Tuesday, December 25, 2012

ఆడలేక మద్దెల ఓడు..అమెరికతలు-24

ఇంగ్లాండ్, పాకిస్తాన్ లతో అద్భుతమైన పరాజయాల తర్వాత, బి సి సి అయ్ ఈ క్రింది దేశాలతో క్రికెట్ ఆడటం నిషేదించింది. వారు విడుదల చేసిన ప్రకటన లో దీనికి కారణాలు ఈ విధం గా ఉన్నాయి.

1. పాకిస్తాన్ : శత్రు దేశం కాబట్టి...ఎల్లాగు శివసేన వద్దంది కాబట్టి.
2. ఇంగ్లాండ్ : 200 ఏళ్ళు మనలను బానిసలు చేసారు
3. శ్రీ లంక: తమిళ్ పార్టీ లు వద్దన్నాయి కాబట్టి 
4. ఆస్ట్రేలియా : మనవాళ్ళ పైన   జాత్యా హంకార దాడులకు ప్రతిగా 
5. న్యూ జీలాండ్: ఆస్ట్రేలియా పక్కనే ఉంది కాబట్టి 
6. సౌత్ ఆఫ్రికా: వాళ్ళ ప్రెసిడెంట్ పాకిస్తాన్ వెళ్ళినందుకు నిరసన గా 
7. వెస్ట్ ఇండీస్ : దూరం ఎక్కువ కాబట్టి 

ఇంకా ఈ క్రింది దేశాలతో ఆడటానికి నియమాలు వర్తిస్తాయి అని ప్రకటించారు.

1. జింబాబ్వే : మంచి వానా కాలం లో ఆడాలి. మద్యలో వాన పడి ఆట ఆగి పోయినప్పుడు ఇండియా నే గెలిచినట్టు ప్రకటించాలి.
2. బంగ్లా దేశ్ : మా క్రీడాకారులు యాడ్ కాంపెయిన్  లో లేనప్పుడే ఆడగలరు.
3. హాంగ్ కాంగ్ / రష్యా /అమెరిక/ జిబౌటి లాంటి అనామక దేశాలు : ఎప్పుడైనా ఆడ వచ్చు.కాని కొన్ని పరిమిత స్టేడియం లలో మాత్రమె.


( పాకిస్తాన్ పై మన వాళ్ళ భయంకరమైన  బాటింగ్ దెబ్బకి కడుపు మండి పై పైత్యం :))


Sunday, December 23, 2012

ఎచ్చటికో ఈ పయనం ....అమెరికతలు-23

తల్లి దాస్యము తెంచిన తెగువ కానగ  రాదు..
పర పాలక ఏలికల పీచమణచిన మహోగ్ర విప్లవ జ్వాల చూడగా లేదు...

వంగ ఉత్కళ మన్న భేదమిక్కడ లేదు..
భరతమంతా  చూడ చీడ పట్టిన జాడ...

ఇన్ని మాటలేల మరల చెప్పగనేల...
ఏ దిశను పరికించ మకిలమయ్యిన మనము..

మద్య రాత్రిన మగువ స్వేచ్చ నడిచిన దినము
స్వతంత్ర మేతేన్చునన్న  మహాత్ము మాట..

ఏ నేల  పడతి పూజించ బడునో దేవతలందు
నడయాడురన్న వేద ఘోష..

మానవత్వము మరచి మధ గోషలో
పెరుగు కీచకుల తెలియని తత్వమేమో  ఇది..

రాజదానము కాని చిన్ని గ్రామము కాని
ఎడనేడా  వలువలు లేని విలువలు..

ఎక్కడికీ పయనం..
ఎవరు దీనికి కారణం..

మతం నేర్పని కులం చూపని
పుస్తకాల్లో చదవని క్రౌర్యం ...
కలకాలం వేదించే దైన్యం...

యువతరం కదలాలి
నవతరం రగలాలి...

నిస్త్రానమై నిద్రించు  ప్రభుత కళ్ళు తెరవాలి...

జనం ఐతే ప్రభంజనం
మరో యుగం ఆవిష్కృతం

ఎక్కడ స్వేచ్చా స్వాతంత్రం
కాళ రాత్రుల కరాల నృత్యాలలో
కానరాక కరిగి పోదో...

ఎక్కడ మహిళ మాత్రు  స్తానంలో
మహోన్నతమై వెలుగొందుతుందో...

ఆ  ఊహా ప్రపంచం లోకి
నా దేశాన్ని మేలుకొలుపు  తండ్రీ..












Saturday, December 15, 2012

ఈత రాని వాడివని..అమెరికతలు 22

ధబేల్ ...

యీత కొలనులో నేను వెల్లకిల్లా పడ్డ శబ్దం. చలి కాలం మొదలైన తర్వాత ఇండియా లో ధరల్లాగా అవిశ్రాంతంగా పెరిగి పోతున్న నా శరీర బరువు  తగ్గించుకునే యత్నం  లో మొదలైన వ్యాయామం అనే ప్రహసనంలో ఇదో ఘట్టం.

ఎప్పుడు ఉండే ట్రేడ్ మిల్ లాంటి విసుగెత్తించే పరికరాలతో మొహం మొత్తి , ఈ సారి ఈత మొదలు పెడతాము అని నిశ్చయించుకున్నాం. ఇంతవరకు బానే ఉంది.ఎన్నికల వాగ్దానం వలెనె. కాని, ఇక్కడే మొదలైంది అసలు చిక్కంతా. మా ట్రూప్ లో ఐదుగురు సూపర్ హీరోలకు ఈత వచ్చింది అంతంత మాత్రమే. ఇంతకూ ముందే కెనడా లో నేనేదో ఒకటిన్నర ఏళ్ళు ఈత వెలగ బెట్టి వచ్చాను అని ఇప్పటిదాకా అందరికి ఈస్ట్ మాన్ కలర్లో కధలు చెప్పటము చేతను, అందరిలో కొంచెం నీళ్ళలో కాళ్ళు చేతులు ఆడించగలను అనే వెధవ  నమ్మకం వల్లను , నేనే మా ట్రూప్ మొత్తానికి ఈత నేర్పించే భాద్యత నెత్తి కెత్తుకొ వాల్సి వచ్చింది.

ఆరంభ సూరత్వము వల్ల అందరం పక్కనే ఉన్న స్పోర్ట్స్ షాప్ లో స్విమ్మింగ్ గేర్ కోనేసాము. అప్పటికే నెలకు ముప్పయి తొమ్మిది డాలర్లు జిం కి ధారపోసి, దాన్ని యాభై అయిదుతో హెచ్చించి, మనసులో నాకు నాలుగు అక్షింతలు వేసిన ఇండియా నుంచి మొన్ననే దిగుమతి ఐన మా కొత్త సహద్యోగి రమేష్  అబ్బే నాకొద్దులే అనేసాడు.

ఇకా ఆ శుభదినం రానే వచ్చింది. మొదటి రోజు కదా అని మా వాళ్లతో పూల్ మొత్తం ఇటు అటు పరిగేట్టిన్చేసాను.శరీరాలు నీళ్ళకు అలవాటు పడాలి కదా అని ఏదో సర్ది చెప్పి. నా అదృష్టం కొద్ది మా పూల్ పెద్ద లోతు లేదు. అయినా ఇప్పటికే ఈత కొట్టి నాలుగేళ్ళు అయిందేమో శరీరం అందుకు సహకరించలేదు. మా వాళ్ళు కొంచెం అనుమానంగా చూడటం మొదలెట్టడంతో ఇక తప్పలేదు. కొంచెం దూరం వెళ్ళానో లేదో, 1500 మీటర్లు ఫ్రీ స్టైల్ కొట్టినట్టు షేక్ అవటం మొదలెట్టింది.

దాంతో మధ్యలోనే ఆపేసి ' అల్లాగన్న  మాట' అని వెనక్కి తిరిగి ఒక నవ్వు పారేసాను. మా వాళ్ళ మొహాలు చూస్తుంటే, ఏ నోవా ఆర్క్ నో, మరో యూత్ ఫౌంటెన్ నో చూసినట్టే ఉన్నారు. దాంతో నేను చెలరేగి పోయి ఫ్లోట్ ఎలా అవ్వాలో, ఆధారంతో కాళ్ళు ఎలా ఆడించాలో ఇత్యాది వన్నీ  చెప్పేసి ఆ రోజు మమ అనిపించేసాను మొత్తానికి.

రెండో రోజు కోసం ఆరోజు రాత్రి ఆఫీసు లో చేసేనట్టే, మళ్ళా గూగుల్ మామను బతిమాలి, రక రకాల స్విమ్మింగ్ వీడియోలు చూసేసి, కొంచెం మనోధైర్యం తెచ్చుకున్నాను.

