లోకం మరిచినా మనపై కాలం గెలిచినా
ఆకాశం భూమి కలవవని ఎవరో చెప్పినా
చిప్పిల్లిన కళ్ళలో నీ రూపం నింపుకుని
బతికేయడంలో ఏమి ఆనందం ఉందని నువ్వే అడిగినా
నీవులేని ప్రతి క్షణం నా ఉనికినే వెక్కిరించినా
ఈ జన్మకు నిండిన జ్ఞాపకాల దొంతరల్లో నీతో గడిపిన క్షణాలు ప్రత్యేకం
ఆ సూదూర దర్శనాలు నీకోసం గంటలకొద్దీ వేచిన ఆ రోజులు
ముసిముసి నవ్వుల్లో వికసించిన పరిచయాలు
అపురూపంగా దాచుకున్న
అనుభూతులు
నీనుంచి దూరం వెళ్లిన ప్రతీ సారి
నన్నే మోసగించి నీ దరి వాలే నా తలపులు
లోకంలో ఏమూల దాగున్నా నీ ఊహలతో
ఉక్కిరిబిక్కిరి అవటమే నాకు తెలుసు...
గుండెల్లో ఏళ్ల క్రితం గీసుకున్న నీ చిత్రం
పదిలంగా పొదివిపట్టుకోవడమే నాకు తెలుసు...