Sunday, December 25, 2011

ఎవరో ఒకరు..ఎపుడోకపుడు...నడవరా ముందుగా..

       నేడు దేశం లో ప్రభుత్వమే   ఉందా లేదా అని జనాలకు అనుమానం రావటంలో తప్పు లేదు.ఎటు చూసిన అవినీతి, బంధు   ప్రీతి, కోట్ల కొలది విదేశి బాంకుల్లో మురుగుతున్న ప్రజాధనం. దేశంలో జరిగే వాటికే లెక్క లేదు, విదేశాల్లో ఎవరికెంత ఉందొ చెప్పలేం అని చేతులెత్తేసిన ప్రభుత్వం. అన్నిటికీ మించి అనంత కోటి అవినీతికి శతకోటి ఉపాయాలన్నట్టు పేట్రేగిపోతున్న  ప్రజా ప్రతినిధులు. చట్ట సభలు చట్టు బండలై, ఏలే వారి కొమ్ముకాస్తున్న వైనం.
     ఘనత వహించిన పార్లమెంటు,ఇతర చట్ట సభలు చేసే చట్టాలు దేశం కోసం కాదు, రాజకీయుల కోసమే అనేది నేడు నడుస్తున్న చరిత్ర..ఈ వ్యాఖ్యకు   లోక్పాల్ బిల్లు పై పార్లమెంట్లో నడుస్తున్న చర్చ.ఇపుడు నడుస్తున్న చర్చ చూస్తుంటే, ఈ బిల్లు ఎప్పటికి వెలుగు చూసేటట్టు లేదు. ఏకా భిప్రాయం మాట అటుంచి, ఎలాగోలా దీన్ని ఆపాలనే ప్రఘాడ ఆసక్తి ప్రస్పుటం గా తెలుస్తుంది.
        ఒకవేళ ఈ బిల్లు ఏదో రూపంలో ఆమోదం పొందితే, తమ కిందకు ఎక్కడ  నీల్లోస్తాయో అని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాగం అందుకుంటుంది. అదుగో పులి అంటే ఇదుగో పిల్ల అన్నట్టు, రోజుకింత ముద్ద తిని శివాలయం వసారాలో పడుకొనే ముసలాయన గురుంచి కూడా అవాకులు చెవాకులు పేలారు. అన్నా నిజాయితీ ని జనం శంకిస్తే, బిల్లును పక్కకు తోసి చేతులు దులుపుకోవాలనే దుగ్ధలో ఇదో భాగం  అని వినగానే అర్ధం అవుతుంది.ఆయన సంఘ్ పరివార్ దోస్తు అని ఒకరంటే, విదేశి శక్తులేవో ఈయన ఉద్యమం వెనకాల ఉంది నడిపిస్తున్నాయని ఇంకొకరు వ్రాక్కిచ్చారు.
                  ఇక రిజర్వేషన్ల సంగతి.నేటి రాజకీయం దుస్తితికి నిదర్శనం.కుల మత రాజకీయాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఈ వ్యవస్థలో ఇది ఒక తురుపు ముక్క. దశాబ్దాలుగా మహిళా బిల్లు ఆమోదం పొందక పోవడానికి ఇదే పెద్ద అడ్దంకి.ఎన్ని సార్లు ప్రయోగించినా మల్ల మళ్ళా వాడుకోవడానికి వీలైన భేషైన ఆయుధం.ఈ బిల్లు ముందుకు నడవకుండా ముందు కాళ్ళ భందం.
