Saturday, April 21, 2012

బట్టలున్న మనిషికి...

వారాంతపు వాషింగ్ కార్యక్రమం లో  తలుక్కున మెరిసిన పాట...

బట్ట  గతి ఇంతే..
మనిషి బ్రతుకింతే...
బట్టలున్న మనిషికి ఉతుకుతప్పదంతే...

ఒక్కసరికే మురికి పోదు..
మరక పడితే అసలు పోదు..
ఒక్క రోజుకే మాసిపోదు..
చిరుగు పడితే అతుకు పడదు..

బట్ట  గతి ఇంతే...

అంతా మట్టేనని తెలుసు..
అదీ ఒక చిక్కేనని తెలుసు  ..
తెలిసీ మాపీ  ఉతికిన్ చుటలో..
వెదవతనం ఎవరికి తెలుసు..

బట్ట  గతి ఇంతే...

మరు జన్మ ఉన్నదో లేదో
ఈ మరకలప్పు డే మవుతాయో..
బట్టకు మరకే తీరని శిక్ష...
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా..







3 comments:

  1. శరత్ గారు ఇది తప్పకుండా మీ ఒక్కరిబట్టలే ఉతుక్కుంటే వచ్చిన ఫీల్ మాత్రం కాదు:)

    ReplyDelete
    Replies
    1. సరిగ్గా క్యాచ్ చేసారు... ;)

      Delete
  2. hahaha!పేరడీ బాగుంది:)

    ReplyDelete