నవంబర్ 21 ,2016.
౧౨ లాలూచి పథ్,కొత్త ఢిల్లీ.
సాముహిక లంచం క్రీడల ప్రారంభోత్సవం నేడు..
Blocked Games Road.. No Entry… పక్కనే సిగ్న్ బోర్డ్ వేలాడుతుంది..ఆ రోడ్ కి.. సరిగ్గా క్రీడా ప్రాంగణానికి వెళ్ళాలంటే వేరే రోడ్ లో వెళ్ళాలి.కొంచెం దూరం అవుతుంది ఆ దారి.ముందు నేను అదే దారి లో వెళ్దాం అనుకుంటే, నా దోస్త్ ఎవరో చెప్తే ఈ దారిని వచ్చాను. కాని, రోడ్ బ్లాక్ బోర్డ్ ఉంది ...అప్పుడు చూద్దును కదా...ఈ రోడ్ లో బ్రంహాండ మైన రద్దీ..అందరూ ఇదే దారిలో క్రీడా ప్రాంగణానికి వెళ్తునారు. సరే నేను నా కార్ ని ఇదే రోడ్ లో కి తిప్పాను. బోర్డ్ తీయ్యటం మర్చి పోయారేమో...రోడ్ చివరలో అర్దమైంది అసలు సంగతి. అక్కడి ట్రాఫిక్ పోలీసు చక్కగా ప్రతి వాహనాన్ని ఆపి, పదో పరకో జేబులో వేస్కొని పంపిస్తున్నాడు. ఈ బోర్డ్ అతిక్రమించి నందుకేమో..పొద్దున్నే పెనాల్టి ఏంట్రా బాబు అనుకుంటూ నేను అతని పక్కనే ఆపి విండోస్ దించాను.గుట్కా నమిలి నమిలి, అదేదో రంగులో మారి పోయిన పళ్లన్నీ,నేనేదో డెంటిస్ట్ అన్నట్టు చూపిస్తూ..సౌ రూపాయే అన్నాడు..నేనిచ్చిన నోటు జేబులో వేస్కుని పోమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. రసీదు ఇస్తాడేమో అని వెయిట్ చేస్తున్న నాకు అప్పుడర్దమైంది. అయ్యవారు ఇక్కడ మంచి లాభ సాటి వ్యాపారం నడుపుతున్నారని.
సరే కార్ పార్క్ చేసి మెయిన్ గేటు దగ్గరకు వచ్చాను.టికెట్స్ సొల్ద్ ఆఫ్..బోర్డ్ నన్ను వెక్కిరించింది. అయ్యో ఎలాగా అని చూస్తుంటే, వాడెవడో టికెట్ల కట్ట పట్టుకుని గోడ వార గనిలబడి ఉండటం.జనం వాడి మీద పడి, కొనటం చూసాను. దగ్గర కెళ్ళి అడిగాను. టికెట్టు ౫౦౦౦. బేరం మొదలెట్టాను..వాడు నేనేదో వాడి జేబు కొట్టేసినట్టు మొహం పెట్టి, మేనేజర్ సాబ్ కోభి ఇసీమే ఖిలాన హాయ్ సాబ్..అన్నాడు.ఆహా..ఇది కదా లంచావతారం అంటే. టికెట్లు అన్ని బ్లాక్ లోనే అమ్ముతున్నారు.అందులో అందరు పదో పరకో పుచ్చు కుంటున్నారు. సరేలే అని ఆ డబ్బు వాడి చేతిలో కుక్కి ఎంట్రన్సు దగ్గరకి వచ్చాను. టికెట్టు తీస్కున్న వాడు అదేదో రహస్యం చెప్తున్నట్టు వంగి, ఆగే భైటన హై క్యా..౫౦౦ లగేగా అన్నాడు. ఓహో ఈ సౌలభ్యం కూడా ఉందా నాయనా..సరే..ఆ ౫౦౦ వాడి చేతిలో పెట్టాను. పక్కనే ఉన్న కుర్రాడిని నాతొ పాటు పంపాడు.నేను కొన్న టికెట్టు కన్నా ౧౦ లైన్లు ముందు ఒక సీట్ లో కూర్చో బెట్టాడు వాడు. ఆహ..