చాలా కాలం గడిచిందేమో
చేతివేళ్ళమధ్య నీళ్లలా జారిపోయిందేమో
జ్ఞాపకాలు ఇష్టాలు
ముసురు పట్టాయేమో
పరిచయాలు స్నేహాలు మసకబారాయేమో
ఎవరికైనా నేను గుర్తున్నానో లేదో
ఏమో నన్నెవరూ పలకరించినట్టులేదు
ఎన్నో యుగాల నుంచి
ఎవరో వచ్చి విడుదల చేస్తారని
ఆశగా ఎదురుచూసే కాలనాళికను నేను
నడివేసవిలో మిట్టమద్యాన్నం
వాన చినుకై ఎదురుచూసే
బహుదూరపు బాటసారిని
చేతివేళ్ళమధ్య నీళ్లలా జారిపోయిందేమో
జ్ఞాపకాలు ఇష్టాలు
ముసురు పట్టాయేమో
పరిచయాలు స్నేహాలు మసకబారాయేమో
ఎవరికైనా నేను గుర్తున్నానో లేదో
ఏమో నన్నెవరూ పలకరించినట్టులేదు
ఎన్నో యుగాల నుంచి
ఎవరో వచ్చి విడుదల చేస్తారని
ఆశగా ఎదురుచూసే కాలనాళికను నేను
నడివేసవిలో మిట్టమద్యాన్నం
వాన చినుకై ఎదురుచూసే
బహుదూరపు బాటసారిని