Sunday, October 30, 2011

మోటర్ సైకిల్ డైరీ అమెరికతలు-౧౦

౬౧  ఏళ్ళ క్రితం...
దక్షిణ చిలి లో ఒక ప్రాంతం. సమయం సాయంత్రం ౮:౩౦
వొరేయ్ నా మాట విని వెనక్కు రారా..
మీ అమ్మకు నేనేమి చెప్పాలి..మామూలు గ చెప్తే అర్ధం కాదా
అమెజాన్ నది ఒడ్డున నిలబడి అరుస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ళ యువకుడు.
పోరా పో..పుట్టిన రోజే నీ చావు రాసి ఉంది
వాడి మొహం లో అసహనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
వాడి మాటలు విన్నారేమో చుట్టూ పక్కల జనం పోగవుతున్నారు.
గువేరా...మొండి గ ప్రవర్తించకు..నది పోటు మీదుంది...ఆవలి ఒడ్డు కు పోలేవు...
అరిచింది పక్కల చర్చి లో పని చేసే నన్.
అందరి మొహాల్లో ఆందోళన, అసహనం,కోపం,కొండకొంచో బాధ.
ఇవేవి పట్టనట్టు నదిలో ఈదుతున్నాడు ౨౩ ఏళ్ళ యువకుడు.
సగం దూరం దాటి వచ్చేసాడు. కాని పోతెట్టుతున్న అమెజాన్ ప్రవాహం తో పోటీ పడలేకున్నాడు.
దానికి తోడూ ఆస్తమా రోగి ఏమో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.ఆవలి వైపు దీపాలు మినుకు మినికు మంటున్నాయి. చేతులు ఆడిస్తున్నాడు కాని దూరం ఇంకా ఎక్కువవుతున్నట్టుంది. ఆవలి వైపు గుమిగూడిన జనం అరుస్తున్నారు."గువేరా కం ఆన్ యు కాన్ డు ఇట్" 
లీల గా వినపడుతున్నాయి. కాని మద్యలో శ్వాస తీసుకోవడం కష్టం అయి పోతుంది. ఎదురుగా కనపడుతున్న దీపాలు స్పష్టత కోల్పోవడం తెలుస్తుంది. చేతులు ఆడించడం కూడా ఆపేసాడు గువేరా..ఇంతలో రెండు బలమైన చేతులు అతన్ని లాక్కేల్లటం తెలుస్తుంది. ఆవలి వొడ్డున ఉన్న జనం ముందు వెనుక ఆలోచించ కుండ నదిలో దూకారు తనని కాపాడటానికి.
ఆరోజు జూన్ ౧౪. అతని పుట్టిన రోజు. సావో పాబ్లో లో ఉన్న కుష్టు వ్యాది చికిత్స కేంద్రం.అమెజాన్ నది ఒక వొడ్డున రోగులు ఉండే చిన్న దీవి. మరో వైపు డాక్టర్లు,నర్సులు, మరి ఆ కేంద్రం నిర్వహించే క్రిస్టియన్ నన్లు ఉండే ప్రాంతం.రాత్రి పూట ఎవరు ఇటువైపు నుంచి అటు వెళ్లారు. కుష్టు అంటూ వ్యాది కాదు అనే ఎరుక ఉన్నప్పటికీ వ్యాది గ్రస్తులని దూరంగా ఉంచడం పరిపాటే.
సరిగ్గా, ౭ నెలల క్రితం అర్జెంటినా నుండి బయలుదేరారు ఈ ఇద్దరు మిత్రులు. ఒకరు గువేరా.మెడిసిన్ విద్యార్ది.ఇంకొకరు అల్బెర్టో. బయో కెమిస్ట్రీ విద్యార్ది. వయసు ఇచ్చిన ఊపు తో దక్షిణ అమెరికా చుట్టేయ్యాలని ఇద్దరి తపన.సాధనం  ఒక డొక్కు నార్టన్ ౫౦౦ మోటర్ సైకిల్.౪ నెలల్లో ౮ వేల కిలోమీటర్లు తిరిగేయ్యలని ప్రయత్నం.అర్జెంటిన  ,చిలి,పేరు,వేనుజువేల ల మీదుగా తిరిగి అర్జెంటిన అనేది పూర్తి ప్రయాణం.
వారు ఏది అనుకోని బయలు దేరినా, సిద్దార్దుడు బైట ప్రపంచం చూసి ఆవేదన చెందినట్టు, ఇద్దరు మిత్రులు దక్షిణ అమెరికా లోని విభిన్న ప్రాంతాల్లో తాండవిస్తున్న పేదరికాన్ని చూసి కొత్త పాఠాలు  నేర్చుకుంటారు. రక రకాల కష్టాలకు, అణచివేతకు గురి అవుతున్న పేద అమెరికన్లను చూసి పెట్టు బడి దారి వ్యవస్థ అందరి భందువు కాదని అర్ధం చేసుకుంటారు. ముఖ్యం గా వలస విధానాలతో అన్నీ కోల్పోయిన నేటివ్ అమెరికన్లను, కేవలం జ్వరానికి కూడా మందులు కొనలేని, ఆస్పత్రి కి వెళ్ళలేని వారి దైన్యం ఇద్దరినీ కదిలిస్తుంది.
చిలి లోని అనకొండ కాపర్ గనుల్లో పని చేసే కార్మికుల స్తితి వారిని వెంటాడుతుంది. రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్తితుల్లో గంటల కొద్ది కనీస అవసరాలైన తాగు నీటికి కూడా నోచుకోని  కార్మికులు అక్కడి గనుల్లో మగ్గిపోవటం, కొన్ని సందర్భాలలో గాలి కూడా ఆడక అసువులు బాయటం గువేరా మనసులో  చెరగని ముద్ర వేస్తుంది. ప్రపంచం పెద్ద పెద్ద నగరాల్లో, పెట్టు బడి దారుల ఆకాశ హర్యాల్లో లేదని, ప్రపంచం అంటే అనుదినం అణచివేతకు గురయ్యే రైతుల,కార్మికుల సంఘర్షణ లో ఉందని వారి జీవన పోరాటం లో ఉందని మిత్రులు గ్రహిస్తారు.
వారి చివరి మజిలి సావో పాబ్లో లో కుష్టు వ్యాది చికిత్స కేంద్రం. ఇద్దరు అక్కడ ఉచితం గా సేవలు అందిస్తారు.ఐతే అనుకోకుండా గువేరా పుట్టిన రోజు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే వస్తుంది. రాత్రుళ్ళు రోగుల వైపు వెళ్ళని చికిత్స కేంద్రం పద్దతులను కాదని, ఆవలి వొడ్డుకు పడవ కూడా లేని పరిస్తుతుల్లో తన పుట్టిన రోజు వ్యాదిగ్రస్తులతో జరుపు కోవటానికి గువేరా తాపత్రయం పై ఘట్టం. రోజు తనతో ఫుట్ బాల్ ఆడే మోసెస్,తను సమాధాన పరచిన తర్వాత చికిత్స కు సహకరించిన ఎలిజాబెత్, తనతో కలిసి రోజు భోజనం చేస్తానని మంకు పట్టు పట్టే చిన్నారి మైకేల్, తన కోసం ఆహరం దాచి పెట్టి ఉంచే పదేళ్ళ  ఒలేన, వీళ్ళందర్నీ   ఒదిలి పుట్టినరోజు జరుపు కోవటం గువేరా కు ఎలా మనస్కరిస్తుంది. 
ఈ ఆఖరి మజిలి తర్వాత గువేరా తన మెడికల్ డిగ్రీ పూర్తి చేసాడు. గ్రనాడో అదే కుష్టు వ్యాది కేంద్రం లో చాల ఏళ్ళు సేవలందిస్తాడు. తమ యాత్ర గురించి ఇద్దరు మిత్రులు తమ తమ డైరీ లలో ప్రముఖం గా రాసుకున్నారు.
ఇద్దరు యువకుల యాత్ర దక్షిణ అమెరికా చరిత్ర నే ఎలా మార్చేసిందో తర్వాత ప్రపంచం తెలుసుకుంటుంది. 
చే తన జీవితం లో ప్రత్యక్షం గా పరోక్షం గా పాల్గొన్న విప్లవాలు చిలి బొలివియా క్యూబా కాంగో అయితే పరోక్షం గా ప్రపంచ ప్రజల మనోభావాలను ఎప్పటికీ ప్రభావితం చేసిన విప్లవ కారుడు.
ప్రపంచం పట్ల ఆయన దృక్పదం సమూలం గా మార్చివేసిన పై యాత్ర న్యూ యార్క్ టైమ్స్ లో మోటర్ సైకిల్ డైరీ పేరిట ప్రచురితం అయింది. అదే పేరు తో అద్భుతమైన స్పానిష్ చలన చిత్రం విడుదల అయింది.


