ఏరుకోండి రా ఏరుకోండి...
అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లల శవాల మీద
మీ వోట్లను ఏరుకోండి...
రండి రండి పరుగున
వీడో వాడో ముందొచ్చి మీ వోట్లు కొట్టుకేలత డేమో...
ఒకటో తరగతి పుస్తకం పై
తడి ఆరని నెత్తుటి చార
మీకు పడే వోటు ముద్ర లాగ కనపడుతుంటే
గుండలవిసేలా ఏడ్చి సొమ్మసిల్లిన
ఆ తల్లి పెట్టిన ఆక్రందన
నీ జిందాబాదే అనుకో
రిక్షలాగే అయ్య
పాచి పని చేసే టమ్మ
చచ్చింది పిల్లోడే
నీకింక రెండోట్లున్నాయ్ గా ఇంట్లో
పండగ చేసుకో
యెంత మంది సస్తే ఏందీ
దేశం స్మసానమైతే ఏంది
ఆ సమాధుల పునాదులపై
నీ రాజ్యం నిర్మించుకో
పొద్దుగాలే బడికి పోయిన చిట్టి పొట్టి చిన్నారులు
అమ్మ అయ్యా రెక్కలు ముక్కలు చేసుకు
పూట గడవని దుస్తితిలో
నాలుగు ముక్కలు నేర్చి
రేపు మార్చే చిన్న పాపలు.
నీ వ్యవస్థ అవ్యవస్థ
వొండి వడ్డించిన
నెత్తుటి కూడు
నరనరాన విషమై
ఉసురు తీసుకుంటుంటే
యాడ సస్తివోలీడరోడా
చావు బతుకున
కొడిగట్టిన పసిప్రాణం
ఆసుపత్రి బెడ్డు మీద
కొట్టుమిట్టలాడుతుంటే
గాలిగూడ ఆడకుండా
నీ రోదేందిర సచ్చినోడా...
చాప్రా విషాదాన్ని రాజకీయం చేస్తున్న రాబందులకు.....
No comments:
Post a Comment