ఒక పదేళ్ళ కిందటి విషయం.
నేవీ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ లిస్టు లో బర్త్ సర్టిఫికేట్ ఒకటి.
నాన్నా.. నా బర్త్ రిజిస్టర్ చేయించారా..అడిగాను ...
కే.బీ.సీ. లో ఏడుకోట్ల ప్రశ్న అడిగినట్టు మొహం పెట్టి.జ్ఞాపకం లేదురా అన్నారాయన.
సరే.. ఉంటె గింటే మున్సిపాలిటీ ఆఫీసులోనే ఉంటుంది కదా... ఒక మల మల మాడే మద్యాన్నం టైం చుస్కొని.. బయలుదెరాను. ఆ సమయానికైనా మన పర్మనెంటు గుమాస్తా గారు, ఆఫీసు కి వెంచేస్తారనే ధీమాతొ.
ఒంగోలు మున్సిపాలిటీ ... మొదటి సారి ఇలాటి పని మీద వెళ్ళటం. ఇంతకూ ముందు, ఇంటి పన్ను కట్టడానికి రెండు మూడు సార్లు వెళ్లినట్టు గుర్తు.
అవి కొన్ని మరచి పోలేని అనుభవాలు. అదేంటో, మద్యాన్నం ఫలానా టైం లోనే ఆ పన్నులు కట్టించుకునే వాల్లు. నిజం చెప్పద్దూ .మన గుమాస్తా గారు అఘోరించే టప్పటికి అంత టైం పడుతుందన్న మాట. ఇంకేముంది. ఇంటి పన్ను కట్టే పది పరకా మంది అదే టైం కి హాజరు అవుతారు. ఇంకా చూస్కోండి నాయనా.. 2 ఫ్లోర్ నుంచి కింద రోడ్డు దాక పెద్ద లైన్ వుండేది.
సరె...ఇంక ఈ రోజు విషయాని కొస్తే,బర్త్ సర్టిఫికేట్ కి చలాన 25 రూపాయలు.పట్ట్టు సమయం 3 రొజులు. ఆహా అంతే కదా... ఇంకేమి ఇంటర్వ్యూ ఒక నెల టైం ఉంది కదా ..నా ముందుచూపుకు నేనే జోహార్లు అర్పించుకుని, చలాన కట్టాను. అదే గుమస్తాను తర్వాత ఏం చెయ్యాలి అని అడిగాను. 3 రోజుల తర్వాత ఫలానా సెక్షన్ లో సుబ్బా రావు ని కలవమని చెప్పాడు. ఇంకేమి పని అయి పోయింది కదా అనుకుని ఇంటికి బయలు దేరాను.
3 రోజులు అయి పొయాయి. ఆ ఫలానా సెక్షన్ లో సుబ్బా రావు ని కలవటం తో నా పాట్లు ప్రారంభమయ్యాయి. నా కధ అంతా విని, నేను అర్పించిన చలాన ముక్కను క్రీగంట పరిశీలించి , అబ్బే ఇదింకా నా దాక రాలేదబ్బాయ్ .. ఆ చలాన వాళ్ళనే అడుగు అన్నారాయన . సరే మళ్ళా ఆ గుమస్తా దగ్గరకు వెళ్లాను. నా చలన నెంబర్ అడిగి అర్రే ఇది ఇంకా ఆయన దగ్గరకు వెల్లలెదా... ఇప్పుడే పంపిస్తా... సరే కాని నేను కాఫీ తాగటానికి వెళ్తున్నా వస్తావేమిటి ... అబ్బే ,,ఇప్పుడే తాగి వచ్చానండి...మల్ల కలుస్తా..
మల్ల మూడు రొజులు... మల్ల సుబ్బరావు దర్సనము. అయ్యవారు... చిద్విలాసం గా నవ్వుతూ నిన్ననే నీ ఫైల్ వచ్చిన్ దబ్బా.. బర్త్ డేట్ చాల పాతది కదా.. వెతుకుతున్నా... అబ్బ ..ఎంత ఓపిక సారు మీకు...పద బైట కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ... ఇంత మద్యాన్నం కాఫీ ఏంటి సార్...మరల కలుస్తా...
నేనెంత తప్పు చేస్తున్నానో ఇంకో 4-5 సార్లు ఆఫీసు చక్కర్లు కొట్టే దాకా నాకు అర్ధం కాలెదు. ఈ మద్యలో నా ఫైల్ కనపడకుండా పోయింది. సుబ్బారావు కి అసలు నా బర్త్ రిజిస్టర్ అయిందా లేదా అని అనుమానం వచ్చింది.