Friday, October 28, 2011

వేయి తుపాకులు ఘర్జించనీ..


స్వాతంత్రం సిద్దించే రోజు 
మరో యుగం ముందున్నా
ఊహలు ఆశలు కాలపు కర్కసపు కౌగిలిలో నలుగుతున్నా...
అలాగే ముందుకు సాగిపో...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించని..

పర పాలనలో మొద్దుబారిన మనం
శ్వాసలేని శరీరం
ఉంటె నేమి పోతేనేమి 
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ...

నీ భూమి నీ భాష
నీ మతం నీ జనం
ఎవరో చెప్తే నీ వవుతాయా..
ఎవరి దయ తోనో మనగాలుగుతాయా...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ...

సహ జీవనం సౌబ్రాత్వుత్వం
కరుణ దయ  నిండిన జీవితం
యెర్ర రక్కసి కోరలచిక్కి శిధిలం అవుతుంటే
నువ్వెవరో మరిచేలా రుధిర చరిత్ర లిఖిస్తుంటే
పోనీ...వేయి తుపాకులు ఘర్జించనీ..

పరాయి మూకల తరిమేదాకా
నీ జెండా ఉవ్వెత్తున ఎగిరే దాకా
నీ భూమి నీ దయ్యేదాక 

భుద్దం శరణం గచ్చామి 
ఘర్షణ శరణం గచ్చామి
యుద్ధం శరణం గచ్చామి...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ..

( భారత భూమి శివారుల్లో హిమాలయ ఆవలి వైపున చెలరేగిన స్వతంత్ర పిపాసకు నా చిరు కవితా కానుక)