                 చర్చలో పదే పదే మన నాయకులు ప్రస్తావించిన మరో సమస్య, ఒక వ్యక్తీ ఉన్నతమైన చట్ట సభలను ఆదేశించే స్తాయికి ఎదిగారని, అది ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు అనిన్నూ.అయ్యా..ఆయనే ఉంటె మంగలాయన ఎందుకని, మీరు చక్కగా ఉంటె కొత్తదేవుల్లెందుకు. ఉన్న వ్యవస్థ గొప్పగా పనిచేస్తుంటే, కొత్త వ్యవస్తలు బిల్లులు ఎందుకు. అమోఘమని మనం కీర్తించుకునే రాజ్యాంగానికి ఇన్ని సవరణలు ఎందుకు. అవన్నీ ఎవరో ఒకరు ప్రతిపాదిస్తే, చర్చించి మార్చినవేగా..అయినా, ఆయన చేస్తున్న ఆందోళనలన్ని శాంతియుతమేగా..సంతియుతంగా విరోధం తెలపటం, ఆందోళన చేయటం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మరి దీనిమీద వీళ్ళకంత భయం ఎందుకో.
                 కాలానుగునంగా మన చట్టాలు మార్చుకోవటం సవరించు కోవటం తప్పు కాదు. వీరి భాషలోనే చెప్పాలంటే, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ లకు,నేడు దేశం లో ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం సంబంధం లేదు. మరి వీటిని పొడిగించటం, ఎన్నికలముందు కొత్త కులాలను చేర్చడం, ఉన్నవాటిని పెంచటం ఇవన్ని ప్రస్తుతం ఉన్న వ్యవస్తలను ఎలా గొప్పగా మనం వాడుకుంటూ ఉన్నామో చెప్పకనే చెప్తాయి.ఇంకొక గొప్ప ఉదాహరణ. ఆంధ్రాలో విధాన మండలి. విదాన సభలోనే వీరి ఫీట్లు చూసి జనం సిగ్గు పడుతుంటే, కేవలం రాజకీయ నిరుద్యోగులను బుజ్జగించ కోవటం కోసమే మండలిని పునరిద్దరించారంటే అతిశయోక్తి కాదు.మరి జనం అంతా వ్యవస్థలో మార్పు కోరుకుంటుంటే, వారిని ఒకరు ముందుండి నడిపిస్తుంటే తప్పేముంది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న సిగ్గుమాలిన వుద్యమాలకంటే అయన చేస్తున్నది తప్పా. వందలమందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించాలని కొందరు ఉద్యమిస్తే, మాజీ ప్రధానిని చంపిన వారిని వదిలేయ్యని ఇంకో ఉద్యమం. మరి అలాటి వాటిలో వీరికి ఎటు వంటి తప్పు కనపడక పోవటం, యద్భావం తద్భవతి అన్నట్టు, మనం ఏది చూడాలి అనుకుంటే అదే కనపడుతుంది అని గీతా కారుడు చెప్పిన సత్యం.
                  ఏ ఉద్యమము అయినా ఒకరితోనే, ఒక మనిషి ఆలోచన తోనే ప్రారంభం అవుతుంది. జనం అతని విధానాలు, ఆశయాలు నచ్చి వెంట నడిస్తే అది ప్రజా ఉద్యమం అవుతుంది. నేటి రాజకీయులు మరుస్తున్న విషయం ఇంకొకటి ఉంది. నేడు ఈ అవినీతి వ్యతిరేక ఆందోళన జన ఉద్యమం. దీనికి చేష్టలుడిగిన ఏ వ్యవస్థ మద్దతు అక్కరలేదు. స్వప్రయోజనాలు కాపాడుకోవటానికి కిందా మీద పడుతున్న అతికొద్ది మంది మద్దత్తు దీనికి అక్కరలేదు.జనం మద్దత్తే  ప్రాణం.మరి దీనిని ఆపటం ఎవరి తరం.ఒక వేళ ఈ సారి కాక పొతే, వచ్చే సభలో నైనా..జనం దీనివెనుక ఉన్నంత కాలం జనాలకు ఉపయోగపడే విధంగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశా సజీవమే...