అదేదో మొహంజదారో తవ్వకాల్లో నీ రిజిస్టర్ వెతకాలి అన్నట్టు మొహం పెట్టి, ఇంకా కొంచెం టైం పడుతుందయ్యా అనేసాడు.
ఇంకా ఇంటర్వ్యూ కి 7 రోజులే ఉంది. నా కు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ సారి వెళ్ళినప్పుడు కొంచెం పక్కకు పిలచి
సర్ నాకు ఇంకో 1 వీక్ లో నవి ఇంటర్వ్యూ ఉంది..కొంచెమ్ తొందరగా చూసి పెట్టండి అని బతిమాలు కున్నాను.
కర్ణుడు కవచ కుండలాలు దానం చేస్తున్నట్టు మొహం పెట్టి, అలాగ.. ఈ రోజే చేద్దాం అబ్బాయి... ఇక్కడే ఉండు.
హడావుడి గా లోపలికి వెళ్ళాడు .. పది నిమిషాల తర్వాత.. ఒక ఫైల్ పట్టుకొని వచ్చి, ఆఫీసు బైట చెట్టుకింద భుద్ధ భగవానునిలా బాసింపట్టు వేసుకొని కూర్చొని రమ్మ న్నట్టు పిలచాడు. ఫైల్లోంచి చిద్విలాసం గా బైటకు తీసాడు నా బర్త్ సర్టిఫికేట్. చాల కష్టపడ్డాను అబ్బాయి... ఎక్కడెక్కడో వెతకాల్సి వచ్చింది. ఆయన పది నిమిషాల్లో రావటం చూసి నాకైతే నమ్మ బుద్ది కాలెదు. సరేలే పని అయింది కదా.. థాంక్ యు చెప్పి ఆయన పెట్ట మన్న చోట సంతకం పెట్టి బయలు దేరాను... బాబు కొంచెం నా సంగతి చూడు... చాల వెతకాల్సి వచ్చింది .. అప్పుడప్పుడే కొంచెం కొంచెం అర్ధం అయ్యింది విషయం. ఎంత ఇవ్వమంటారు. అయన అడిగిన దానికి అయిదవ వంతు చేతిలో పెట్టి అయిందని పించి ఇంటికి బయలుదేరాను.
ఇది ఒక సగటు నేల బారు మనిషి జీవితంలో ఒక అవినీతి పర్వం లో లంచం అనే కాండం. ఇందుగల డందు లేదన్నట్టు నిరుద్యోగులైతే నెమి.. ఉదొగస్తులు, వ్యాపారులు చివరకు రిటైరీలకు తప్పని తంతు. ఇక్కడా అక్కడా అని ఏల తెలంగాణా పల్లెల నుండి తిరుపతి కొండల దాక వీళ్ళకి ఆరని అసంతృప్తి.
అబ్బో..ఈ మాత్రానికే అంటారా. తర్వాత ఎన్ని సార్లు వీళ్ళను నేను తృప్తి పరచానో గుర్తు లేదండి. గొప్ప విషయం ఏమిటంటే మనం దీనికి అలవాటు పొయామ్. సూర్యుడు తూర్పున వుదయించినట్టు సర్కారి పనులంటే లంచం లేకుండా పని కాదు అనే నగ్న సత్యానికి గతిలేక బానిసలై పోయాం.
నిజం చెప్పాలంటే, లంచం అనేది స్వతంత్రం మనకిచ్చిన హక్కు.. మన సర్కారి ఉద్యోగ మహారాజులకు అడగక ఇచ్చిన వరమ్. మన దౌర్భాగ్యం.
అబ్బో..ఈ మాత్రానికే అంటారా. తర్వాత ఎన్ని సార్లు వీళ్ళను నేను తృప్తి పరచానో గుర్తు లేదండి. గొప్ప విషయం ఏమిటంటే మనం దీనికి అలవాటు పొయామ్. సూర్యుడు తూర్పున వుదయించినట్టు సర్కారి పనులంటే లంచం లేకుండా పని కాదు అనే నగ్న సత్యానికి గతిలేక బానిసలై పోయాం.
నిజం చెప్పాలంటే, లంచం అనేది స్వతంత్రం మనకిచ్చిన హక్కు.. మన సర్కారి ఉద్యోగ మహారాజులకు అడగక ఇచ్చిన వరమ్. మన దౌర్భాగ్యం.
No comments:
Post a Comment