నవంబర్ 2008.
నా మొదటి విదేశి యానం. కెనడా లో అడుగు పెట్టాక, నేరుగా హోటల్ లో దిగాం నేను నా సహా ఉద్యోగి, ఇప్పుడు వన్ అఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కిరణ్. క్రౌన్ హోటల్ ఇన్ విన్ఫోర్డ్ డ్రైవ్. మొదటి రోజంతా ఆ హోటల్ బైట చూస్తూ గడిపేసాం.
బైట చలి. దానిపైన కొత్త ప్రదేశం ఏమో బైటకి వెళ్ళాలంటే భయం. రెండో రోజు అనుకుంటాను వచ్చాడు మా ఇంకో సహోద్యోగి అజయ్. వాడికి టొరంటో కొట్టిన పిండి. అలా బైటకి వెళ్దాం పదండి అని బయల్దేరాదీసాడు.
గొప్ప ట్రాన్స్పోర్ట్ సిస్టం టొరంటోలొ. ఏదో మారుమూల ప్రాంతం కాకపోతే తప్ప ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు ఏ స్టాప్ లో నైనా. అక్కడ బస్సు లో కండక్టర్ ఉండడు. డ్రైవర్ ఎ టికెట్ ఇస్తాడు. మీరు డ్రైవర్ పక్కన బాక్స్ లో సరి పడా చిల్లర వెయ్యాలి అంతే.భలే తమాషా అని పించింది. మీరు వేసే చిల్లర డ్రైవర్ లెక్కించడు. సరే, అజయ్ చెప్పినట్టు 3 స్టాప్ ల తర్వాత దిగాం. టిం హోర్టన్స్ . కాఫీ షాప్. త్రీ స్మాల్ ఫ్రెంచ్ వనిల్లా. బైట చలి కి ఆ వేడి వేడి వనిల్లా ఫ్లేవోర్ గొంతు దిగుతుంటే ఏదో కొత్త అనుభూతి. అప్పటి నుంచి టిం కి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయాం నేను కిరణ్. ఆ బాచిలర్ హడావుడిలో మద్యాన్నం లంచ్ బ్రేక్ లో షేర్ చేస్కున్న సాండ్ విచేస్. మేమంతా ఎంతో ఇష్ట పడే వెజి సూప్. నా అల్ టైం ఫేవరిట్ టిం బిట్స్.
సందర్భం ఏదైనా మా మీటింగ్ పాయింట్ టిం హోర్టన్ ఏ అయ్యేది. పైన ఉన్న టిమ్మీ కిరణ్ వాళ్ళ అపార్ట్ మెంట్ బైటది. ఆఫీసు కూడా దగ్గర అవడం తో, ఏ మద్యన్న బ్రేక్ అయినా, సమ్మర్ టెన్నిస్ గేమ్ మద్యలో బ్రేక్ టైం అయినా, వీక్ ఎండ్ లోకల్ ఫ్రెండ్స్ తో మీటింగ్ పాయింట్ అయినా,ఏ కొత్త ఎంప్లాయ్ వచ్చినా వీకెండ్ పిచ్చా పాటి కైనా ఇదే వేదిక అయ్యేది. కెనడాలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మా కళ్ళు టిమ్మీ కోసమే వెతికేవి. చివరికి పక్కా ఫ్రెంచ్ సెట్ అప్ క్విబెక్ డౌన్ టౌన్ లో అంతా వెతికి అక్కడ టిం లేదని నిర్ణయించు కొన్నాక లోకల్ రెస్టారెంట్ కి వెళ్లినట్టు గుర్తు మా సెండ్ ఆఫ్ కి క్లైంట్ టీం అంతా వచ్చి టిం లోనే బై చెప్పినట్టు గుర్తు.
మొన్న జనవరి లో కూడా యు ఎస్ వెళ్ళినప్పుడు పట్టు బట్టి టిం కి వెళ్లి మా ఆఫీసు కి టిం బిట్స్ పట్టుకేల్లడం గుర్తుంది . మాకు టిం తో ఈ అనుభంధం కేవలం ఒక కొత్త ప్రదేశంలో మొదటి అనుభవం అనుభూతుల వల్ల కావచ్చు కాని... ఎప్పుడు ఎక్కడ ఈ సింబల్ కనపడ్డా ఆ పాత రోజులు ఆ మధురాను భూతులు ఎలా వున్నావ్ నేస్తం అని మనసార పలకరిస్తాయి. ఈ రోజు టిమ్మీ ఇస్ టేకెన్ ఓవర్ బై బెర్గేర్ కింగ్ అంటే ఎందుకో మింగుడు పడలేదు. ఎక్కడ విస్తరించినా టిం ఒక పక్కా కెనడియన్ బ్రాండ్. నా అంచనా నిజం ఐతే కొత్త సంస్త బర్గర్ కింగ్ ఏ అవుతుంది. మార్పు సహజమే కాని సం హౌ ఐ ఆల్రెడీ స్టార్టేడ్ మిస్సింగ్ టిమ్మీ.............
TIM IS STILL TIM..nice...
ReplyDelete