ఒక రోజు ఉదయం.బాల్కనీ లో ఏదో శబ్దం అయినట్టుంటే వెళ్లి చూసాను. పావురం ఒకటి మా బాల్కనీ లో గూడు కడుతుంది.ఒక పుల్ల అక్కడ పెట్టి మళ్ళీ తుర్రున యెగిరి పోయింది.మల్ల కొంచెం సేపటికి ఎక్కడి నుంచో ఇంకో పుల్ల పట్టు కొచ్చింది.వాటినన్నిటిని, పద్దతి గా అమరుస్తుంది. మద్య మద్య లో నీకేం పని ఇక్కడ అన్నట్టు నన్నో చూపు చూస్తుంది.ఆఫీసు కి టైం కావటం తో దాన్ని అల్లా వదిలి బైటి కొచ్చాను. నాకు రొజూ బాల్కానీ లో కూర్చొని పేపర్ చదవటం అలవాటు కావటం వల్ల రొజూ ఆ పావురాల జంటని పరిశీలిస్తూ వచ్చాను.౨-౩ రోజుల తర్వాత గూడు చక్కగా అమరింది. ఆడ పావురం రెండు చిన్ని చిన్ని గుడ్లు పెట్టి,పొందిక గా వాటిపై కూర్చుంది.ఆహారం వ్యవహారం మగ పావురం పని ఏమో, అది ఇక్కడా అక్కడా తిరుగుతుందేమో.హత విధీ, పావురాల్లో కూడా ఇదే తంతా అనిపించింది. :)
రెండు పావురాలు ఎంతో అందం గా ఉన్నాయి కదా అనుకుంటూ ఎందుకో నేల వైపు చూసాను.రామ,రామ మా ఇంటి వోనరు ఆ దృశ్యం చూసి వుంటే, బాల్కనీ చువ్వలు వంచుకుని మూడో అంతస్తు నుంచి దూకేస్తాడేమో అనిపించింది. ఎంతో ముచ్చట పడి వేయించుకున్న తెల్లని టైల్సు మీద, పావురాలు బాత్రూం ఇత్యాదివి కట్టుకున్నట్టు లేదు తమ ఇంట్లో.పాపం కదా కొత్త జంట అని నేనే కొంచెం శ్రమదానం చేసి శుబ్రం చేసాను.
ఇలా రొజూ నడిచి పోతుంది. కొన్ని రోజుల తర్వాత, పావురాలు బాల్కనీ మొత్తం మాదే అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టాయి. ఏదో ఒక మూల పేపర్ చదువుకుంటున్న నన్ను మొదట్లో గుడ్లు ఎట్టు కేల్లెవాడిలా చూసేది ఆడ పావురం. వాటి భాష లో కొంచెం ఘాటు గానే తిడుతున్నట్టు అప్పుడప్పుడు అనుమానం కలిగేది.కొన్నాళ్ళ తర్వాత, బాల్కనీ డోర్ తియ్యం గాల్నే మగపావురం థిస్ ల్యాండ్ బెలొంగ్స్ టూ అస్ అన్నట్టు మీద మీద కోచ్చేది.మా స్నేహితుడోకాయన చల్ల గాలి కోసం తలుపు తీసాడో లేదో ఆయన మొహం మీద పికాసో బొమ్మ వేసినంత పని చేసింది. అదే చివరాఖరు సారి, మల్ల ఆ బాల్కనీ తలుపు తియ్యలేదు కొన్ని రోజులు. ల్యాండ్ వోనెర్ మీద ఆక్రమణ దారుని దురాక్రమణ లా పావురాలు మా బాల్కనీ ఆక్రమించేశాయి. నేనే అప్పుడప్పుడు, తలుపు కొంచెం తీసి దొంగ లా చూస్తూ ఉండేవాడిని.మగ పావురం బైటి కేల్లిందని నిర్దారించు కున్నాక, అప్పుడప్పుడు శుబ్రత పరిశుబ్రత కార్యక్రమం చేపట్టేవాడిని.
ఒక రోజు ఉదయం, జాగింగ్ కెళ్ళి వచ్చేటప్పటికి పావురాల కూతల్లో తేడ వినిపించింది. రెండు కన్నా ఎక్కువే ఉన్నాయి, పొద్దున్నే కిట్టి పార్టీ ఏమన్నా పెట్టాయ అనుకుంటూ,తలుపు సందు లోంచి తొంగి చూసాను.చిన్ని చిన్ని పావురాలు రెండు వాళ్ల అమ్మ దగ్గర ఏదో తింటూ అరుస్తున్నాయి. ఒకటి నల్లది ఒకటి కొంచెం తెల్లది. ఆడది మొగది అనాలేమో.యెంత ముద్దు గా ఉన్నాయో, ఒకసారి ఎత్తు కుందాం అని బైట పడ్డ అడుగు, తెలుగు సినిమా చివర్లో హీరో విలన్ ని చూసి నట్టు మగ పావురం చూస్తుండటం తో ఆగిపోయింది. ఇప్పుడు ఈ దిశ్కుం దిశ్కుం ఎందుకు లే అని మల్ల లోపలి కెల్లాను, తలుపు మెల్లగా మూసి.