                                                          -------జై హింద్----

             



లోక్ ఫూల్-అమెరికతలు-౧౧

లోక్ ఫూల్ బిల్లు లో కొన్ని ముఖ్యాంశాలు :

౧.కేంద్రం లో లోక్ ఫూల్. రాష్ట్రం లో లోకా భుక్త. అక్కడ 9  మంది.అందరు మొదటి కేసు చూసేలోగా టపా కట్టేంత ముసలోళ్ళు( అనుభవజ్ఞులు అని చదువుకోండి పాపం).ఇందులో కూడా బ్యాక్ వార్డ్ రిజర్వేషన్ కింద 4 గురు. మత రిజర్వేషన్ కింద ఇద్దరు, అమ్మగారి రిజర్వేషన్ ఒకటి.యువ నేత రిజర్వేషన్ ఒకటి. మిగిలిన బూడిద జనాలకి.

౨.దీనికిన్డకు ప్రధాని వస్తాడు కాని, ఏవైతే ప్రభుత్వ శాఖలు ఆయన కిందకొస్తాయో వాటిలో ఆయనను విచారించకుండా ఎప్పటి కప్పుడు ఈ బిల్లు ని సవరించాలి.

౩. ఇంకా,ప్రధానిని విచారించాలంటే, మొత్తం లోక్ ఫూల్ సబ్యుల్లో మూడో వంతు మంది ఒకే రోజులో నలభై మైళ్ళు నడిచి సాయంత్రం అయిదు లోగా ప్రధాని ని ఆయన ఆఫీసు లో పట్టు కొని విచారించాలి, ఆ రోజు ప్రధాని దొరక పొతే, తర్వాత రోజు ఇదే పద్దతి లో ప్రయత్నించాలి. వారికి మూడే అవకాశాలు ఇవ్వబడతాయి. అప్పటికీ వారు ప్రధానిని విచారించలేక పొతే తర్వాత సంవత్చరం ప్రయత్నించాలి.

౪.అందరు ఉద్యోగులు లోక్ఫూల్ పరిది లోకి. కాని వారిని విచారించేది కే బీ సి. వారు మూడు ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే,వారు నిర్దోషులు గా ప్రకటించబడతారు.

౫. దీని సభ్యుల ఎంపికకు అన్వేషణ కమిటీని తీహార్ జైల్లో ఉన్న మంత్రులతో ఏర్పాటు చేస్తారు. కామన్ లూట్ పోటీలు, ౩ జీ స్కాం లో ఉన్న వారికి ప్రత్యెక రిజర్వేషన్.

౭. జీ బీ అయి లాంటి సంస్తలపై వీరికి ఎటు వంటి నియంత్రణ ఉండదు. అంతెందుకు, వీరి ఆఫీసు అద్దె కూడా వీరే కట్టుకోవాలి. కూర్చో డానికి కుర్చీలు బల్లలు తెచ్చుకోవాలి. లేకపోతే కింద కూర్చోవాలి.

౯. వీరు నేరం నిరూపిస్తే, నాలుగు గుంజీలు తీయాలి. ఒకేసారి తియ్యలేక పొతే రెండు మూడు విడతలు గా చెయ్యవచ్చు.కనిష్ట శిక్ష రెండు  గుంజీలు.

అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి, బిల్లులో ఈ కింది మార్పులు చేయటానికి పరిశీలిస్తున్నట్టు న్యాయ  శాఖ మంత్రి ప్రకటించారు.