రెండో రోజు. మళ్ళా అదే తంతు. ముప్పాతిక వంతు ఎలాగో లాగించి నాక, శరీరం సహకరించడం మాని పారేసింది. అప్పటికే ప్రిపేర్ అవటం వల్ల , రమేష్ ని అవతల వైపు నిలబెట్టాను. మునిగి పోతున్న శరీరాన్ని కాళ్ళతో తన్ని లేపి, ఇంతే చాల సింపులు అనేసాను. మా వాడు అనుమానాస్పదం గా చూస్తూ, ఆ కాస్త కొట్టేయ్యక  పోయ్యారా..అనేసాడు. అబ్బే..నీకు చూపిద్దామని.

అబ్యాసం కూసు విద్య అన్నట్టు రోజు రోజు కి నేను బాగానే ఈత ప్రాక్టీసు చెయ్యటం మొదలెట్టాను. ఇప్పుడు అప్రయత్నం గానే 2-3 సార్లు కోలనుకు ఇటు అటు ఈదేయ్యటం అలవాటయ్యింది. మా వాళ్ళలో నాపై నమ్మకం పెరిగి పోయింది. అంతా బానే ఉంటె, నేను ఇక్కడే బ్లాగు ఆపేద్దును  కదా. నిన్ననే తగలడ్డ ఒక ముసలాయన నా కొంప కంభం చెరువు చేసి పారేసాడు.

పూల్ చివర్లో వెనక్కి తిరిగి నిలబడి అమాంతం వెల్లకిల్లా దూకేసాడు. అదేమీ ఆనందం నాయనా అని చూస్తె, పూల్ సగం లో నీల్లనుండి  బయట పడి , అలాగే వెల్లకిల్లా ఈదుతూ చివరి దాకా లాగించేసాడు.వారమంతా మమ్మల్ని చూసి ఆవేశపడి, వెయ్యి రూపాయలకు ( మా వాడు 24 $ ని అల్లాగే లేక్కేస్తాడు) స్విమ్మింగ్ గాగుల్స్, కేప్ కొనేసిన రమేష్, కళ్ళు ఆర్పడం మానేసి అది మొత్తం చూసేసాడు. చూసేసి ఊర్కున్నాడా..అబ్బే,,,బాబాయ్ నాకు అదేదో నేర్పించ  కూడదు..భల్లే ఉంది...నేను మొదట అనుకున్నా..అదెంత  సేపు...

ధమాల్...వెనక్కు  తిరిగి పూల్ గోడను కొంచెం పుష్ చేసి కొంచెం దూరం వెళ్ళాక....మొత్తం నీళ్ళలో...టైటానిక్ లా నేను..











Friday, December 14, 2012

పిచ్చోడి చేతిలో తుపాకి-అమెరికతలు-21

ఊహించలేని భయానక ఘటన.

సి యెన్ యెన్ లో ఒక వ్యాఖ్యాత మాటలు. కనెక్టికట్ లోని ఒక చిన్న పట్టణంలోని  ఒక ప్రైమరీ స్కూల్ లో 20 మంది చిన్నారులు చనిపోయిన సంఘటన గురుంచి విన్న  మనసున్న మనిషైన ఎవరైనా ఒక కన్నీటి చుక్క రాల్చక మానరు.కాని ఇది ఎలా జరిగింది. 

ఒక స్కూల్ లో ఎవరో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగ బడటం.కాని ఒక స్కూల్ లో ఇలాంటి ఘటనలను ఎదుర్కోవటానికి ఎటువంటి సదుపాయాలూ ఉండవు. ఇలాంటివి జరుగుతాయని కూడా ఊహించడం కష్టమే. లోకమేరుగని పసిపాపలను బుల్లెట్లతో కడతేర్చే కరకు గుండెలు ఉంటాయని అనుకోవడానికే కష్టంగా ఉంది.
కాని ఈ దేశం మరెన్నో ఘటనలనకు తయ్యారవటం  మంచిది.

పాకిస్తాన్ లాంటి దేశాలలో తుపాకీలు బాంబులు మార్కెట్ లో పెట్టి అమ్మేస్తారని, గుండెలు బాదుకునే ముందు,
అమెరికా లాంటి దేశంలో మారాజుగా తుపాకీ లైసెన్స్ తీసకోవచ్చు అని మీకు తెలుసా. ఇక ఈ శుభకార్యానికి ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క పద్దతి.కాని ప్రజలని ఏమాత్రం ఇబ్బంది పెట్టని ఈ దేశం లో ఏ రాష్ట్రం లో నైన ఇదొక సులభమైన పని.ఇక కనేక్టికట్ డెబ్బయి డాలర్లు తగలేడితే మీకొక టెంపరరీ లైసెన్స్ ఇస్తారు. దాన్ని మరొక ఆఫీసు లో చూపిస్తే అసలు లైసెన్స్ ఇస్తారు. 

ఇక ఈ రోజు జరిగిన ఘటన లో హంతకుడు వాడిన మూడు తుపాకీలు వాళ్ళ అమ్మవి. అంటే, ఒక సారి లైసెన్స్ పొందిన తర్వాత వాటి భద్రతా ఆకాశ దీపమే అన్నమాట.ఇంట్లో అది ఒక మొబైల్ లానో  లేక మరో టీవి లాగానో ఒక మామూలు వస్తువులా భావించే వాళ్ళు ఉండటం అరుదేమి కాదు. మరి ఇంటికి రెండు మూడు తుపాకీలు ఉంటె, ఇలాంటి ఘటనలు జరగటం పెద్ద ఆశ్చర్య కరమే కాదు.అది నేడు ఒక మానసిక రోగి చేతిలో జరిగి ఉండొచ్చు.కాని రేపు ఇది ఒక టెర్రరిస్ట్ చేతిలో జరగోచ్చు. జీవితం పై విసిగిన ఏ ఉన్మాది చేతిలోనో జరగచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, విచ్చల విడిగా దొరికే ఆయుధాలు, ఏ బలహీన క్షణంలోనైన ఎటువంటి పని కైనా ఇలాంటి వాళ్ళని పురికోల్పచ్చు.

ఆయుధ లైసెన్స్ ఇలా విచ్చల విడిగా దొరకడాన్ని నిరోధించాలి.ఇలాంటి వాటికోచ్చే అభ్యర్ధనలను ఒకటికి పది సార్లు పరిశీలించి మరీ అత్యవసరమైతెనె కేటాయించాలి. ఇప్పుడు ఉన్న లైసెన్సులు పునః పరిశీలించడము అవసరమే.
కాని వ్యక్తీ స్వేచ్చ పదిధులు దాటి పరిఢ విల్లుతున్న ఈ దేశంలో అలాంటి చర్చ ఊసే లేదు.చనిపోయిన వాళ్ళకోసం కాండిల్లు  పట్టుకుని తిరిగే బదులు  ఇది ఎలా ఎందుకు జరిగిందో, నివారణ ఏమిటో ఆలోచిస్తే, కొన్నైనా  పసి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు.



Thursday, December 13, 2012

No kidding :)


Rajnikanth can strangle you with a cordless phone

Rajnikanth's calendar goes straight from March 31st to April 2nd, no one fools Rajnikanth.

Rajnikanth has already been to Mars, that's why there are no signs of life there.

Micheal Jordan to Rajnikanth: I can spin a ball on my finger for over two hours. Can you? Rajni: Rascala, how do you think the earth spins?

Rajnikanth once consumed an entire bottle of sleeping pills. They made him blink once.

Rajnikanth never wet his bed as a child. The bed wet itself in fear.

How did Paul Octopus die? He was asked to predict Rajnikanth's death.

Rajnikanth had to make 24 runs in just 1 ball remaining. He hit the ball in such a way that it got broken into 4 pieces and he got 4 sixes.

Water boils faster when Rajnikanth stares at it.

Words like awesomeness, brilliance, legendary, hero etc. were added to the dictionary in the year 1950. That was the year Rajnikanth was born

Rajnikanth can give pain to painkillers and headache to Anacin.

Rajnikanth sneezed only once in his entire life, that's when the tsunami occurred in the Indian Ocean.

The box office collection of the movie Ra 1 was less than parking collection of Robot.

Rajnikanth got 150 questions in exam paper asking – 'Solve any 100 questions'. He solved all 150 and wrote, "Rascala! Check any 100!"

Rajnikanth once wrote his autobiography. Today, that book is known as 'Guinness Book of World Records' and his childhood homework is now called 'Wikipedia'.


Friday, October 26, 2012

క్షమించు తల్లీ...


అమ్మ పొత్తిళ్ళలో వూయాలలూగిన చిన్నారి.
నాన్న కంటి దీపం.
ఇంటికి ఆశా జ్యోతి.

బోసి నవ్వుల బుజ్జాయి.
నీ చిన్నారి చిట్టి ప్రపంచంలో 
అందరూ నీవారే.

పాల బుగ్గల పసిపాపా..
మమ్మల్ని క్షమిస్తావా...

