నడుస్తున్నాను..
అందరికి దూరంగా, ఎల్లలు లేని నడక..
నన్ను నా అనుకునేవాళ్లు, నేను నాకే అనుకున్న వాళ్ళు,
దూరంగా చుక్కల్లా...కలకాలం కధలలాగా..
మల్లా వెనక్కి రమ్మంటూ...నీకు మేమున్నాం కదంటూ..
పిలుపులకు అందనంత దూరం నేను జరిగి
కాలం కందని మనోమార్గాలలో
కాళ్ళు కందినా, కళ్ళలో కలలు కరిగినా.
ఆగలేని అలపు రాని ప్రయాణం.
ఎవ్వరికోసమో ఎందుకో తెలీదు.
ఆది అంతం లేని నడకలలో
ప్రయాణమే తప్ప గమ్యం పై ద్యాస లేదు.
దారిలో పలకరించే బాటసారి దోస్తుల్లో
ఏనాడో నేను మరచిన చిన్ననాటి ఊసులను నెమరేసుకుంటూ
Ayya....mimmalini yevaru pilicharu ani...antha feel aypothunnav....ikkadiki vachina tharvatha...ade kukka bathuku....thokalo eeka bathuku.. oka saari call cheyochu kada
ReplyDelete