Saturday, April 21, 2012

బట్టలున్న మనిషికి...

వారాంతపు వాషింగ్ కార్యక్రమం లో  తలుక్కున మెరిసిన పాట...

బట్ట  గతి ఇంతే..
మనిషి బ్రతుకింతే...
బట్టలున్న మనిషికి ఉతుకుతప్పదంతే...

ఒక్కసరికే మురికి పోదు..
మరక పడితే అసలు పోదు..
ఒక్క రోజుకే మాసిపోదు..
చిరుగు పడితే అతుకు పడదు..

బట్ట  గతి ఇంతే...

అంతా మట్టేనని తెలుసు..
అదీ ఒక చిక్కేనని తెలుసు  ..
తెలిసీ మాపీ  ఉతికిన్ చుటలో..
వెదవతనం ఎవరికి తెలుసు..

బట్ట  గతి ఇంతే...

మరు జన్మ ఉన్నదో లేదో
ఈ మరకలప్పు డే మవుతాయో..
బట్టకు మరకే తీరని శిక్ష...
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా..







Saturday, April 14, 2012

మా వూళ్ళో ఎన్నికలోచ్...అమెరికతలు-౧౭

కారణాలేమైతేనేం..మా వూళ్ళో మల్లా ఎన్నికలోచ్చాయ్. ఎన్నికలంటే ఒక జాతర. ఒక ధన మార్పిడి ఆర్ధిక విదానం. మన పెజాస్వామ్యం లోపలెన్ని పురుగులున్నా పైకి అందంగా కనిపించే మేడి పండు.ఇక్కడ పెజలే దేవుళ్ళు. కాని ప్రసాదం మాత్రం పూజారులదే.

ఇక మా వూరి విషయాని కొస్తే, ఆంధ్రా లో అన్ని చిన్న చితకా పట్టణాల్లో లాగా మా జనమూ అమాయకులు, పిచ్చోళ్ళు, ఆశాజీవులే.  కాని ఒక్కటి మాత్రం స్పష్టం. బహు ముచ్చటైన  ఈ వైకుంఠపాలి లో మల్లి మల్లి పాముల బారిన పాడేది వీళ్ళే. అన్నీ సవ్యంగా ఉంటె, ప్రభుత్వం గొప్పతనం.ఏదైనా చెడినదా ఉందిగా ఖర్మ సిద్ధాంతం.మీ ఖర్మ.


ఎవ్వరికీ పట్టని మా వూరి సమస్యలు. మా వూరు బాగా అభివృద్ధి చెంది పోయింది. కనీస అవసరాల కొస్తే, మా వూరు చుట్టూ ౨ చేరువులున్నాయ్.కొత్తగా ఏలిన వారు పూనుకొని ౧౦-౧౫ కీమీ దూరంలో ఒక డాము కూడా కట్టారు. ఇంకేం బ్రంహాండం అనేయకండి. వారానికి రెండు రోజులే నీళ్ళు. అదీ బ్రమ్హ ముహూర్తం లో. మీరు కరెక్టే చదివారు. పొద్దున్న మూడు-నాలుగు మద్య. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పన్నెండు గంటలకు కూడా అని విన్నాను. ఒక్కరోజు మిస్  అయ్యారా..ఇంకేం మల్లా రెండురోజుల తర్వాత కనపడండి. తుగ్లక్  గారుకూడ ఇలాంటి పనులు చేయగా మనం వినలేదు.ఇక పారిశుధ్యం,రహదారులు, రేషన్ లాంటి వాటి గురుంచి యెంత తక్కువ మాట్లాడుకుంటే మనసు అంత ప్రశాంతం గా ఉంటుంది. ముఖ్యం గా చివరి దాని గురుంచి. మా లోకాలిటి రేషన్ షాప్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు.ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆ కొద్ది సాయం ఎవరు మేక్కేస్తున్నారో పెరుమల్లకి కూడా తెలుసో తెలీదో.