నువ్వనుకున్న లోకం కాదమ్మా ఇది.
ఎత్తుకు లాలించిన వాడే నీ గొంతు నులుముతుంటే 
యెంత బాధ పడ్డావో..

నమ్మిన వాడే నీ ఊపిరి తీస్తుంటే 
నీకు నచ్చని లోకాన్ని వదిలి వెళ్లి పోయావా..
ఎందుకిలా  చేస్తావ్ అని అడిగేందుకు నీకు 
మాటలు కూడా రావు కదా...

పచ్చ నోట్లతో కళ్ళు మూసుకుని 
డబ్బే శ్వాసించే పిశాచాల మద్య 
నువ్వెలా ఉంటావులే..

నీ బోసి నవ్వుల బాల్యం 
కరకు  రక్కసి చేతులతో 
చిదిమేస్తుంటే 
వందేళ్ళ జీవితం పది నెలలకే ముగిసి పొతే...
యేమని రాయను..యేమని నన్ను నేను సమాధాన పరచుకోగలను ..

డబ్బు జబ్బు పట్టిన లోకంలో 
ఇమడలేక మరో ప్రపంచపు మహోన్నత దారుల 
పట్టవా తల్లీ..

( చిన్నారి సాన్వి స్మృతికి అశ్రు నివాళి )




Friday, September 14, 2012

నిన్న..నేడు…


నిన్న పొద్దున్నే లేవగానే, మళ్ళీ తెల్లారిందా అన్న భావం వచ్చేది.మల్లా అదే దరిద్రగొట్టు ఆఫీసు, అవే తొక్కలో పనులు……ఏదో రెడీ అయ్యాం అనిపించి రోడ్డు మీద పడితే, ఆఫీసు టైం లో
ట్రాఫిక్ సంగతి చెప్పేదేముంది…హాయి గా కార్లో పోదాం అంటే,పెట్రోల్ ధర ఆకసాన్నంటుతుంది. ఆ పెద్దాయన్ని గడ్డం లాగి, వీపు మీద నాలుగు గుభి,గుభి మని కుమ్మాలని పిస్తుంది. సరే,ఏ షేర్ ఆటో లోనో కూలబడితే, మన అదృష్టానికి తోడూ,ఎవరో మగానుభావుడు(మా తమిళ కొలీగు ఇలాగే అంటాడు)  అదే టైం కి ఎక్కడికో బయలుదేరతాడు. వాడి కోసం, మన అటు ౪ కి.మీ. ఇటు నాలుగు కీ.మీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఆఫీసు కెళ్ళే వాళ్ళ బాధలు పట్టవా…అయినా,కాస్త ఆఫీసు టైం తర్వాత బయలు దేరచ్చు కదా. ఆ కార్లోంచి బైటకి లాగి బుర్ర రామ కీర్తన పాడిస్తేనా…నా సామి రంగా..ఆయన వల్ల  ౧/౨ గంట లేటు….ఆఫీసు భవనం చూడగానే మల్లా వచ్చేసామా, ఏదైనా సునామి వచ్చి ఇదెందుకు కొట్టక పోదురా భగవంతుడా,  ఎదుట మా మానేజరు, గుడ్ మార్నింగ్ చెప్తే, ఒక సగం నవ్వు నవ్వారు. లేటుగా వచ్చావు అని చెప్పడమేమో…ఆ నవ్వు భావమేమి మల్లిఖార్జునా….

ఇక పని, నా డెస్క్ కొన్నేళ్లుగా ఎవరు క్లీన్ చెయ్యలేదేమో, ఇలాంటి చోట పని చేస్తే ఎలర్జీలు ఖాయం..ఇక సిస్టం ఆన్ చెయ్యగానే, పని పని పని…ఎప్పటికి తరగని పని..ఆన్ సైటు  వాడికి మనం పంపినదేమి నచ్చదు..ఇలా కాకపొతే అలా అలా కాకపొతే ఇంకో లా అని, వీడి దుంపతెగ.. రోజుకో తొక్కలో కొత్త పని, రోజుకో ఫార్మాటు….మల్లి చేసి, తిప్పి తిప్పి చేసి, అదే చేసి..అసంతృప్తి ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడేమో…ఇక మన వాళ్ళ సంగతి…మహా సీనియర్ ఒకాయన..ఉలకడు..పలకడు..బంగారం షాప్ పక్కన మురుగు కాలవలో బగారం రజను వెతికే వాడిలా, ౨౪ గంటలు ఆ మోనిటర్ లో మొహం పట్టుకుని ఉంటాడు..ఏదన్నా సందేహం వచ్చి అడిగితె, ఇది కూడా తెలియదా అన్నట్టు చూసి, నేను బిజీ రేపు డిస్కస్ చేద్దాం అంటాడు…ఆ రేపు ఎన్ని సినిమాల్లో రేపులైపోయినా రాదు..ఇంకా మన కింద వాళ్ళ సంగతి…వాడు సీట్ లో కన్నా, కాంటీన్ లో ఉప్పర మీటింగుల్లో ఎక్కువ పని చేస్తాడు…ఇలాంటి వాడి చేత పని  చేఇంచ దానికి బిన్ లాడెన్ రావాలేమో… ఈ కంపెనీ ని దేవుడే కాపాడాలి…ఇక మా మీటింగులు…వాళ్ళు అడిగే ప్రశ్నలకి, ఈ జీతానికి ఇంతే పని అని గట్టి గా అరవాలనిపిస్తుంది..

ఇంకా నేడు..కొంచెం రెఫ్రెషింగ్ గా అనిపించింది..పొద్దున్న లేవగానే…ఏదో తెలియని ఉత్సాహం…గభాలున రెడీ అయ్యి, బయలు  దేరాను ఒక అరగంట ముందే…అదే కలిసొచ్చింది..కరెక్ట్ గా టైం కి ఆఫీసు చేరాను..నిన్న వాన పడ్డదేమో…దానిదెబ్బకి, బాగా క్లీన్ అయి పోయి, ఇప్పటి ఎండ కాంతి లో మిల మిలా మెరిసిపోతుంది..మా ఆఫీసు భవనం…ఎవడు కట్టాడో కాని మంచి అభిరుచి…..

మా మానేజరు..నేను గుడ్ మార్నింగ్ చెప్పినా తల పైకేత్తలేదు…బిజీ గా ఉన్నాడేమో..ఆన్ సైట్ వాడు,కొత్త చెత్త పని పంపాడు…పాపం దేశం కాని దేశం లో ఆ తెల్లోళ్ళ మద్య యెంత కష్టపడుతున్నాడో బిడ్డ…నా జేబులో కర్చీఫ్ తీసి మోనిటర్ ని సుబ్రం గా తుడిచాను. నా స్క్రీన్ మద్య లో ఎప్పుడూ కాన పడే పెద్ద చుక్క..మోనిటర్ ప్రాబ్లం వల్ల కాదని అప్పుడే తెలిసింది..నా పక్కన సీనియర్ ఏదో అడిగితె మళ్ళా రేపన్నాడు..ఆ రేపు కోసం ఎదురు చూడాల్సిందే..పాపం చాల కిందా మీద పడుతుంటాడు..ఆయనకీ, టైం ఉండాలి కదా..ఇక మా కింద వాడి ని కాంటీన్ లోనే పట్టుకుని, ఏమి చెయ్యల్లో బాగా డిస్కస్ చేశా…ఆ చిప్స్ కరకర లో ఏమి విన్నాడో..ఏమో…అయినా కొత్త వాడు కదా..కొంచెం టైం పడుతుంది…వీడు జనజీవన స్రవంతి లో కలవడానికి…

వీడి సిగ తరగా…వీడికేం పొయ్యేకాలం వచ్చింది..ఇందాకటి దాక బానే ఉన్నాడు గా అందర్నీ తిట్టు కుంటూ…అనుకుంటున్నారా…

ఈ రోజే మాకు ఇంక్రిమెంట్ వచ్చింది లెండి…



ఇట్లు మీ శ్రేయోభిలాషి, రోశయ్య నగర్.