౧. అధికారం లో ఉన్న పార్టీ కి లోక్ ఫూల్ కమిటీలో యాభయి శాతం సీట్లు. మిగతావి సంకీర్ణ భాగస్వాములకు,ప్రతిపక్షానికి కేటాయించారు.ఈ దామషాలోనే మత ప్రాతిపదికన కూడ  రిజర్వేషన్లు అమలు జరపటానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు.అలాగే ఇందులో కుల ప్రాతిపదికన కూడ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని దక్షిణాదికి చెందిన ఒక పార్టీ కోరింది.
౨. సంకీర్ణ భాగ స్వాములకు సంబందించిన పార్లమెంట్ సభ్యులకు ఇందులో మినహాయింపు కల్పిస్తారు. నల్ల కళ్ళజోడు పెట్టుకునే దక్షినాది నాయకులు వారి కుటుంబ సబ్యులను ఇందులో నుండి మినహాయించాలని ఒక పార్టీ సబ్యులు లోక్ సభలో భేటాయించి మరీ కోరారు.నల్ల కళ్ళజోడు అనే వాక్యాన్ని బిల్లు లో తప్పని సరి గా చేర్చాలని కోరారు.
౩. జీ బీ అయి కి ప్రతి గా వేరే దర్యాప్తు సంస్తను లోక్ ఫూల్ కింద ఏర్పాటు చేస్తారు. వారికి అధునాతనమైన పేము బెత్తాలు, కిర్రు చెప్పులు, ప్రభుత్వమే సమకూరుస్తుంది.
౪.గడ్డి సంబందిత వ్యవహారాలను ఇందులో నుండి మినహాయించాలని ఉత్తరాది కి చెందిన ఒక నాయకుని ప్రతిపాదన ను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
౫. ఎటు వంటి నిరాహార దీక్షలు అనుమతించ రాదనీ దీనివల్ల ప్రజా జీవితానికి భంగం కలుగు తుందని, ఇటీవల కాలం లో బీహార్ వలస వాసులను ముంబై నుండి కొట్టి  తరిమేసిన ఒక పార్టీ ఘట్టిగా కోరింది.ఇదే పార్టీ బిల్లు మరాటి లోనే ఉండాలని మిగత వాళ్ళు కావాలంటే తర్జుమా చేసుకోవచ్చని ప్రకటించింది.
౬.ఒకవేళ ఈ బిల్లు అమలు అయిన పాత కేసులు పరిసీ లించరాదని తీహార్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రుల కమిటీ కోరింది.

