నేనిప్పటి దాక విన్న పాటల్లో మనసుకి నచ్చే మనిషికి పనికొచ్చే పాట...
http://www.youtube.com/watch?v=K1-_h2iNcOw&feature=related
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ..ఆయు వంటూ ఉన్నవరకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా...ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....
No comments:
Post a Comment