అదేనండి మా ఒంగోలు.రేపో మాపో మన ప్రియతమ ము.మ మీద పైవాల్లకు దయ కలిగితే, ప్రకాశం రోశయ్య జిల్లా అయి పోవచ్చు.ఒంగోలు ఏ రోశయ్య నగరో, రోసి వాడో అయి పోవచ్చు.ఏమీ, కడప వై.ఎస్.ఆర్ జిల్లా అయి నప్పుడు ఇదెందుకుకాదు.భేషుగ్గా అవ్వచ్చు.అయినా , ఈ లెక్కన కొన్నాళ్ళకు విశాఖ తిక్కరామ జిల్లా అవ్వచ్చు,విజయనగరం బొత్స జిల్లా అవ్వచ్చు.వీల్లెమన్న చిన్న చితక నాయకులా సమస్యే లేదు.ఐన ఇప్పుడు చిరంజీవి కూడా మనోడే కదా, కృష్ణ జిల్లా చిరు జిల్లా చేస్తే పోలా.
ఎన్నో శతాబ్దాలు గా ఏర్పడ్డ జిల్లాల పేర్లు, ఆ ప్రాంత చరిత్ర ను ప్రతిబింబిస్తాయి.వంగవోలు ఒంగోలు అయినట్టే, దేవుని గడప కడప అన్నటు. కోల్కత్త పేరు మార్చినా, ముంబై పేరు మార్చినా నాకు నచ్చలేదు.ఎందుకంటె, రకరకాల కారణాలవల్ల ప్రాంతాల పేర్లు మార్పుకు లోను కావటం సహజం.కనట కెనడా అయినట్టు.మరి దానిని మల్ల కనట అనటం కొంచెం ఇబ్బందికరము, అనవసరము కూడా. మరి ఆ విషయమే అలావుంటే, మనం ఇంకొంచెం ముందడుగేసాము. పురాతన ప్రాంతాల పేర్లు మార్చి, మనోల్ల పేర్లు పెట్టుకుంటూ పొతే కొన్నాలకు ఒక విజయవాడ మిగలదు ఒక అమరావతి  మిగలదు.
మాయావతి బొమ్మలు పెట్టుకుందని నసిగే ముందు మనమేమి చేస్తున్నామో పునరావలోకనం చేసుకుంటే మంచిది.ఈ పేరు మార్పు వల్ల, ఎవరికి లాభం.ఒక్క కొత్త ఉద్యోగమైన పుడుతుందా.ఏమైనా వీసమెత్తు అభివృద్ధి జరిగిందా.బొమ్మలు పెట్టి పేర్లు మార్చి మనం సాదించే దేమిటో. రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ సమస్యలు సృష్టించడం తప్ప.మన చరిత్ర మనమే మరిచి పోవడం తప్ప.అయినా ఈ నాటి నాయకులు ఇంకొక ఎన్నికల తర్వాత జనాలకు గుర్తుంటార అనేది వంద కోట్ల ప్రశ్న.అలాంటప్పుడు వందల ఏళ్ళ నుంచి వస్తున్న పేర్లని మార్చడం అవసరమా?? ఈ నాటి నాయకులలో  ఏ ఒక్కరికి అంత విషయం లేదు అనేది నిర్వివాదాంశం.
నా భయం ఏమి టంటే, మన పురాతన పార్టీ లో ముసలోల్లకేమి కొదవ లేదు.రేపో ఎల్లుండో ఎవరైనా బాల్చి తన్నేస్తే, ఈ సారి ఏ జిల్లాకు మూడుతుందో

కరునామయులు…


మొన్నామధ్య మన కసాబ్ తీర్పు మీద అదేదో ఛానల్ లో చర్చా కార్యక్రమం. ఒకామె తెగగింజుకోవడం చూసాను.ఉరిశిక్ష వేస్తె, ఆయనకీ తను చేసిన తప్పు తెలియదట…శిక్ష పరివర్తన తేవాలి అని భాధ పడి పోయింది. ఇలాంటి వాళ్ళకు మన దేశం లో తక్కువేమీ లేదు. ఈవిడ ఇంట్లో వాళ్ళో బంధువులో ఆ దాడి లో పోయుంటే ఆమె ఇలా మాట్లాడేద?? సి.ఎస్.టీ లో జరిగిన మారణ హోమం, ప్లాట్ ఫోరం పైన అటు ఇటు చెల్లాచెదరైన మృతదేహాలు, ఎటు చుసిన రక్తం, తామెందుకు చనిపోతున్నమో తెలీక, ఏమి జరుగుతుందో తెలీక ప్రాణాలు విడిచిన ప్రజలు…పిల్లలు, మహిళలు, వ్రుద్దులని తేడాలేక జరిగిన దారుణం…మత పిచ్చి తో మదమెక్కిన మూకల నర మేధం…మీరు దేశభక్తి తో ఆలోచించక పోయినా మానవత్వకోణం లో నైన హృదయ విదారకం.
నారిమన్ హౌస్ లో అమాయకుల ఊచకోత, తాజ్ ముట్టడి ఇవన్ని ఎలా మర్చి పోతారు. సలస్కర్, ఆమ్టే, ఉన్నికృష్ణన్  లాంటి వీరుల బలిదానం, మనమెలా మర్చి పోగలం. మరి వీటన్ని టికి కారణం అయిన వాళ్ళను వదిలెయ్యాలా…
నారిమన్ హౌస్, తాజ్, మరి ఇతర చోట్ల జరిగిన సంఘటనలు ఈ దేశం ఉగ్రవాదులకు యెంత సాఫ్ట్ కార్నెర్ గా మారిందో చెప్పకనే చెప్తున్నాయి. మరి దొరికిన వాడిని కూడా క్షమాభిక్ష లేక పరివ్వర్తన అని వదిలేస్తే, రేపు ఈ ఇలాంటి సంఘటనలు రొజూ జరగోచ్చు. ఇంత జరిగిన మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ కసాబ్ గారికి ఎన్నో బంపర్ ఆఫేర్లు ఇస్తోంది…ఆయన మల్ల supreme కోర్ట్ కి వెళ్ళచ్చు. అక్కడా అదే తీర్పు వస్తే రాష్ట్రపతి క్షమా భిక్ష అడగడానికి ఇలాంటి తిక్క జనానికి మన దేశం లో కొదువ లేదు.
౧౬౧ మంది మరణానికి కారణమైన ఒక కిరాతక ఉగ్రవాదిని ఉరి తియ్యాలి అని డిసైడ్ కావటానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఐన అది జరుగుతుందో లేదో తెలీదు.ఇలాంటి మానవతా వాదులు కరునామయులు ఉన్న దేశం లో యెంత మంది కసాబ్ లు లాడెన్ లు వచ్చిన మనం వాళ్ళను పరివర్తన చేసి పంపాలి కాని… అనే నసిగే జనాలను ముందు ఉరి తీయ్యాలి. ఇలాంటి  విషయం లో నైన మనం ఐక్యత చూపక పొతే రేపు ఈ సంఘటన మీ వీదిలో మీ ఇంట్లో జరగోచ్చు…అప్పుడు ఆలోచించ డానికి, ఆరోపించడానికి ఏమి మిగలదు…

పరమ గురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాదు రా..