Saturday, December 10, 2011

హ్యాపీ ప్రిన్స్-అమెరికతలు-౧౪

ఒక మహా నగరం. నగరం కూడలి లో ఒక పెద్ద విగ్రహం. ఒకానొక కాలంలో ఆ దేశాన్ని పాలించిన రాజకుమారునిది. జనం మురిపెంగా ఆ విగ్రహాన్ని హ్యాపీ ప్రిన్స్ అని పిలుచుకునే వాళ్ళు. అందుకు అనుగుణం గానే ఆ విగ్రహం ఎంతో అందంగా ఉండేదట.కంచు తో చెయ్యబడ్డ ఆ విగ్రహానికి బంగారు పూతలు పూసారు. కళ్ళు నీలాలు.ఆయన నడుముకు వేళ్ళాడే కత్తి కూడా బంగారమే.దాని పిడికి ఒక కెంపు ఉండేదట. నగరం నది బజారులో ఆ విగ్రహం బంగారు వన్నెలతో కాన్తులీనేది.
ఒక రోజు ఎక్కడనించి వచ్చిందో ఒక చిన్న పిట్ట. ఆ నగర వీధుల్లో గిరికీలు కొట్టింది. తన వాళ్ళంతా దక్షిణ దిక్కుకి పోతున్నారు కాబోలు..అది కూడా అటే బయలు దేరింది. వచ్చేది సీతా కాలం ఏమో, చలి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చిన్న పిట్ట చలి నుంచి కాచుకోవటానికి తన రెక్కలను అదే పని గా అల్లార్చుతుంది. సాయంత్రం దాక ఆ వూరి అందాలను చూసిన పిట్ట, తన వాళ్ళనుంచి విడిపోయినట్టు గ్రహించింది. అరె..వీళ్ళంతా చాల దూరం వెళ్లి ఉంటారు..కాని ఏమి చేస్తుంది.చీకటి పడింది. రాత్రి కి ఎక్కడో తలదాచుకోవాలని చూస్తున్న  దానికి, హ్యాపీ ప్రిన్స్ విగ్రహం కనపడింది. ఈ విగ్రహం కాళ్ళ దగ్గర ఈ రాత్రి గడిపెయ్యాలని  అనుకుంది.
హాయిగా కాళ్ళదగ్గర పడుకున్న దానికి ఏదో పెద్ద చినుకు మీద పడ్డట్టు అనిపించింది.తలెత్తి చూస్తుంది కదా,రాకుమారుడి కళ్ళనుండి నీళ్ళు.ఏమైంది రాకుమారా...తన చుట్టూ తిరుగుతూ అడిగింది.
నేను రాజ భవనంలో ఉన్నప్పుడు నా ప్రజలు ఎలా ఉన్నారో నాకు తెలిసేది కాదు. కాని ఇప్పుడు చూస్తే, నా నగరం అంతా విషాదం,ఆకలి, చావు లతో నిండి ఉంది. మరి నా ప్రజలు ఇంత కష్టపడుతుంటే నా కళ్ళలో కన్నీరు తిరగటం లో ఆశ్చర్యం ఏముంది. అదుగో చూడు, ఆ నది వొద్దు అవతల ఒక తల్లి గుడ్డి దీపపు వెలుగు లో ఒక గౌన్ కుడుతుంది. ఆ చీకటి లో సూది గుచుకోవటం వల్ల ఆమె వేళ్ళు గుల్లబారి పోయినాయి. అదే గది లో ఒక మూల ఆమె కుమారుడు జ్వరం తో పడి ఉన్నాడు. వాడు మూడు రోజుల నుండి కమలా పళ్ళు అడుగుతున్నాడు. కాని ఆమె దగ్గర వాడికివ్వటానికి నది నీరు తప్ప వేరేమి లేదు.
ఓ నా చిన్నారి పిట్టా, నా ఖడ్గం నుండి కెంపు తీసుకెళ్ళి వారి కివ్వు. అది వారిని కొన్నాళ్ళైనా సుఖపెడుతుంది. పిట్ట ఆలోచించింది. ఆహా, యెంత మంచి ఆలోచన ఈ రాజకుమారునిది. చటుక్కున అది కెంపు నందుకొని తుర్రున ఎగిరింది. ఊరంతటి ని దాటి నదిని దాటి ఎగిరింది.ఆ ఇంటి కిటికీ లోంచి కెంపు ను జార విడిచింది.
ఆ రాత్రి విగ్రహం కాళ్ళ మద్య వెచ్చగా నిదురించింది.మరుసటి రోజు ఉదయం.పిట్ట తొందరగా లేచింది. తన దక్షిణ ప్రయాణానికి బయలుదేరుతూ రాకుమారునికి ఒక మారు చెప్పేందుకు వెళ్ళింది.ఓ  నా చిన్నారి పిట్టా..నీ ప్రయాణం   సుఖమగుగాక... కాని వెళ్ళే ముందు నాకొక పని  చేసిపెడతావా...అలానే..అంది పిట్ట.
వూరికి ఉత్తరాన ఒక కవి ఉన్నాడు. తను అందమైన కావ్యం రాయ పూనుకొన్నాడు. కాని పేదరికం ఆకలి వల్ల ఏమి చెయ్యలేకున్నాడు. వానికి రోజుల తరబడి ఆహారం  లేదు. రమణీయమైన కావ్య రచన చేసే కవి అలా బాధ పడటం నేను చూడలేకున్నాను.నా కళ్ళు నీలాలు. ఒక కన్ను తీసుకొని తనకివ్వు.