ఇక్కడినుంచి బాగా కానీ పిస్తుంది. ఇప్పుడే మహా మహులంతా వేదిక నేక్కారు. ప్రదాని, రాష్ట్రపతి, వగైరా వగైరా...అయ్యవారు పెద్ద స్పీచ్ ఇవ్వడం ప్రారంబించారు.ఈ క్రీడలు ఇక్కడ జరపటం గొప్ప విషయం అని, ఏంటో కష్టపడి మన క్రీడా మంత్రి అంతర్జాతీయ మద్దత్తు తో వీటిని ఇక్కడకు తీస్కోచారని. అదేంటి, పొద్దున్న విన్న సి.యెన్.యెన్ లో అలా చెప్పారు. మనోళ్ళు అన్ని దేశాల ప్రతినిదుల్ని డబ్బుతో కొనేసి, ఈ క్రీడలను సంపాదించారని.పెద్దాయన చెప్తుంటే ఇదే నిజం అయి వుంటుంది. వెదవలు , మన గొప్పతనం చూసి వోర్వలేదు విదేశి మీడియా
అదేంటి, పెద్దాయన అలా వొరిగి పోతున్నాడు. అప్పుడు గమనించాను.ఒరిగి పోతుంది పెద్దాయన కాదు. సభ ప్రాంగణం అని.కుప్పకూలి పోయింది. కూర్చున్న వాళ్ళు కూర్చునాట్లే దిగబడి పోయారు. అటు ఇటు పరిగెత్తు తున్న సెక్యూరిటీ వాళ్ళు, అంతా గందర గోళం. మొత్తానికి జంబో సైజు రాజకీయ నాయకులని పైకి లేపడం సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ కూడా కావటం లేదు. ౧/౨ గంట నడిచిన తర్వాత,అమ్బులన్సు లో అందరిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇంతలో ఆయన సైజు కి తగ్గట్టు జనం ముద్దు గా పిల్చుకునే ఖడ్గమృగం నాయకుడు ప్రారంబోత్సవం అయింది అనిపించాడు. లేట్ ది గేమ్స్ స్టార్ట్..
మొదటి పోటీ..౧౦౦ మీటర్ల పరుగు పందెం. మనోళ్ళు ఎప్పుడు విదేశాల్లో జరిగినప్పుడు గెలవని పందెం. ఈ సారి మన దేశం నిర్వహిస్తుందని ఈ కంపు గొట్టే క్రీడా గ్రామాని కి మేము రాము అని కొందరు,శాంతి బద్రతల సమస్య ఉందని మరి కొందరు మానేయడం తో ఈ సారైనా మనకు పతకం వస్తుందేమో. ప్రారంభం అయ్యింది. ౫౦ మీటర్లు మనోడు ఆ చుట్టూ పక్కల కనిపించాలా...కాని అదేంటో సినిమాలో హీరో పరిగెత్తు తుంటే మిగత వాళ్ళు మెల్లగా పరిగెత్తి నట్టు మనోడు పరిగెత్తు తున్నాడు అనేకంటే మిగతా వాళ్ళు మెల్లగా పరిగెత్తు తున్నారని పించింది. మొతానికి ఏది ఏమైనా మనోడు వెంట్రుక వాసి లో గెలుపొందాడు అండి. ఆహ..అప్పుడు చూడాలి..జనం కుర్చిలలో నుండి లేచి కుప్పి గంతులు గోలా..
అదీ ఇదీ కలిపి మద్యాన్నం ప్రాంతానికి జరిగిన అన్ని పోటీలలో మనోల్లదే గెలుపు.. అదేంటి చెప్మా..మిగతా దేశాల్లో పోటీలు జరిగినపుడు..గొప్పగా రాణించే విదేశీ క్రీడాకారులు మన దేశం లో యెందుకిలా..మన వాతావరణం సరి పడి ఉండదు..అంతే అయి వుంటుంది..
