Monday, November 21, 2011

బొమ్మేనక బొమ్మ పెట్టి...అమెరికతలు-౧౨

ఈ రోజు టీవీ ౯ లో ఒక వార్త. ఝాన్సీ లక్ష్మి బాయి నిజంగా బ్రిటిష్ వారిపై యుద్ధం చెయ్యలేదని, అదంతా ఝాల్కారి బాయి అనే ఆమె ఝాన్సీ బాయి లా యుద్దానికి వెళ్లి,యుద్ధం చేసిందని.ఆమె నిమ్న వర్గాలకు చెందినది కావటం వలన, ఆమె పేరు అణగదొక్కి ఝాన్సీ బాయి కి గొప్ప పేరు రావటం వెనక ఉన్నత వర్గాల కుట్ర దాగి ఉంది అని ప్రస్తుత ముక్క చెక్కల పోలిటిక్స్ హీరోయిన్ మాయావతి ప్రభుత్వ ఉవాచ. త్వరలో లక్నో లో మాయావతి బొమ్మ పక్కన రోడ్డుకు అడ్డంగా ఝాల్కారి బాయి బొమ్మట్టేస్తామని వెనకబడ్డ బొమ్మల సముద్దరణ కి బ్రేసులేటు కట్టుకున్న ( ఈమె చాల మోడరన్ను) మేడం గారి శపధం.
సరే ఇదంతా నిజమే అనుకుందాం.పాపం శమించు గాక. నిజంగానే ఇదంతా నిజమనే అనుకుందాం. ఏవిదం గా చూసినా రత్న గర్భ అయిన ఈ దేశంలో, రక రకాల రాజ వంశాల కింద నలిగిన జనం ఎవరికి పట్టారు. రాజ భోగాలను భావించిన వీరు తమ తమ భోగాలను కాపాడు కోవటానికి సైనిక రాజ్యాలు ఏర్పాటు చేసారు కాని, సామాన్యుల సంగతి పట్టినది ఎందరికి.భారత్ రక రకాల సంస్తానల క్రింద మగ్గుతున్నప్పటికి ఆనాటి లెక్కల ప్రకారం క్రీస ౧ శతాబ్దం నుంచి ౧౮ వ శతాబ్దం వరకు ప్రపంచపు అతి పెద్ద ఆర్దిక వ్యవస్థ. అక్బర్ బొక్కసపు సంవచ్చరిక లెక్క పదహారు మిల్లియన్ పౌండ్లు.మరి రెండు వందల సంవచ్చారాల తర్వాత బ్రిటిష్ రాణి ఆదాయం పెదిహేడు మిలియన్లు.అంటే, ప్రపంచం పిక్కలతో లెక్కలు నేర్చుకునే కాలం నుంచి అప్రతిహతం గా భారత దేశం సుసంపన్నం.మరిన్ని వివరాలకు క్రింద లింక్ చూడండి.
http://en.wikipedia.org/wiki/Economic_history_of_India 