చెప్పద్దూ, భలే ఆనందం వేసింది. బాల్కనీ ఆక్రమించినందుకు, మీదు మిక్కిలి కంపు చేసినందుకు, దాన్ని శుబ్రం చేసినందుకు తెగ తిట్టుకుంటూ ఉండే వాడిని. అదంతా బుజ్జి తెల్ల పావురాన్ని చూసే టప్పటికి హుష్ కాకి సారీ హుష్ పావురం అని యెగిరి పోయింది. ఇంకో ఆనందం ఏమిటి అంటే, ఎలాగు పిల్లలు పుట్టాయి కదా, బాల్కనీ ఖాళి చేస్తాయి లే అని.కొన్ని రోజులు ఓపిక పడదాం చిన్న పిల్లలు ఎలా వెళ్తాయి అని నన్ను నేను సమర్దిన్చుకున్నాను. సరే, కొన్నాళ్ళు ఇలానే గడుపుదాం అని. కాని, రాను రాను పరిస్తితి అద్వాన్నం అయింది.పెద్ద చిన్న పని కట్టుకుని బాల్కనీ అంతా ఆక్రమించి ఇంకెందుకు లెండి...కడుపు చించు కుంటే ఫాంట్ మీద పడుతుంది.
మా బుజ్జి పావురాలు పెద్దవి అయ్యాయి.కొంచెం కొంచెం ఎగరటం ప్రాక్టిస్ చేస్తున్నాయి.ఆహా,కొంచెం ఎగరటం, మల్లా బాల్కనీ లోకి రావటం.తల్లి కావాలని దాన్ని నెట్టేస్తుంది.చిన్న పిల్లలేమో భయం భయం గా రెక్కలు ఆడించి మల్లా వెనక్కోచ్చేస్తున్నాయి. నా అభిమాన తెల్ల పావురం, మాంచి దూరం ఎగురుతుంది. శభాష్ అనుకున్నాను.అలా యెగిరి యెగిరి ఎల్లి పోండి, పిల్లల్లారా.మళ్ళా రాకండి అని అత్మాశరతుడు లోపలెక్కడో అరుస్తున్నాడు.తదాస్తు.
ప్రాజెక్ట్ పని మీద ౩ వారాలు బెంగుళూరు వెళ్ళటంతో, మా పావురాలేమైనవో తెలుసుకోలేక పోయాను.తిరిగి వచ్చి తలుపుతీస్తుంటే అనిపించింది. ఆహా, ఈ పాటికి బాల్కనీ ఖాలీ అయిపోయి ఉంటుంది కదా.మల్లా ఒక .౫ గంట మనది కాదు అనుకుంటే, హ్యాపీ గా బాల్కనీ లో కాలు మీద కాలేసుకుని, నోట్లో వేలేసుకుని, మాంచి కాఫీ తాగుతూ, పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాను.అదే మూడ్ లో బాల్కనీ తలుపు తీసాను.బాబోయ్, పెద్ద పావురం ఒకటి నా ముహం మీద మాంచి బొమ్మ గీస్తాను అని బయలుదేరింది. మనకి మాంచి ప్రాక్టిస్ కదా, కబుక్కున తపుపేసి,కాసేపు దాన్నే అనుకుని నిలబడ్డాను.రేప్ సీన్ లో హీరోయిన్ విలన్ ని బైటకి తోసి, తలుపు గట్టి గా పట్టుకున్నట్టు. ఇదెలా జరిగింది అని చిన్న విచారణ కమిటి వేసాను.దాంట్లో ప్రదాన investigator నుంచి బంట్రోతు దాక అన్ని నేనే అనుకోండి. కొండను తవ్వి, పండి కొక్కును పట్టి నట్టు, తేలింది ఏమయ్య అంటే,మా పావురాలు ఖాలీ చేసి వెళ్లి పోయాయి. సదరు ప్రస్తుత జంట సరి కొత్తది.అవి పోగానే, ఖాలీ నే కదా అని ఇవి ఆక్రమిన్చాయన్న మాట..అదీ సంగతి. నేను మల్లి చీపురు చాట పట్టుకుని రెడీ ఐపోయాను, తలుపు ఖాలీ లోంచి తొంగి చూడటానికి :(
హ హా హా. ఈ దురాక్రమణలని సాగనివ్వకండి. మా ఇంట్లోనూ సేం కధ ! పోనీలేకదా అని ఊరుకుంటే, అవి పెద్ద స్థావరమే ఏర్పరచేసుకున్నాయి. మొత్తానికి వాటి బాధ పళ్ళేక, బాల్కనీకి (ఇష్టం లేకపోయినా), గ్రిల్ పెట్టించి, దానికి పావురాల మెష్లు దొరుకుతాయి.. అవి పెట్టించాం. ఇప్పుడు బాల్కనీ మాదే ! పావురాళ్ళ వల్ల అపరిశుభ్రతే కాదు - వాటి డస్ట్ వల్ల ఎలర్జీ కూడా రావచ్చు. మీ ఓపిక కి జోహార్లు.
ReplyDelete