రష్యా చరిత్ర లో ఒక సంఘటన. జార్ చక్రవర్తి పీటర్ ఖజానా నింపుకునేందుకు ఒక చిన్నచిట్కా వేస్తారు. ఎవరైతే కొన్ని అంగుళాల కన్నా ఎక్కువ గడ్డం పెంచుతారో వారు నెల వారి గా ప్రభుతవానికి పన్ను కట్టాలి. అప్పట్లో గడ్డం పెంచడం ఒక కులీనుల సరదా, అవసరమున్ను. యెంత గడ్డం ఉంటె అంత పెద్దమనిషి అన్నమాట. మరి చచ్చినట్టు అలాటి వాళ్ళంతా పన్ను కట్టేరు. ఆ డబ్బు వాళ్లతో  వీళ్ళతో యుద్దాలు చెయ్యడానికి మరి పీటర్స్ బుర్గ్ అనే గొప్ప నగరాన్ని కట్ట డానికి ఉపయోగపడింది.
ఈ మద్య నడుస్తున్న చరిత్రను చూస్తే ఎందుకో దీన్ని మన దేశానికి అన్వయిద్దాం అనిపించింది. ఈ రోజుల్లో మన దేశం లో గడ్డం పెంచితే బాబా జుట్టు పెంచితే స్వామీ. గీత, రామ అంటే పరమహంస. నేనే దేవుణ్ణి అంటే భగవాన్. దేవుడి పెళ్ళాం, అనుమానం ఎందుకు అమ్మ భగవాన్. ఇంకా నయం మరిది భగవాన్, కొడుకు భగవాన్ రాలేదెందుకో. వీళ్ళు పోయాక వాళ్ళేమో. ఈ లాజిక్ పనిచేస్తే ఇలా అవడం పెద్ద కష్టం కాదు. ఒక ౪ నెలలు క్షురకుడి దగ్గరకు వెళ్ళాక పొతే సరి…మీరే ఒక స్వామి. పైన పీటర్ లా ఆలోచించిన మన ఖజాన కి  ఎంతో కొంత డబ్బు రాక పోదు.
ఇంకో కధ. పూర్వం ఒక స్వామిజి వాళ్ళ శిష్యులతో  కలిసి అదేదో నది దాటుతున్నారట. అక్కడ ఒక అమ్మాయి నది దాటలేక అవస్త పడుతుంటే స్వామీజీ తన భుజాలపై ఎక్కుంచుకొని నది దాటిన్చారట. నది దాటాక వాళ్ళు నగరమంతా తిరిగి భిక్ష తీస్కుని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కాని శిష్యులు సర్వ సంఘ పరిత్యాగి ఐన గురుజి ఇలా చెయ్యడం ఏంటి అని ఆలోచిస్తున్నారట. అప్పుడాయన అబ్బాయిలు నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దిన్చేసాను. మీరు ఇంకా నెత్తి నెట్టుకున్నారెందుకు అని అడిగారట.
ఈ గురు వేవడో సత్తే కాలపు మనిషి లా మీకు అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఎందుకని పించదు. గురూజీ అంటే జనం ముందు గీత పారాయణం. రాత్రి కి ఏమిటో మీరీ పాటికి రకరకాల టీవీ చాన్నేల్లలో రక రకాలు గా చూసే ఉంటారు. ఆ nityananda కి నా స్నేహితులు చాల మంది మంచి ఫాన్స్. నన్ను కూడా విన మని రెండు మూడు సార్లు డీ వీ డీ లు గట్త్ర ఇచ్చారు. కాని, టైం కుదరకో టైం బాగుందో మరి నేను చూడలేదు. కాని nityananda చాల శక్తి వంతులు. ఆయన లీల వినోదం చూపించే తీరారు.
ఇక గడ్డం పెరిగిన భగవాన్. మత్తు మందులో మరో ప్రపంచం చూపించే కల్కి. ఆ మత్తు లో ప్రపంచం చూడటం ఏమి ఖర్మ, కొత్త  ప్రపంచం స్తాపించేయ్యోచ్చు. అనుమానమా, మన దాసాజిలను అడగండి. ఆత్మా పరమాత్మ సంగమం అంటే మంచిగా ౪ రౌండ్లు ప్రసాదం పుచ్చుకుంటే ఇట్లే అర్ధం అయిపోతుందట. అమ్మ భగవాన్ సంస్కృత ఘోష కూడా ఆంధ్ర దేశం అంతా విని తరించేసింది.
ఇవన్ని అనవసరం అండి, ఈ బాబా లు భగవాన్ లా వెంట పడి పోయే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. సర్వ సంఘ పరిత్యాగి కి డబ్బులెందుకు. ప్రపంచాన్నే మార్చే భగవాన్ లకు పైసా లెందుకు. దర్శనం కి ఒక రేటు. ఇంకో డానికి ఇంకో రేటు, ఆ డబ్బులన్నీ పెట్టి అయ్యవారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కొడుకు భగవాన్ ౬-౭ కంపెనీలు నడుపుతున్నారట. మన భక్తులు అది కూడా సమాజ ఉద్దరణ అంటారేమో.
నాకొక అనుమానం. మన nityananda రేపు మల్ల ఒక ప్రెస్ మీటింగ్ పెడతారేమో. ఆ అమ్మాయి కి కామి కాని వాడు మోక్ష గామి కాదు అని భోదిస్తుంటే మీడియా వక్రీకరించింది అని. ఇన్ని నమ్మిన గొర్రెలు అదీ నమ్మినా ఆశ్చర్యం లేదు….
కల్కి దర్శనం…nityanandam…nityanando ranjito rajnithaha ;)

అమెరికతలు-2..


౨-౩ రోజులుంచి అటు ఇటు తిరుగుతూ  సరిగ్గా నిద్రలేదేమో, బాగా నిద్ర పట్టేసింది. లెగిచి చూద్దును కదా ఏ దేశం మీదున్నామో తెలియక పోయినా  తెల్లారినట్టు తెలిసింది. వాచి చూసుకుంటే ఒక ౮ గంటలు నిద్రేసాం  అని అర్ధం అయ్యింది. బ్రేక్ ఫాస్టు అవి కానిచ్చి, పక్కనున్న బాబాయి గారితో లోకాభిరామాయణం మొదలెట్టాను. ఆయన అదే మొదటి సారి యు.ఎస్ పిల్లల దగ్గరకు వెళ్తున్నారని తెలిసింది.లావేట్రి దగ్గర కునికి పాట్లు పడుతున్న ఇద్దర్ని చూపించి, అదేంటబ్బాయి అందరు ఇక్కడే నిలబడక పొతే బైటకేల్లోచ్చు కదా…అన్నాడు.అప్పుడే ఏదో కొంచెం ఉన్న నిద్ర మత్తంతా దెబ్బకి యెగిరి పోయింది.
విమానం లో సందడి అంతా సీమ టపా కాయలదే. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, తల్లి దండ్రులను నానా హైరానా పెడుతున్నారు. మనోల్లలాగా ఒక దెబ్బేస్తే, గమ్ముగా ఉండే ఘటాలు కాకపోయె. అదీ కాక, అమెరికా లో ఉన్న చట్టాల ప్రకారం, వీళ్ళను రెండు దేబ్బలేస్తే, అదేదో నెంబర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ చేసెయ్యచ్చు.ఎందుకొచ్చిన గొడవ అని, ప్లీజ్ కన్నా, కం హియర్ అని ఒకా యన బ్రతిమాలుతుంటే, హే బడ్డి, ప్లీజ్  డూ దట్ అని ఇంకో కాయన బామాలుతున్నాడు. అయినా వాళ్ళు అంత సులభం గా వింటే, విమానం లో సందడి ఏముంది.
మొత్తానికి చికాగో చేరాము.ఇప్పుడే మొదలవుతున్న చలి కాలం. విమానాశ్రయం లోనికి ప్రవేశించే ద్వారం దగ్గర ఎలా వచ్చిందో చలి గాలి గిలిగింతలు పెట్టింది.అమెరికాకు స్వాగతం నేస్తం…ఇమ్మిగ్రేషన్ పనులు ముగించుకుని బైట పడే సరికి, నా లింకు విమానం కాస్తా తుర్రున పోయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటరు లో పిల్ల యు మిస్సేడ్ ఇట్ బై  టెన్ మినిట్స్ అని పళ్లన్నీ బైట పెట్టి చెప్పింది. నా ఫ్లైట్ మిస్ ఐతే ఈమె కెందు కింత ఆనందమో…లేక టీవీ లో వార్తలు చదివే వాళ్ళలాగా అలవాటయి పోయిందేమో.సరే తల్లి ఎప్పుడు ఫ్లైట్ మల్లి అని ఏడవలేక ఒక చచ్చు నవ్వు నవ్వి అడిగాను. ఇంకో ౨ గంటల్లో అని చెప్పింది.
ఇంకేం చేస్తాం, కే.ఎఫ్.సి లో ఏదో కొన్ని వేపుడు దుంపలు, మరి టొమాటో సాసు తలగేసు కొని కుర్చీ లో కూల బడ్డాను.ఇంత బతుకు బతికి అన్నట్టు, యెంత మొనగాడైనా, ఈ దేశం లో ఈ చెత్తంతా  తినాల్సిందే…ఎదవ జీవితం
పక్క సీట్ లో ఒక తెలుగు అమ్మాయి. వాళ్ళ స్నేహితులు.కార్తిక మాసం అంట…యేవో పళ్ళు,దుంపలు తెచ్చుకుంది.ఆహ ఏ దేశమేగిన, యందు కాలిడినా, తల పాగా తీసి గౌరవించాల్సిందే ఇలాంటి వాళ్ళని  ( హాట్స్ ఆఫ్ కు నా తెలుగీకరింత…పోయిన టపా లో మిత్రుల కోరిక మేరకు,సాద్యమైనంత వరకు తెలుగు లోనే రాద్దామని చిన్న ప్రయత్నం ;) )
డిట్రాయిట్ చేరే టప్పటికి ౫ అయింది. బ్రతుకు జీవుడు ..ఇక హోటల్ కెళ్ళి బజ్జుంటాను అని లోపల్నించి గోలేట్టేస్తున్నాడు. లగేజు చూద్దును కదా..ఒక బాగు మిస్సింగ్…ఎయిర్ లైన్స్ వాళ్ళను అడిగితె, ఇదేమన్న కొత్తా అన్నట్టు మొహం పెట్టి, వచ్చే ఫ్లైట్ లో రావచ్చు ఇంకో గంట పడుతుంది, లేకుంటే, ౨ రోజుల్లో మీ అడ్రస్సు కు పంపుతాము.అన్నది.ఏమి చేస్తాం, ఇంకో గంట వెయిటింగ్ అన్న మాట.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర ( యు.ఎస్.ఏ లో ఉన్న మన తెలుగోళ్ళ సంతతి ని చూసి కళ్ళు కుట్టి, మా తమిళ కొలీగు చేసిన కామెంట్) లో తెలుగోల్లకేం తక్కువ.మళ్ళా ఒక తెలుగాయన.డిట్రాయిట్ లో కన్సుల్టేన్సీ ఉందట.అక్కడే పరిచయం అయ్యాడు. కాసేపట్లోనే, ఇది వరకు జాబు మార్కెట్, ఇప్పుడు పరిస్తితి అదీ ఇదీ అని బాగా ఊదర కొట్టేసాడు.ఎంతలా అంటే ఇంకాసేపుంటే నేనే హెచ్౧ కి అప్లై చేసేటట్టు అబ్బే చాల ఈజీ అండీ…మా ఆఫీసు లో నిన్ననే ౪ హెచ్ ౧ లు చేసాము. అన్నాడు.నా వివరాలు కనుక్కున్నాడు.ఫోన్ నెంబర్ తీస్కున్నాడు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి కలుద్దాం బ్రదర్ అన్నాడు. అమాయకున్డను, నిజమే అనుకుంటిని, ఇంత వరకు మాట మంతీ లేదు. నా నెంబర్ తీస్కున్నంత తొందరగా మీ కార్డు ఇస్తారా అన్నా స్పందించలేదు. అబ్బే మీ నెంబర్ ఉంది గా..నేనే పిక్ చేస్కుంటాను…అని వాగ్దానం చేసాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు రావటం తో బాయ్ చెప్పి బయలు దేరాడు. అంటే, అయ్యవారికి మంచి టైం పాస్ గాడు దొరికాడన్నా మాట ( నాక్కా దండోయ్   ).
ఇంతలో నా బాగేజు రావటం తో ప్రాణం లేచొచ్చి నట్టయ్యి, వడి వడి గా బైట పడి,హోటల్ చేరాను.
అదండీ, ఈ సారి నా ప్రయాణం లో పదనిసలు, అపసవ్యం గా గార్ధభ రాగం లో సాగాయి…మళ్ళా ఇంకో టపా లో  కలుద్దాం…ప్రస్తుతానికి ఇటు అటు కాని టైం జోన్ లో నా నిద్రా ప్రపంచం లో తిరుగాడుతున్నా …డోంట్ డిస్టర్బ్…

