Wednesday, April 6, 2011

అన్నా..మీ వెనకే మేమంతా...

ఇది ఏ యువ భావి భారత ప్రధాని కధో కాదు. మహా కేక కుమారుడు యువ కేక దీ కాదు. పిల్లి మొగ్గలేసే మెగా స్టార్ లది, జనం గుండు గీసే యడ్డి లది కాదు.ఇంతెందుకు లోక సేవ పేరు చెప్పి, లోకాన్నే మింగేసే మగానుభావులేవరిదీ కాదు. ఒక నేలబారు భారతీయుడిది. ఇలాంటి పాత్రలు మీ ఇంటి పక్కనో, అదిగో ఆ వీధి చివర్లోనో మీకు తగలచ్చు. కాని, తేలిగ్గా తీస్కోకండే. ఇండియా బలమంతా, ఈ బక్కచిక్కినోల్ల దగ్గరే ఉంది. ఎలా గంటార..ఇదిగో ఇల్లగా.
ఆయన పుట్టింది ౧౯౪౦ లో, ఒక నిరుపేద కుటుంబం లో. కరవు వల్ల వాళ్ళ వూరు వదిలి, రాలే గావ్ సిద్ది కి వాళ్ళ కుటుంబం వలస వెళ్తుంది. అయన చదువు కొన్నాళ్ళు ముంబై లో సాగినా, చదువు కోసం అష్ట కష్టాలు పడి, పువ్వులమ్ముకున్నా,ఆయన చదువు సాగలేదు.పేదరికం వల్ల, ఏడవ తరగతి లోనే ఆపెయ్యాల్సి వస్తుంది.
అర్మి లో డ్రైవర్ గా చేరినా, ఆయన మీద వివేకానంద,గాంధీ ల ప్రభావం చాల ఎక్కువ. అరవై ఐదు లో అర్మి ని వదిలిన ఆయన నేరుగా తన సొంత వూరికి వెళ్లి దాని అభివృద్ధి కి తోడ్పడ్డాడు.అప్పటిదాకా తను దాచుకున్న సొమ్మంతా, గ్రామాభివృద్ది కే నియోగించాడు.మద్య పాన నిషేధం, చెట్ల పెంపకం పై దృష్టి పెట్టి, రాలే గావ్ సిద్ది సమగ్రాభివృద్ది కి కృషి చేసాడు.
గ్రామస్తుల స్వయం కృషి తో ఏర్పడ్డ ఇంకుడు గుతలు,చెక్ డాముల వల్ల నీటి కొరత తీర్చాడు.
ఆయన కు ప్రభుత్వాలు, ఇతర సంస్తలు నుండి ఎన్ని అవార్డులు వచ్చినా, అంతకు మించి జన భాహుళ్యం లో ఖ్యాతి నొంది నాడు.ఇవన్నీ ఒక ఎత్తూ. అయన ప్రస్తుతం చేస్తున్న ఉద్యమం ఒక ఎత్తూ. మన లోక హిత ప్రభుత్వం తూతూ మంత్రం గా ప్రవేశ పెట్టిన లోక్ పాల్ బిల్లు ఎందుకూ పనికి రాని, ప్రస్తుత వ్యవస్థ కే కొనసాగింపు గా ఉందన్న ఆలోచన తో, జన లోక్ పాల్ బిల్లు కు రూపకల్పన చేసారు. వాటి వివరాలు కింద చూడండి.
ప్రభుత్వ బిల్:
౧. లోక్ పాల్ తనంతట తాను ప్రజల నుంచి ఎటు వంటి ఫిర్యాదులు స్వీకరించలేదు. లోక్ సభ స్పీకర్ లేక రాజ్య సభ చైర్మన్ ప్రజా ప్రతినిదుల పై ఫిర్యాదులు చేయగలరు.
౨.ఇదొక సలహాలు ఇచ్చే సంస్త.అంటే, ఎదురుగ్గా అవినీతి జరిగిందని తెలిసినా, ఏ సంకీర్ణ రాజకీయాల భారం తో జుట్టు తెల్ల బడ్డ ప్రధానికి నివేదించడం తప్ప ఏమి చెయ్యలేదన్నమాట.దొంగల గురుంచి దొంగలతో చెప్పినట్టు,