వాంతి రాకడ, కరెంటు పోకడ ఎవరికి తెలుసు. మా వూళ్ళో అసలు తెలియదు. ఆ దెబ్భకి చుట్టూ పక్కల ఒక పరిశ్రమ ఉంటె వొట్టు. ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కుప్పలు తెప్పలైతేనేమి, ఎవరైనా మహా నగరాల దారి పట్టాల్సిందే.


అన్నట్టు మీకో విషయం చెప్పల.మా వూళ్ళో విమానాశ్రయం  కడుతున్నారు. భూమి పూజ చేసి వదిలేసారు. ఇంకేముంది.చుట్టూ పక్కల భూముల ధరలకు రెక్కలోచ్చాయి. ఘనత వహించిన అధికార పార్టీ వాళ్ళకు ఇందులో మహా రాజ పోశాకులని వినికిడి. విమానాశ్రయం అక్కడ అనిపించే లోపల ఆ చుట్టూ పక్కల ౫-౧౦ కీమీ భూమి చీపు గా కొనేసి ఇప్పుడు దాన్ని మంచి రేటుకు అమ్మేసుకున్తున్నారని ఎగస్పార్టీ భోగట్ట.వడ్డించేది మనోడేగా :)


ఆసుపత్రి పెద్ద స్తలం లో అఘోరించింది కాని, అక్కడ డాకుటేరులు భహిరంగ వ్యాపారం చేస్తారు. సాయంత్రం క్లినిక్కు వచ్చేయి మంచి మందు రాసిస్తా.. ఏమి ఇక్కడ నువ్వు చచ్చి నావుకద నాయన మళ్ళా అక్కడి కెందుకు.ఇక్కడ నీ పెన్నుకు పక్షవాతం వచ్చేనా..ఇక ఆరోగ్య శ్రీ దెబ్బ ఇక్కడ కూడా తగిలిందేమో. దగ్గుకి కూడా మందులు దొరకవు. దొరికినా, వాళ్ళు ఇచ్చేది పని చెయ్యది. ఎందుకని అల్లా చుస్తారేమి, తొంభై శాతం లంచం ఇచ్చి మందులు సరఫరా చేసే ఫార్మా వాళ్ళు బతకద్దూ.


 ఒక  పాత టపాలో రాసినట్టు మా వూరు పెద్ద బొమ్మల కొలువు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వ కారణం.పట్టణ వీధులు సమస్తం పార్టీ బొమ్మల పరం. కొన్ని బొమ్మలైతే కింద పేరు చదివితే కాని ఆ మగాను భావుడో/భావురాలో తెలవని పరిస్తితి. ట్రాఫ్ఫిక్ ఆ బొమ్మలు చుట్టూ గిరగిరా తిరుగుతూ బూతులు తిట్టుకుంటుంటే, పెట్టినోల్లకు మా చెడ్డ ఇష్టం.


ఎవ్వరికీ జనం వాళ్ళ సమస్యలు ఎప్పుడు పట్టిసావని ఈ గొప్ప అవ్యవస్తలో నాకు నచ్చే అంశం. ఎన్నికలప్పుడు మా వోళ్ళు అన్ని పార్టీ ల దగ్గరా డబ్బు తీస్కుంటారు.కాని వోటు మాత్రం వాళ్ళకు నచ్చిన పార్టీ కే వేస్తారు. అదే మరి పెజస్వమ్యంలో గొప్పదనం. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. అదేమీ వాళ్ళ డబ్బు కాదు. ఏ జన్మ భూమి లోనో, పనికి ఆహరంలోనో లేక టూ జీ లోనో నొక్కేసినా మీ డబ్బే. ఇంకా రెండో విషయానికొస్తే, ఆ డబ్బు ఇవ్వని వాడికి వోటేస్తే మన వోటు సార్ధక మైనట్టే. ఇలా డబ్బులు పంచే వాళ్ళకొక వోటు దెబ్బ. పంచని వాడు వెధవే అయ్యాడనుకోండి . పెజాస్వామ్యం లో అందరికి ఒకే రకమైన అవకాశాలు ఉండాలి. ఈ సారి ఈ కొత్త వాడిని  సంపాదించుకో నివ్వండి :)