అమెరికతలు-౧


౨౦ నవంబర్ ౨౦౧౦.
అమెరికా కు మరో ప్రయాణం.అమ్మ, నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ విమానాశ్రయం కి నాతొ పాటు వచ్చారు.వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే అమ్మ కళ్ళలో చెమ్మ.మొదటి సారి నాది అదే ఫీలింగ్.ఇంతకూ ముందెప్పుడూ ఈ ఫీలింగ్ లేదు.ప్రయాణాలు కొత్త కాకున్నా, ఈ సారెందుకో ఎప్పట్లాంటి ఉత్సాహం లేదు. ఉద్యోగ పరం గా, ఆర్దికం గా ఈ ప్రయాణం ఏంతో ముఖ్యమైంది కావచ్చు.కాని, వ్యక్తిగతం గా ఏదో కోల్పోతున్న ఫీలింగ్.అక్కడ సంపాదించేది, ఇక్కడ కోల్పోతున్న దాని కన్నా తక్కువేమో, ఇది నష్టం వచ్చే వ్యాపారమేమో…
చెక్-ఇన్ లో ఎక్కువ బరువున్న బాగేజీ నన్ను వెక్కిరించింది.డు ఐ నీడ్ టు పే ఎనీ తింగ్? అర్ధోక్తిలో అడిగాను. ౨ కిలోలకి ఏమి కదతారులే? జవాబు కూడా అర్దోక్తి లోనే ఇచ్చింది కౌంటర్ లో అమ్మాయి. మొత్తానికి  కొంచెం ఎక్కువ బరువున్న ఆవకాయ పచ్చడి పాస్ అయిపొయింది.ఇమ్మిగ్రెషున్ ముందు యౌజర్ చార్జి కౌంటర్. కట్టి మూడేళ్ళు దాటిన విమానాశ్రయం కి ఇప్పుడు ఈ తద్దినము ఏమిటో ఏలిన వారికే తెలియాలి. తెనాలి రామ లింగ సినిమాలో చాకలి రంగడు అన్నట్టు, ఏలినోల్లు చల్లగా చూస్తె ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, అదీ సంగతి.
కాని ఇక్కడో కొసమెరుపు.ఎయిర్  ఇండియా వాళ్ళు రాత్రి ౧౨:౩౦ కి అఘోరించిన మిస్సేడ్ కాల్ కి ఉత్సాహవంతుడనగు టచే నేను కాల్ బ్యాక్ చేసి ఈ విషయము కనుక్కున్నాను కాబట్టి, తగు పైకము సమర్పించ గలిగితిని.నా వుత్స్తాహవంతులు కాని జనం అక్కడ బిక్క మొహం వేసినారు.౮౫౦ రూప్యంములు తక్కువ రొక్కము కానీ చేతనను, సదరు విమానాశ్రయం వారు చిల్లర దుకాణము వాని వలె డెబిట్/క్రెడిట్ కార్డులు అంగీకరించని కారణమున, ఆ కౌంటరు నందు రాజకీయ సభకు జన సమీకరణ చేసి నట్టు జనం పోగయినారు.నేను కట్టను అని భీష్మించే వాళ్ళు కొందరైతే, బాబ్బాబు ఎంతో కొంత తీస్కోన్డురూ అని బతిమాలేవాళ్ళు కొందరు.గ్రంధి గారి మంత్రాంగం వాళ్ళనేమీ చేసారో మరి.
ఇమ్మిగ్రేషన్ లో ఇంకో చిత్రం. డ్యూటీ దిగిపోయ్యే హడావుడి లో ఉన్న మహాతల్లి, వర్క్ వీసా మీద కొట్టాల్సిన ముద్ర విసిటర్ వీసా మీద కొట్టింది. ఆమె విసిరేసిన తర్వాత పీ.ఎస్.ఎల్.వీ రాకెట్టు వలె నా పైకి దూసుకొస్తున్న పస్స్పోర్టు ను స్లిప్స్ లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్ పట్టినట్టు ఒడుపుగా పట్టి, ఆ తప్పు గమనించి కౌంటరు మూసి వడివడి గా వెళ్తున్న ఆమె వెంట బడి అడిగితె అదేమీ కాదు లే, అమెరికా వాళ్ళు చూసే వేస్తారు వాళ్ళకు చెప్పు అని అభయం ఇచ్చింది.
ఎంతైనా వాళ్ళమీద యెంత గురి.డిల్లి నుంచి బిల్లి లు తిరిగే గల్లిల దాక..హతోస్మి.
ఇక విమానాశ్రయం లో తినదగ్గ పదార్దాలున్న ఒకే ఒక పూటకూళ్ళ ఇంట్లో ఒక్కొక్కింటి ధర ౨-౩ డాలర్లు మన కరన్సీ లో మార్చి పెట్టినారు.బైట ౫ రుప్యంములకు దొరికే ఇడ్లి ఇక్కడ దాని సిగదరగ ౨౫ రూపాయలు అయి కూర్చున్నది. ప్రతి విషయం లో అమెరికా ను పోలో మని ఫాలో అయిపొయ్యే మన జనం ఇందులో ఎందుకు కారు. పెద్ద పెద్ద విమానాశ్రయంలలో కూడా కి.ఎఫ్.సి.,మేక దోనల్డు లాంటి వోటేలులు బైట రేట్ లే వసూలు చేస్తాయి. అబ్బే అలాంటి చెడ్డ అలవాట్లు మనకెందుకూ.
సరేలే ఏదొకటి అని సగటు భారతీయ ప్రయనీకుని లా ఆరోజు రాత్రి భోజన కార్యక్రమమును “మమ” అనిపించి,నా టెర్మినల్ దగ్గరకు వచ్చాను.నా పక్క సీట్ లో తెలుగు జంట.చికాగో వెళ్తున్నార్ష.గమ్మత్తేమిటంటే, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో ఉద్యోగి .మూడేళ్ళుగా ఉంటున్నారట.అతను డిపెండెంట్ వీసా.లేచింది మహిళాలోకం.నెత్తికి టవల్ కట్టుకుని అన్న గారు పిండి రుబ్బుతున్న దృశ్యం కాన్పించింది.
మనిషి మనిషి దీ ఒక చరిత్ర అన్నట్టు, ఇక్కడ ఒక్కక్కళ్ళ దీ ఒక్కో కధ.కొడుకులు,కూతుళ్ళ దగ్గరకెళ్ళే పెద్దోళ్ళు,మొగుళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే పెళ్ళాలు,విద్యార్దులు ఉద్యోగార్దులు ఒక్కరేమిటి రక రకాలు.
౯ కి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మామూలు గానే ౨ గంటలు ఆలీసమైనాది. జనం పిచ్చ పాటి మొదలెట్టినారు.విజయవాడ  రంగా రావు ౧౦ ఏళ్ళుగా వేర్మౌంట్ లో స్తిర పడ్డ దరిమిలా,వనస్తలిపురం నుంచి మొదటి సారి  అమెరికా వెళ్తున్న వెంకట్ రావు కు అక్కడి డ్రైవింగ్ లైసెన్సు దాని కధ కమామీషు ఊదర గొట్టేస్తున్నాడు.గుడివాడ గుర్నాధం వాళ్ళ అమ్మాయి ని చూసి రావటానికి బైలుదేరాడు.అక్కడ ఆడంగులు మందు సిగరెట్టు ఊదేస్తారషగా..అని నోరు నొక్కుకున్నాడు.బెజావాడ భోగారావు కిష్ణ భగవానుడిలా చిద్విలాసం చేస్తూ, అవన్నీ మామూలే గురూ గారు అంటున్నాడు.
ఈ చిత్రాలు చూసే టప్పటికి అదుగో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రానే వచ్చింది.రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేవయసున్న ఎయిర్ హోస్తేస్స్ “నమస్కారం” చెప్పి ఆహ్వానించింది.సరే నా సీట్ లో కూర్చున్నాను.విమానం బైలు దేరింది.నా హెడ్ ఫోనులో నుంచి శబ్దం రాక పొయ్యే టప్పటికి ఎయిర్ హోస్తేస్స్ ను పిలి చాను. సరిగ్గా  హోల్ లో పెట్టు అదే వస్తుంది. విసురు గా చెప్పి విసా విసా వెళ్లి పోయింది.ముసలావిడ కు చాదస్తం అంటే ఇదే నేమో.నా పక్క సీట్ లో పెద్దాయనకు ఫోను లేదు సీట్ లో ఉండాల్సిన సాకెట్టు లేదు. గొడవ లేని పని.
చూస్తుండ గానే ఢిల్లీ చేరాము.మళ్ళా సెక్యూరిటీ చెక్కు.బ్రతుకు జీవుడా అని రాత్రి ౨:౩౦ గంటలకు చికాగో వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.   మిగతా సంగతులన్ని ఇక్కడ పట్టవు కాని మల్ల చెప్తా..