మరి ఈ కాలం లో జనం మంచిగా బ్రతికి ఉంటారు అనుకుంటున్నారా? ఇక్కడ జనం ఎప్పుడు ఒకేలా ఉన్నారు. ప్రతి రాజు తన రాజ్య కాంక్ష తో భోగలాలస తో ఆ పన్ను ఈ శిస్తు అని జనం నడ్డి విరిచేవాడే. హిందూ రాజుల మాట అటు పెడితే, ముస్లిం రాజులు జన హననాన్నే తమ ప్రధాన కార్యం చేసుకున్నారు. వారు దండెత్తి వచ్చిన ప్రతి సారి లక్షలాది మంది హిందువులను వధించేవారు.లేక బానిసలు గా తీసుకు వెళ్ళేవాళ్ళు.
http://en.wikipedia.org/wiki/Islamic_invasion_of_India
తమ మతమేదో తమది అన్నట్టు, పరాయి దేవాలయాలను నుగ్గు నుగ్గు చేసేవారు. స్వార్ద చింతనే పరమావదిగా మన రాజులు కొందరు పరాయి వారికి సహకరించడం మామూలే.మోఘలులనుంచి బ్రిటిష్ వారి దాక ప్రతి పరాయి వలసవాదులు దీనినే అలుసుగా తీసుకున్నారు.విభజించి పాలించడం వారి పద్దతి అని చదూకున్నా,మన బంగారం మంచిది ఐతే అనికూడా చదుకోవాలి కదా.
చారిత్రికంగా,భారత భూమి రక రకాల నదులతో ప్రతి సారి కనికరించే రుతుపవనాలతో అన్నపూర్ణ.తిండికి బట్టకు లోటు లేక పోవడం వల్లనే మన దేశం లో భాష, అమోఘమైన పద్దతి లో గణితం,భిన్నమైన రచనా సంగతులు,ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు రచించ బడ్డాయి. మరి ఇవన్ని సామాన్యులకు అందాయా అంటే, మన దేశపు వర్ణ వ్యవస్థ సమాజాన్ని రక రకాల ముక్కలు చేసి చదువు సంధ్య కొందరికే పరిమితం చేసింది.
మరి వీటన్నిటికి పై వార్త తో ఏమిటి సంబంధం అంటారా..బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసిన ప్రతి రాజ్య వ్యవస్తా, తమ తమ స్వప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే ప్రయత్నించాయి కాని,దేశ ఉమ్మడి ప్రయోజనాల గూర్చి కాదు.అందుకే చరిత్ర లో ఒకటి రెండు  చోట్ల తప్ప పూర్వ సంస్తానాదీసులు ఉమ్మడిగా తిరుగు బాటు చేసినట్టు తెలియదు.

తమ కంటి ని తామే పోడుచుకున్నట్టు, బ్రిటిష్ వ్యవస్థ అందించిన విద్యా వ్యాపార అవకాశాలను అంది పుచ్చుకున్న భారత యువతరం స్వతంత్ర పోరాటాన్ని మరో మలుపు తిప్పింది. గాంధీ,గోఖలే,బోసు,భగత్ లేనా...మరి మౌలానా ఆజాద్,ఇక్బాల్ లాంటి నేతలు ఇందులో ప్రాతఃస్మరణీయులు.విభిన్నము సుసంపన్నమైన భారత జాతికి మణి పూసలు. సరోజినీ,దుర్గా బాయి లాంటి అమ్మలు మహిళా శక్తి స్వరూపునులు .చతుర్వర్ణాలు కలిసి రావటం తో పాత సంస్తానాదీసులు కూడా జనం తో గొంతు కలపక తప్పలేదు.మరి అలాంటప్పుడు ఇల్లాంటి సంస్తానాలు గెలిచినా ఓడినా జనాలకు ఒరిగి ఉండేది ఏమి లేదు. ఇంకా వీళ్ళందరికీ బొమ్మలు పెట్టే సిమెంటు తో నాలుగు రోడ్ల లో గతుకులు పూడ్చినా జనం సుఖ పడతారు.
Winston Churchill … & his argument against granting India / Pakistan independence …
“Power will go to rascals, rogues, freebooters … All leaders will be of low caliber & men of straw … They’ll have sweet tongues & silly hearts …
They will fight amongst themselves for power & the two countries will be lost in political squabbles … A day would come when even air & water will be taxed.”

అరవై నాలుగేళ్ళ క్రితం చర్చిల్ మాటలు. కొందోకంచో నాకు ఒక వైపు నవ్వు మరో వైపు కోపం తెప్పించేవి. కాని ఇప్పుడు పరిస్తితి చుస్తే ఆయన చరిత్రలో  ఎందుకు గొప్ప వాడు అయ్యాడో తెలుస్తుంది. మరి ఇల్లాంటి నాయకుల నుంచి ఏమి ఆశిస్తారు. రోడ్ల కడ్డంగా మాయ అమ్మ,కాన్షి రాం ల బొమ్మలు, ఇంకా ఈ మాత్రం పరపీడన చరిత్ర లో పిడకల వేటలో పట్టు కొచ్చిన మరో నాలుగు బొమ్మలు పెడితే రేపు నాలుగు ముక్కలయ్యే రాష్ట్రం లో ఏదో రెండు ముక్కల్లో నైన గొర్రె జనం వోట్లేయ్యక పోతారా..తదాస్తు....

 

No comments:

Post a Comment