రష్యా చరిత్ర లో ఒక సంఘటన. జార్ చక్రవర్తి పీటర్ ఖజానా నింపుకునేందుకు ఒక చిన్నచిట్కా వేస్తారు. ఎవరైతే కొన్ని అంగుళాల కన్నా ఎక్కువ గడ్డం పెంచుతారో వారు నెల వారి గా ప్రభుతవానికి పన్ను కట్టాలి. అప్పట్లో గడ్డం పెంచడం ఒక కులీనుల సరదా, అవసరమున్ను. యెంత గడ్డం ఉంటె అంత పెద్దమనిషి అన్నమాట. మరి చచ్చినట్టు అలాటి వాళ్ళంతా పన్ను కట్టేరు. ఆ డబ్బు వాళ్లతో వీళ్ళతో యుద్దాలు చెయ్యడానికి మరి పీటర్స్ బుర్గ్ అనే గొప్ప నగరాన్ని కట్ట డానికి ఉపయోగపడింది.
ఈ మద్య నడుస్తున్న చరిత్రను చూస్తే ఎందుకో దీన్ని మన దేశానికి అన్వయిద్దాం అనిపించింది. ఈ రోజుల్లో మన దేశం లో గడ్డం పెంచితే బాబా జుట్టు పెంచితే స్వామీ. గీత, రామ అంటే పరమహంస. నేనే దేవుణ్ణి అంటే భగవాన్. దేవుడి పెళ్ళాం, అనుమానం ఎందుకు అమ్మ భగవాన్. ఇంకా నయం మరిది భగవాన్, కొడుకు భగవాన్ రాలేదెందుకో. వీళ్ళు పోయాక వాళ్ళేమో. ఈ లాజిక్ పనిచేస్తే ఇలా అవడం పెద్ద కష్టం కాదు. ఒక ౪ నెలలు క్షురకుడి దగ్గరకు వెళ్ళాక పొతే సరి…మీరే ఒక స్వామి. పైన పీటర్ లా ఆలోచించిన మన ఖజాన కి ఎంతో కొంత డబ్బు రాక పోదు.
ఇంకో కధ. పూర్వం ఒక స్వామిజి వాళ్ళ శిష్యులతో కలిసి అదేదో నది దాటుతున్నారట. అక్కడ ఒక అమ్మాయి నది దాటలేక అవస్త పడుతుంటే స్వామీజీ తన భుజాలపై ఎక్కుంచుకొని నది దాటిన్చారట. నది దాటాక వాళ్ళు నగరమంతా తిరిగి భిక్ష తీస్కుని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కాని శిష్యులు సర్వ సంఘ పరిత్యాగి ఐన గురుజి ఇలా చెయ్యడం ఏంటి అని ఆలోచిస్తున్నారట. అప్పుడాయన అబ్బాయిలు నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దిన్చేసాను. మీరు ఇంకా నెత్తి నెట్టుకున్నారెందుకు అని అడిగారట.
ఈ గురు వేవడో సత్తే కాలపు మనిషి లా మీకు అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఎందుకని పించదు. గురూజీ అంటే జనం ముందు గీత పారాయణం. రాత్రి కి ఏమిటో మీరీ పాటికి రకరకాల టీవీ చాన్నేల్లలో రక రకాలు గా చూసే ఉంటారు. ఆ nityananda కి నా స్నేహితులు చాల మంది మంచి ఫాన్స్. నన్ను కూడా విన మని రెండు మూడు సార్లు డీ వీ డీ లు గట్త్ర ఇచ్చారు. కాని, టైం కుదరకో టైం బాగుందో మరి నేను చూడలేదు. కాని nityananda చాల శక్తి వంతులు. ఆయన లీల వినోదం చూపించే తీరారు.
ఇక గడ్డం పెరిగిన భగవాన్. మత్తు మందులో మరో ప్రపంచం చూపించే కల్కి. ఆ మత్తు లో ప్రపంచం చూడటం ఏమి ఖర్మ, కొత్త ప్రపంచం స్తాపించేయ్యోచ్చు. అనుమానమా, మన దాసాజిలను అడగండి. ఆత్మా పరమాత్మ సంగమం అంటే మంచిగా ౪ రౌండ్లు ప్రసాదం పుచ్చుకుంటే ఇట్లే అర్ధం అయిపోతుందట. అమ్మ భగవాన్ సంస్కృత ఘోష కూడా ఆంధ్ర దేశం అంతా విని తరించేసింది.
ఇవన్ని అనవసరం అండి, ఈ బాబా లు భగవాన్ లా వెంట పడి పోయే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. సర్వ సంఘ పరిత్యాగి కి డబ్బులెందుకు. ప్రపంచాన్నే మార్చే భగవాన్ లకు పైసా లెందుకు. దర్శనం కి ఒక రేటు. ఇంకో డానికి ఇంకో రేటు, ఆ డబ్బులన్నీ పెట్టి అయ్యవారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కొడుకు భగవాన్ ౬-౭ కంపెనీలు నడుపుతున్నారట. మన భక్తులు అది కూడా సమాజ ఉద్దరణ అంటారేమో.
నాకొక అనుమానం. మన nityananda రేపు మల్ల ఒక ప్రెస్ మీటింగ్ పెడతారేమో. ఆ అమ్మాయి కి కామి కాని వాడు మోక్ష గామి కాదు అని భోదిస్తుంటే మీడియా వక్రీకరించింది అని. ఇన్ని నమ్మిన గొర్రెలు అదీ నమ్మినా ఆశ్చర్యం లేదు….
కల్కి దర్శనం…nityanandam…nityanando ranjito rajnithaha ;)
No comments:
Post a Comment