Saturday, September 8, 2012

చదువులు చట్టు బండలు

బుడి బుడి అడుగుల నా బాల్యం 
నర్సరీ స్కూల్ మెట్ల మీద అంతరించింది.

తాతయ్యతో నా కబుర్లు 
వుయ్యాలతోట్టితో సరి 

నడిచానని నాకే సారీ శిక్ష 

నా కేరింతలు 
స్కూల్ నాలుగు గోడల మధ్యే ప్రతిధ్వనించాయి 

కీ ఇస్తే తిరిగే మర మనిషిని నేను 
సృజన నేనే  పుస్తకాల్లో చూడలేదు  

ఒకటి కి ఒకటి కలిపితే ఎంతో  తెలుసు 
ఎందుకు కలపాలో తెలీదు 

అమ్మకి ఐ ఐ టి ఇష్టం నాన్నకి మెడిసిన్ కాకుంటే కష్టం 
నువ్వేమవుతావు కన్నా అని నన్నెవ్వరు 
అడగలేదు..వినివూర్కొవటమే నాకు తెలుసు 
నేనెప్పుడు చెప్పలేదు

గిజిగాల్ల కూతలు వినని అమ్మజోల తెలియని 
వానవిల్లు రంగులు చూడని నవతరం మేము 
రేపు వచ్చే తరానికి మార్గ దర్శిలము  మేము 

పుస్తకాల బరువుతో విల్లులైన నడుములతో 
చదివీ చదివీ మసకబారిన మా చూపులతో 
దేశానికి దిశా నిర్దేశం చేస్తాం 

**** విద్యా సంస్తల ధన దాహానికి, తల్లి దండ్రుల దూరాశలకు, లాబీ డబ్బులతో కళ్ళు మూసుకున్న ప్రభుత్వ నిష్క్రియ పరత్వానికి బలి అవుతున్న నా దేశపు  బాల్యానికి నా జోహార్లు ****



Sunday, July 1, 2012

నా హైకూలు..అమెరికతలు-20

కన్నీళ్లు....
కలలు కనే నా కళ్ళకు అడ్డు పడే పరదాలు...
నిన్ను చూసి మురిసే భాగ్యమూ ఇవ్వని ఈ లోకపు పట్టింపులు..
జలతారు వెన్నెలలో కరిగే లెక్కలేని కాలాలలో
చిరకాలం నన్ను వెక్కిరించే కరకు విధాత లెక్కలు..

ఆకాశం...
చిన్నప్పుడు మా తగాదాలు తీర్చే వాడు మా తాతయ్య..
గోలీల కోసమో కానీల కోసమో చెలరేగిన చిరు తుఫానులు..
చేతులు వెనక్కు  కట్టుకొని వయస్సు ఇచ్చిన వాలిన నడుముతో..
మసక బారిన ఆ కళ్ళ జోళ్ళ వెనక 
చిలిపిగా  నవ్వే ఆ కళ్ళు ..
హేమంతమో..గ్రీష్మమో..శరత్తో...
మెరుపులో..ఉరుములో..వానలో..వరదలో..
ఋతువులు చేసే చిలిపి చేతలు చూసి
మెల్లగా నవ్వుకునే పెద్ద మనిషి..


నా నేస్తం...
కన్నీళ్ళలో కష్టాలలో
పూట గడవని పాత రోజుల్లో
వెన్నంటే నిలచిన నా నీడ..





Tuesday, May 22, 2012

కృష్ణా నీ బేగనే....అమెరికతలు-౨౦




మే 19. 

 ఎన్నో రోజులు గా ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నేను ఎప్పుడు ఏ కచ్చేరి  కి వెళ్ళింది లేదు. ఇండియా లో ఏదో ఒక పని అడ్డం పడటమో లేక  ఆ  సరిగమ  పదనిసలతో  ఎక్కడ  చావ కొట్టేస్తారో అన్న  భయమో  తెలీదు కాని, ఎప్పుడూ ధైర్యం  చెయ్యలేదు. 

దూరం  పెరిగితే  మనది  మనవాళ్ళు  అన్న మమకారం  పెరుగుతుందని  చెపితే  వినడం  తప్ప  అనుభవైక  వేద్యం  అవడం  ఇప్పుడిప్పుడే మొదలైంది.  కే జే ఏసుదాస్  కచ్చేరి ఆ  రోజు. మా కోలీగులు అందరు అప్పటికే ఏదో ఒక  సంగీత  కార్య క్రమానికి వెళ్ళడం ఆ  విశేషాలు చెప్పడం తో యెంతో  కొంత  ఆసక్తి కలిగింది. 

ఏడు గంటలకు ప్రారంభం అయిన  కార్య క్రమానికి అయిదుకే వెళ్లి కూర్చున్నాం. కొంచెం  సాంస్కృతిక  కార్య క్రమాలు సాగాక     ప్రారంభమైంది ఆ  సంగీత ఝరి .  ఎక్కడో కేరళ  మారుమూల  పుట్టిన  కట్టాసెరి జోసెఫ్  ఏసుదాస్  ఈ  మద్యనే యాభై ఏళ్ళ  సంగీత   ప్రయాణాన్ని  పూర్తీ చేసారు.  కర్నాటిక్  సంగీతం లో ఏమి లేక  సినిమా సంగీతం లో  ఏమి ఆయన   పేరు  తెలియని వాళ్ళు  దక్షిణ  భారతం  లో లేరంటే   అతిశయోక్తి  కాదు.

మెల్లగా  గణపతి  స్తోత్రం  తో  ప్రారంభించిన   గాన  మాధుర్యం  త్యాగరాజ  పంచ  రత్నాలలో  ఓల  లాడించారు. నాకు కర్ణాటిక  సంగీతం  లో ఏమాత్రం  ప్రవేశము  లేక  పోయినా  ఆకలి  గొన్న   చిన్నారిని   తల్లి  ఒడిలో  తీసుకొని   లాలించి   బుజ్జగించి   ఆకలి  తీర్చిన  భావం  కలిగింది.  పిల్లలకు   ఆకలి  తెలుస్తుంది కాని  తమకు  ఏమి తినాలో తెలియదు. ఆ  భ్రమలో   ఏడవటం  తప్ప. అది  అమ్మకే  తెలుస్తుంది, ఆయన  పాటలు  కూర్చిన  విధానము  కూడా  అట్లే ఉంది.


ఏడు నుంచి  తొమ్మిది  వరకు  రెండు గంటలు  ఎలా  భరించ  గలనా  అని   మొదట్లో   ఆలోచించిన   నేను  నిజంగానే  పాట  పాట  కు మద్య  టైం చూడటం  మొదలెట్టాను,  ఎప్పుడు  అయిపోతుందా అని కాదు  అప్పుడే  అయిపోతుందా అని.  ఆ  ప్రవాహం  లో  అమృత   తుల్యమైనా  ఆ  ఒరవడి  లో  ఎన్ని గంటలైనా  అలాగే  వినగలం అనిపించింది.

