు బ్యాంకు ఈ మద్యనే 100 ట్రిల్లియన్ విలువ గల నోటు ను ముద్రించింది. అంటే ఒకటి పక్కన 14 సున్నాలన్న మాట. మరి అంత పెద్ద నోటు అవసరము ఎందుకొచ్చింది అంటే..ఆ దేశం లో ద్రవ్యోల్బలం ఎంతలా పెరిగి పోయిందంటే, 700 మిలియన్ లతో మీరొక బ్రెడ్ ముక్క కొనుక్కోవచ్చు. ౩ గుడ్లు కేవలం ౧౦౦ బిలియన్లు ( ౧ పక్కన ౧౧ సున్నాలు).కాబట్టి, ఒక హోటల్ కు వెళ్ళినా, సినిమాకు వెళ్ళినా పై నోటు పనికొస్తుందన్న మాట.
ఇక్కడ అంత ముక్కు మీద వేలేసుకునే పరిస్తితి ఏమి టంటే, ఇంత జరుగుతున్నా, మన అద్యక్షుడు ముగాబే కి చీమ కుట్టినట్టైనా లేదు. ఆయన రాజ్య వ్యవహారాలూ ఆయన చూసుకుంటున్నాడు. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. తన వ్యాపార వ్యవహారాలూ చక్క పెట్టుకుంటున్నాడు. జనం ఏమై పొతే వారికేమి.
ఇక ఇండియా విషయాని కొస్తే, మన మార్కెట్ల మీద ప్రభుత్వానికి పట్టు ఉన్నట్టు కనపడదు. ఉప్పు పప్పు ధర ఉట్టికేక్కితే, ఉల్లి ఆకాశాని కెక్కింది. దీన్ని పర్య వేక్షించవలసిన వాణిజ్య మంత్రి యెంత గొప్ప గా పని చేస్తున్నారంటే, మొన్నీ మద్య పత్రికా విలేఖరుల సమావేశం లో ఆయన కళ్ళ నీళ్ళు పట్టుకున్నంత పని చేసారు. ఎందుకట, పాకిస్తాన్ ఉల్లి సరఫరా ఆపేసినందు కట. ౨-౩ నెల్ల క్రింద వరకు కిలో పది రూపాయలకు పాక్ కు ఎగుమతి చేసిన ఉల్లి, అదే పాక్ దగ్గర, కిలో నలభై రూపాయల కు దిగుమతి చేసుకుంటున్నాం అంటే, మనోళ్ళు యెంత పని మంతులో అర్ధం అవుతుంది.ఇదెంత తెలివైన వ్యాపారమో ఒకటో తరగతి పిల్లోడు లెక్క వెయ్యకుండా చెప్పేస్తాడు.
అంత అంతర్యుద్ధాలతో కిందా మీదా పడుతున్న పాకి వాళ్ళకున్న బుద్ధి మనోళ్ళకు లేకుండా పోయింది. ఇక్కడ ఇంకో చిక్కు ఉందని మనం అర్ధం చేస్కోవాలి. దొంగ గిడ్డంగుల్లో దాచిన సరుకు పట్టు కోవాలంటే...అది దాచింది అస్మదీయులైతే కుదరదు కదా..రాజాలు కల్మాడిలతో లుక లుక లాడుతున్న ప్రభుత్వం లో నీతి, నేతి బీరలో నేతి చందమే.మన ప్రభుత్వం,కొంచెం మంచి మనసు చేసి ఆలోచిస్తే మార్గాలు లేక కాదు.
మన దేశం లో ఉన్న వ్యవస్థ అటు రైతు కు ఇటు వినియోగదారు కు లాభించే పరిస్తితి లేదు. రైతు నుండి, వినియోగదారు కు చేరే లోపు ఒక వస్తువు వందల రెట్లు ధర పెరుగుతుంది.ఆలోచిస్తే, మద్య దళారి వ్యవస్థ ఇందులో ఎక్కువ లాభ పడుతుంది. ప్రతి రైతు కి తన ఉత్పత్తి తనే అమ్ముకునే పరిస్తితి కల్పించాలి. వేల కోట్లు పరిహారాలిచ్చే బదులు పకడ్బంది గిడ్డంగి వ్యవస్థ ఏర్పరచాలి. ఉత్పత్తి చెడిపోకుండా, ప్యాకింగ్ సదుపాయాలూ కల్పించాలి.రైతు ఈ ఖర్చులు కలిపి నేరుగా వినియోగదారు నుంచి వసూలు చెయ్యచ్చు. ఈ వ్యవస్థ అంతా ఏర్పడే లోపు మన ప్రస్తుత దళారీ వ్యవస్థ కూడా కోన సాగించోచ్చు.
వచ్చే ౨-౩ ఏళ్ళు రైతులకు ఇలాంటి అమ్మకాల మీద సుంకం మాఫీ చెయ్యచ్చు.ఇలాంటి వ్యవస్థ లో ప్రస్తుతం కన్నా చాల తక్కువ ధర కు ఉత్పత్తులు దొరికే అవకాశముంది. అయినా, ఇలాంటి అవుడియా లు మన ఘనత వహించిన పెద్ద మనుషులకు రాక పోతాయా.
ఇప్పుడున్న రాజకీయం, ఎప్పుడో ఇవన్నీ గ్రహించి సూత్రీకరించింది. రోటి కపడా మకాన్ అని. అంటే, జనాలని మౌలిక మైన వీటికే మొహం వాచే టట్టు చెయ్యాలే. అప్పుడు వాళ్ళు ఇంకో విషయం గురుంచి ఆలోచించరు..మన పని ;) మనం చక్కగా చక్కపెట్టుకోవచ్చు అని...
No comments:
Post a Comment