పిట్ట తటపటాయించింది. మరి మీ కళ్ళు. ఇంకొక కన్ను ఉంటుంది కదా మరేం పర్లేదు.పిట్ట అలానే చేసింది. అలా ఆరోజు కూడా పిట్ట ప్రయాణం వాయిదా పడింది.
తర్వాత రోజు రాజకుమారిని విగ్రహం కింద ఒక చిన్నారి కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. రాజు పిట్టను పిలిచాడు.చూడు..ఆ పిల్ల అగ్గిపెట్టెలు అమ్ముతుంది.ఈ రోజు అగ్గిపెట్టెలు అన్ని కాలవలో పడి పోయాయి.ఖాళి చేతులతో ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న అసలే తాగు బోతు. ఆ పిల్లను చంపేస్తాడు.నా రెండో కన్ను కూడా ఆ పిల్ల కు ఇచ్చేద్దు..నీకు పుణ్యం ఉంటుంది.
సరే..విగ్రహం రెండో కన్ను కూడా ఆ పిల్లకు ఇవ్వబడింది.పిట్టకు ఆ రాజకుమారుని మీద యెనలేని ప్రేమ కలిగింది. అయ్యో ఇప్పుడు అతను ఎలా చూస్తాడు..మరి కొన్ని రోజులు అక్కడే ఉండి, నగర విశేషాలన్నీ చెప్పాలని నిర్ణయించుకుంది.
అది చెప్పే బాధలు కస్టాలు విని, రాజు గుండె కదిలింది. తన విగ్రహం మీదున్న బంగారు పూతలను నగరం లో బాధలు  పడే ఒక్కొక్కరికి పంచమని అర్దిస్తాడు.కొన్ని రోజులకు విగ్రహం మీద ఉన్న బంగారం అంతా ఖాళి అయిపోతుంది.విగ్రహం కళా విహీనం అవుతుంది.
ఇలా జరుగుతుండగా, పిట్ట చలికి తాళలేక పోతుంది. మంచు కాలమేమో, దానికి తల దాచుకునే ప్రదేశము కరువవుతుంది. రోజుల తరబడి నగర ప్రయాణంతో తనలో చివరి శక్తీ హరించుకు పోయిందని అర్ధం అవుతుంది.చివరి సారి విగ్రహం తో అది మాట్లాడుతుంది. మిత్రమా..నువ్వు నాకు నా ప్రజలకు ఎంతో సేవ చేసావు..నీ దక్షిణ ప్రయాణమునకు చాలా ఆలస్యం అయింది.బయలు దేరు..తిరుగు ప్రయాణం లో నను మరువకు సుమీ..రాజు అభ్యర్ధించాడు.రాకుమారా, నాలో శక్తి లేదు అంతదూరం వెళ్ళడానికి, నా అంతం సమీపించింది.ఈ తనువు భూమిపై రాలే ముందు చిన్న అభ్యర్ధన. చెప్పు మిత్రమా. చివరి సారి మీ పెదవులు చుంబించాలని కోరిక.
పిట్ట కోరిక తీర్చబడింది. ఆయువు వీడిన దాని శరీరం నిర్జీవమై విగ్రహం పాదాల దగ్గర పడిపోయింది.అదే సమయం లో విగ్రహం లో పెద్ద శబ్దం.దాని గుండె పగిలింది.
నగర పర్యటనకు వచ్చిన ఆ నగర మేయర్, విగ్రహాన్ని చూసాడు.పూర్తిగా కళా విహీనం అయన  దానిని అక్కడనుంచి తొలగించాలని అజ్ఞాపిస్తాడు.అట్లే, విగ్రహం తొలగించ బడుతుంది.కంచు కోసం అది కరగించబడుతుంది.
కాని వారు విగ్రహం గుండెను కరగించలేక పోతారు. ఎన్ని సార్లు కరిగించినా, అదే అట్లే ఉండెను.వారు దానిని రోడ్డు పక్కన పారవేసిరి.యాదృచ్చికమేమో పక్కనే పిట్ట శరీరం పడి ఉండెను.
ఆస్కార్ వైల్డ్ రాసిన ఈ కధ. మానవ లక్షణాలైన దయ,స్నేహం,ప్రేమలను విగ్రహాలకు, పక్షులకు ఆపాదించినా,కధ చదువుతున్నంత సేపు మీకా ఆలోచన రాక పోవడం కధకుని గొప్పతనం.
చిన్నప్పుడు చదివిన ఈ కధ.ఈ రోజు చదివినా, ఎంతో బావుంటుంది.అంతం కొంచెం బాధా కరమైనను, అవ్యాజమైన ప్రేమ,స్నేహం విడిపోని బంధాలన్నీ, అవి ప్రతి పరిస్తితి లో తోడు నిలుస్తాయని అనిపిస్తుంది.ఈ కధకు ఇంత కన్నా గొప్ప అంతం ఉండదేమో అనిపిస్తుంది.