మిగతా స్టేడియం లలో మనోళ్ళు ఎలా ఆడుతున్నారో విందాం అని నా మొబైల్ లో రేడియో ఆన్ చేశా..సిగ్నల్ వెతుకుతుంటే వినపడ్డది బీ.బీ.సి. సరే మన గొప్పతనం వీల్లేమి చెప్పుకుంటూన్నారో విందాం అని వింటున్నా..అదేంటి. ౧౪ లంచావతారం రోడ్ లో ఉన్న మేహుల్ గాంధీ ఎనిమిదో నెల కడుపులో ఉన్న యువనేత భావి భారత ప్రదాని జీబెల్ గాంధీ పేరు పెట్టిన స్టేడియం లో రన్నింగ్ రేస్ మైదానం లో నీళ్ళు ఉండటం తో ౨ క్రీడాకారులు జారి పడ్డారని, నాసిరకం పోల్ విరగటం తో జారి పడ్డ పోల్వాల్ట్ క్రీడాకారుడి నడుము కూడా విరిగిందని..అవాకులు చెవాకులు...ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే..మన గొప్ప తనం చూసి కళ్ళలో నిప్పులు పోస్కుంటారు.
అంతలో డబ డబ అని శబ్దం..అదేంటి మబ్బు లేకుండా ఉరుములు...పైకి చూసా...స్టేడియం కప్పు ఒక వైపుకు ఒరుగుతుంది.అబ్బే..అదేదో సెక్యూరిటీ చెక్ అయివుంటుంది.లేక పొతే మొన్న కట్టింది అప్పుడే కూల్తుందా...ఇంతలో నేన్ను కూర్చున్న వైపు కూడా శబ్దం వినిపించింది.పైకి చూద్దును కదా..
కళ్ళు తెరిచే టప్పటికి ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడున్నాను నేను...ఏదో నొప్పి గా ఉండటం తో తడుము కొని చుస్కున్న..తలకు తల పాగా చుట్టినట్టు...అబ్బో ఇదేంటి...హాస్పిటల్ లో ఉన్నా అని అర్ధం అయ్యింది...మెల్లగా లేచి రూం లోంచి బైటకు వచ్చా..
రిసెప్షన్ లో జనం అటు ఇటు పరిగెత్తు తున్నారు. మా ఆయన ఎక్కడ అని ఒకావిడ..మా అన్నగారు అని ఒకాయన...చాల మంది కి దెబ్బలు తగిలి నట్టున్నాయి.ఎవర్ని కదిలించిన అసలేం జరిగిందో ఎవరు చెప్పట్లే. ఈ హడావుడి నుంచి దూరం గా లాన్ లో కూర్చున్నాను. పేపర్ ఒకటి కొని అసలేమైందో అన్న ఉత్సుకత తో చదవటం మొదలెట్టా..నిన్న స్టేడియం కూలటం వాళ్ళ ౫౦౦ వందల మంది చని పొయ్యారని..౧౦౦౦౦ మంది గాయ పడ్డారని వార్త...నాసిరకం నిర్మాణాల వల్లే ఇదంతా జరిగిందని విదేశి మీడియా బోగట్ట..ఇదంతా మాములే అని ముక్య మంత్రి వివరణ. స్పోర్ట్స్ పేజిలో మనోళ్ళు ౧౦౦ కి ౯౦ పతకాలు గెలిచారని వార్త..కిందనే విదేశి పత్రికల శూల శోధన...విదేశీ క్రీదాకారులన్దర్నీ మన అధికారులు కోనేసారని..అందుకే మనకు ఇన్ని పతకాల పంట అని...
ఛీ ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే అని అన్ని పార్టీల సంయుక్త ప్రకటన...దీన్ని బలపరుస్తూ..రాజధాని లో అక్కడక్కడా విదేశి మీడియా ఆఫీసుల మీద జోమ్రాస్ పార్టీ దాడులు...తిక్క కుదరాలి సన్నాసులకి....ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చిన పదో పరకో పుచ్చుకొని స్వదేశి మీడియా లాగ వాళ్ళు చెప్పింది చెప్పక..దేశాన్ని వుద్దరిద్దాం అని బయలు దేరితే ఇలాగే అవుతుంది.
వారం రోజుల తర్వాత ఇంకో వార్తా చదివాను పేపర్లో. ముగింపు ఉత్సవాలలో ఆకాశం నుంచి పూలు చల్లుతున్న మొన్ననే క్రుష్య దేశం నుంచి కొన్నబుగ్-౪౨౦ విమానం పక్కనే ఉన్న పొలాల్లో కూలి పోయింది. పోనీలెండి మల్ల ఇంకో కాంట్రాక్టు పిలవచ్చు..మల్లా దానిపైన మన నీటి ఏనుగు నాయకుడు ఇంతో అంతో ఎనకేసుకోవచ్చు...సర్వే జనా సుఖినో భవంతు..
No comments:
Post a Comment