నిజమే.... అలా కళ్ళు నులుముకోకండి.
మీరు చదివింది నిజమే..యావత్ భారతం మోడీ కి బ్రంహరధం పడుతుంటే ఎంతైనా మాది ఒంగోలు కదా... మేమింతే.. మనోడు అనుకున్నోడ్ని నెత్తి నెత్తుకుంటాం. మంచోడు మంచోడు అన్న చందంగా తేడా వస్తే ... ;) అంతే సంగతులు....
వూళ్ళో 3-4 చెరువులున్నా, 4 రోజులకి ఒక సారి నీళ్లిస్తే ఊరుకున్నాం . ఎవడో పేరు తెలియని వాళ్ళ బొమ్మలు ఊరంతా పెట్టి, రోడ్లు ఖరాభు చేస్తే, పోనిలే అని పక్క నుంచి పోయాం. విమానాశ్రయం పేరు చెప్పి వ్యవసాయ భూములు ఆక్రమించి అమ్ముకుంటే, సరేలే అనుకున్నాం. సెజ్ ల పేరు చెప్పి బంగారం లాంటి తీరాన్ని ఆక్రమిస్తే
1-2 ఉద్యోగాలు రాక పోతాయా అనుకున్నాం. పారిశుద్యం కధ పక్కన పెడితే,
నడుస్తున్న గోవేర్నమెంటు స్కూల్లెన్ని మూత పడ్డవేన్ని, జిల్లాకేంద్రం లో పెద్దాసుపత్రి లో సౌకర్యాల సంగతి దేవుడెరుగు... సొంత ప్రాక్టీసులో తనమునకలై ఆసుపత్రి కొచ్చే డాక్టర్లు ఎన్దరు.. లోగుట్టు ఆరోగ్య శ్రీ కర్తలకెరుక. కార్పొరేషన్ చేసావ్ సరే బిల్లులు మోత తప్ప సౌకర్యలేమన్న పెరిగాయా అంటే సమాధానం చెప్పనీకి ఎమిలియే అన్న వూళ్ళో ఉంటె కదా ... అదేదో కొత్త కూత పార్టీ అని తిరుగుతుండే. అది లేనప్పుడు ఉన్నాడా అంటే, ప్రతి సారి ఆయనకే వోట్లేస్తే ఎందుకు కనపడాలే... స్కూల్ ఎగ్గొట్టే కొంటె కుర్రాడికి మొట్టికాయలు తప్పవు కదా... అదే అయింది .
ఇదంతా ఒక యెత్తు. ఇకా మా ఏం పీ ( ఏం పీకలేనోడు-అంటార్లెండి మా వూళ్ళో మోటు జనం ;) ) మా తాతలు నేతులు తాగారు అన్నట్టు , ఎప్పుడో ఓ మహానుభావుడు చేసిన మేళ్ళు మరవని జనం ప్రతి సారీ గెలిపిస్తూ వస్తుంటే, అయ్యా వారు పక్క జిల్లాలో వ్యాపారం ఎలగ బెట్టారు. పండగకి పబ్బానికి వోట్లు అన్నీ పచ్చ గా ఉన్నాయా అని సూసుకోడానికి అలా కాన పడి ఫ్రీ గా ఓ సిరునవ్వు మొహాన కొట్టి పొయ్యే సిన్నోడ్ని , జనం గుర్తు పెట్టుకు మరీ పొగ బెట్టారు ఈసారి.
మరి గెలిసినోల్లు మంచోల్లా , మరి వాళ్ళు పలానా పార్టీ వాళ్ళే అని ఎదవ కోస్యనింగులు సీ బాకండి. తెలుగు లో చెప్తే మరీ మోటుగా ఉంటది కాబట్టి, నేను దీన్ని Choosing the lesser Devil అంటాను. ఈళ్ళు ఈసారి ఎదవ కటింగ్ లు ఇస్తే, వచ్చే సారికి ఇంతే సంగతులు. అంత గట్టిగా ఎలా చెప్తావ్ అంటారా... మావాళ్ళు తెలివి మీరి పొయారు. నేనైతే తెలివి తెచ్చు కున్నారు అంటాను. అదేదో పవన్ కళ్యాన్ చెప్పినట్టు, అందరి దగ్గరా డబ్బులు తీస్కొని వెయ్యాలనుకున్న వాళ్లకి వేసారన్న మాట... LET THE SENSE PREVAIL ;)