౩.దీనికేటు వంటి పోలీసు అధికారాలు లేవు. క్రిమినల్ కేసులు పెట్టడం, ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చెయ్యడం చెయ్యలేదు.
౪.ఇతర చట్ట సంస్తల లో ఎటు వంటి సంభందాలు ఉండవు
౫.నిర్దారణ అయిన నేరానికి తక్కువలో తక్కువ అయిదు నెలలు శిక్ష.
ఈ పాటికి మీకు అర్ధం అయి ఉండే ఉంటుంది. ఈ పై సంస్త ఒక్క రాజకీయ నాయకుడిని చట్టం పరిధి లోనికి తీసుకు రాలేదని.
అన్న హజారే ప్రతి పాదిస్తున్న మార్పులు:
౧.లోక్పాల్ ఎవరి నుంచైనా ఆరోపణలు స్వీకరించవచ్చు.
౨.ఎవరి పైనేన, కేసులు నమోదు చెయ్యొచ్చు.
౩.సి బి ఐ అవినీతి నిరోధక శాఖ, లోక్పాల్ కలిసి పని చేస్తాయి.
౪.తక్కువలో తక్కువ అవినీతి నిరోపన నిర్ధారణ అయితే, అయిదు ఏళ్ళ శిక్ష.
౫. లోక్పాల్ సంస్త లో రాజకీయులు కాక, జన భాహుళ్యం లోని మేధావులు ఎక్కువ సంఖ్యా లో ఉండాలి,
లోక్పాల్ బిల్లు లో మార్పులు కోరుతూ, డిల్లి లో జంతర్ మంతర్ దగ్గర, హజారే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అదేదో మన రాష్ట్రము లో రాజకీయులు చేసే ఒక రోజు నిరాహారం, సాయంత్రం బిర్యాని దీక్ష అనుకునేరు.పప్పు లో కాలేసినట్టే.భారతీయ ఎన్నికలప్పుడు జైరాం పార్టీ దీనికి మద్దత్తిచిందని ఇదేదో రాజకీయ సంబంధం ఉన్న దీక్ష అనుకునేరు. అన్నా రాజకీయ నాయకులనేవ్వర్ని, తన వద్దకు రావద్దన్న సంగతి గుర్తు పెట్టుకోండి. చౌతాలా, ఉమా భారతి ఉత్తుత్తి కన్నీళ్ళతో మద్దతు ఇవ్వడానికి వచ్చి జనం తిరగ పడటం తో వెనుతిరిగారు.
అన్నా దెబ్బతో :
౧. నిన్నటి దాక ఇదేదో ఓవర్ ఆక్షన్ డ్రామా అన్న కాంగ్రెస్ వాళ్ళు..నిదానం గా దారి కొస్తున్నారు.
౨. శరద్ పవార్ అవినీతి ఆరోపణలతో అవినీతి నిర్మూలన మంత్రి మండలి నుంచి రాజీనామా చేసారు.
ఒక సామాన్య భారతీయుని గా, అన్నా కు నా సంపూర్ణ మద్దతు, ఈ బ్లాగ్ ద్వారా, అన్నా చేస్తున్న ఈ పోరాటం పై నిరంతర సమాచారం బ్లాగ్ లోకానికి అందించి, ఉడతా భక్తీ , ఆ మహానుభావునికి సహాయ పడతాను. మీరు ఈ మహోద్యమం లో మీకు తోచి నట్టు పాలు పంచు కుంటారని ఆశిస్తూ....జై అన్నా...జై హింద్....

2 comments:

  1. Yes !మీతో పాటు నా మద్దతు కూడా !

    ReplyDelete
  2. ఆయన ఉద్యమానికి మద్దత్తీయడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఈ ఉద్యమానికి ఉడతాభక్తిగా నేనూ మద్దత్తు ఇస్తున్నాను.

    ReplyDelete