Saturday, September 8, 2012

చదువులు చట్టు బండలు

బుడి బుడి అడుగుల నా బాల్యం 
నర్సరీ స్కూల్ మెట్ల మీద అంతరించింది.

తాతయ్యతో నా కబుర్లు 
వుయ్యాలతోట్టితో సరి 

నడిచానని నాకే సారీ శిక్ష 

నా కేరింతలు 
స్కూల్ నాలుగు గోడల మధ్యే ప్రతిధ్వనించాయి 

కీ ఇస్తే తిరిగే మర మనిషిని నేను 
సృజన నేనే  పుస్తకాల్లో చూడలేదు  

ఒకటి కి ఒకటి కలిపితే ఎంతో  తెలుసు 
ఎందుకు కలపాలో తెలీదు 

అమ్మకి ఐ ఐ టి ఇష్టం నాన్నకి మెడిసిన్ కాకుంటే కష్టం 
నువ్వేమవుతావు కన్నా అని నన్నెవ్వరు 
అడగలేదు..వినివూర్కొవటమే నాకు తెలుసు 
నేనెప్పుడు చెప్పలేదు

గిజిగాల్ల కూతలు వినని అమ్మజోల తెలియని 
వానవిల్లు రంగులు చూడని నవతరం మేము 
రేపు వచ్చే తరానికి మార్గ దర్శిలము  మేము 

పుస్తకాల బరువుతో విల్లులైన నడుములతో 
చదివీ చదివీ మసకబారిన మా చూపులతో 
దేశానికి దిశా నిర్దేశం చేస్తాం 

**** విద్యా సంస్తల ధన దాహానికి, తల్లి దండ్రుల దూరాశలకు, లాబీ డబ్బులతో కళ్ళు మూసుకున్న ప్రభుత్వ నిష్క్రియ పరత్వానికి బలి అవుతున్న నా దేశపు  బాల్యానికి నా జోహార్లు ****



5 comments:

  1. ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలను చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. అంతేనండి, జోహార్లు అర్పంచడం తప్ప ఇంకేం చేయగలం మనం, బాగుంది కవిత.

    ReplyDelete