సంగీతం  గొప్పతనం  గురుంచి చెప్తూ  అది దేవుని  చేరటానికి  దగ్గర  దారి అని  మాటల  మద్యలో  ఏసుదాస్  అన్నారు. నాకు అది కొంచెం  ఎక్కువ  చేసి  చెప్పటం  అనుకున్న...కాని  అది నిజం అని తెలుసుకున్నా...

పది హేనవ  శతాబ్దానికి చెందిన   వ్యాస రాయరు  రాసిన  కృష్ణా నీ  బెగనే  బారో  అని కన్నడ  కృతి.  ఏసుదాస్  కంఠం లో  మృదు మధురం గా  పలికింది.  కృష్ణుని  వేగమే  రమ్మని  పిలుస్తున్న  ఈ  పాట  చాల  సరళము, వాడుక  భాషలో రాసింది.  కన్నడ  రాని  వారైనా కొంచెం  జాగ్రత్త  గా వింటే  సులభం  గానే  అర్ధం అవుతుంది.  కృష్ణుని  ఆయన   అలంకారాలను  పొగుడుతూ సాగే ఈ   పాట   చివరలో భావంలో  వేగం లో   శిఖరాగ్రాన్ని  చేరుతుంది. 

అక్కడక్కడా  అటు ఇటు తిరుగుతున్నా  జనాన్ని చూడకుండా,  కళ్ళు మూసుకొని  ఆ  పాట   వింటూ  ఒక  అవ్యక్త  అనుభూతిని  పొందాను.  నల్లనయ్యా  చేతులకు  కాళ్ళకు  అలంకారాలతో  వైజయంతి మాలతో  అలరారే కృష్ణా  వేగంగా రావయ్యా నీ ముఖార  విందాన్ని   చూడనివ్వు  అని సాగుతూ  ఉండే పాట .  చివరలో  జగదోద్ధారక  ఎవరో అనుకునేవు   ఓ   ఉడిపి  శ్రీకృష్ణ  స్వామీ  వేగంగా రావయ్య.. అంటాడు కవి.  ఉన్నట్టుండి  తలుక్కున  మెరిసింది  నా కళ్ళ  ముందు ఆ  లీలా  మానుష  విగ్రహం.  చేతిలో  పిల్లన   గ్రోవితో  ఒంటి నిండా  గంధపు  పూతలతో చేతి కడియాలతో  నల్లని  శ్రీ కృష్ణుని విగ్రహం.  ఉన్నట్టుండి ఉలిక్కి పడి   కళ్ళు తెరిచాను.  అప్పుడే  పాట    అయి పోయిందేమో  చప్పట్లతో  హాలు  దద్దరిల్లింది. 


నిజమే  సంగీతం  దేవుని చేరటానికి  దగ్గర  దారే. కాని  దారి చూపే మార్గదర్శిలు   ఇటు వంటి కళా కారులు. ఇలాంటి  వారి సమయం లో మనము  ఉండటం, వారిని  మన   మద్య   చూడటం,  మన  లాంటి వాళ్ళ  అదృష్టమే...

నేను   తాగిన   ఆ గానామృతం    మీకు పంచాలనే  చిన్ని ఆశ .



Saturday, April 21, 2012

బట్టలున్న మనిషికి...

వారాంతపు వాషింగ్ కార్యక్రమం లో  తలుక్కున మెరిసిన పాట...

బట్ట  గతి ఇంతే..
మనిషి బ్రతుకింతే...
బట్టలున్న మనిషికి ఉతుకుతప్పదంతే...

ఒక్కసరికే మురికి పోదు..
మరక పడితే అసలు పోదు..
ఒక్క రోజుకే మాసిపోదు..
చిరుగు పడితే అతుకు పడదు..

బట్ట  గతి ఇంతే...

అంతా మట్టేనని తెలుసు..
అదీ ఒక చిక్కేనని తెలుసు  ..
తెలిసీ మాపీ  ఉతికిన్ చుటలో..
వెదవతనం ఎవరికి తెలుసు..

బట్ట  గతి ఇంతే...

మరు జన్మ ఉన్నదో లేదో
ఈ మరకలప్పు డే మవుతాయో..
బట్టకు మరకే తీరని శిక్ష...
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా..







Saturday, April 14, 2012

మా వూళ్ళో ఎన్నికలోచ్...అమెరికతలు-౧౭

కారణాలేమైతేనేం..మా వూళ్ళో మల్లా ఎన్నికలోచ్చాయ్. ఎన్నికలంటే ఒక జాతర. ఒక ధన మార్పిడి ఆర్ధిక విదానం. మన పెజాస్వామ్యం లోపలెన్ని పురుగులున్నా పైకి అందంగా కనిపించే మేడి పండు.ఇక్కడ పెజలే దేవుళ్ళు. కాని ప్రసాదం మాత్రం పూజారులదే.

ఇక మా వూరి విషయాని కొస్తే, ఆంధ్రా లో అన్ని చిన్న చితకా పట్టణాల్లో లాగా మా జనమూ అమాయకులు, పిచ్చోళ్ళు, ఆశాజీవులే.  కాని ఒక్కటి మాత్రం స్పష్టం. బహు ముచ్చటైన  ఈ వైకుంఠపాలి లో మల్లి మల్లి పాముల బారిన పాడేది వీళ్ళే. అన్నీ సవ్యంగా ఉంటె, ప్రభుత్వం గొప్పతనం.ఏదైనా చెడినదా ఉందిగా ఖర్మ సిద్ధాంతం.మీ ఖర్మ.


ఎవ్వరికీ పట్టని మా వూరి సమస్యలు. మా వూరు బాగా అభివృద్ధి చెంది పోయింది. కనీస అవసరాల కొస్తే, మా వూరు చుట్టూ ౨ చేరువులున్నాయ్.కొత్తగా ఏలిన వారు పూనుకొని ౧౦-౧౫ కీమీ దూరంలో ఒక డాము కూడా కట్టారు. ఇంకేం బ్రంహాండం అనేయకండి. వారానికి రెండు రోజులే నీళ్ళు. అదీ బ్రమ్హ ముహూర్తం లో. మీరు కరెక్టే చదివారు. పొద్దున్న మూడు-నాలుగు మద్య. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పన్నెండు గంటలకు కూడా అని విన్నాను. ఒక్కరోజు మిస్  అయ్యారా..ఇంకేం మల్లా రెండురోజుల తర్వాత కనపడండి. తుగ్లక్  గారుకూడ ఇలాంటి పనులు చేయగా మనం వినలేదు.ఇక పారిశుధ్యం,రహదారులు, రేషన్ లాంటి వాటి గురుంచి యెంత తక్కువ మాట్లాడుకుంటే మనసు అంత ప్రశాంతం గా ఉంటుంది. ముఖ్యం గా చివరి దాని గురుంచి. మా లోకాలిటి రేషన్ షాప్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు.ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆ కొద్ది సాయం ఎవరు మేక్కేస్తున్నారో పెరుమల్లకి కూడా తెలుసో తెలీదో.


వాంతి రాకడ, కరెంటు పోకడ ఎవరికి తెలుసు. మా వూళ్ళో అసలు తెలియదు. ఆ దెబ్భకి చుట్టూ పక్కల ఒక పరిశ్రమ ఉంటె వొట్టు. ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కుప్పలు తెప్పలైతేనేమి, ఎవరైనా మహా నగరాల దారి పట్టాల్సిందే.


అన్నట్టు మీకో విషయం చెప్పల.మా వూళ్ళో విమానాశ్రయం  కడుతున్నారు. భూమి పూజ చేసి వదిలేసారు. ఇంకేముంది.చుట్టూ పక్కల భూముల ధరలకు రెక్కలోచ్చాయి. ఘనత వహించిన అధికార పార్టీ వాళ్ళకు ఇందులో మహా రాజ పోశాకులని వినికిడి. విమానాశ్రయం అక్కడ అనిపించే లోపల ఆ చుట్టూ పక్కల ౫-౧౦ కీమీ భూమి చీపు గా కొనేసి ఇప్పుడు దాన్ని మంచి రేటుకు అమ్మేసుకున్తున్నారని ఎగస్పార్టీ భోగట్ట.వడ్డించేది మనోడేగా :)


ఆసుపత్రి పెద్ద స్తలం లో అఘోరించింది కాని, అక్కడ డాకుటేరులు భహిరంగ వ్యాపారం చేస్తారు. సాయంత్రం క్లినిక్కు వచ్చేయి మంచి మందు రాసిస్తా.. ఏమి ఇక్కడ నువ్వు చచ్చి నావుకద నాయన మళ్ళా అక్కడి కెందుకు.ఇక్కడ నీ పెన్నుకు పక్షవాతం వచ్చేనా..ఇక ఆరోగ్య శ్రీ దెబ్బ ఇక్కడ కూడా తగిలిందేమో. దగ్గుకి కూడా మందులు దొరకవు. దొరికినా, వాళ్ళు ఇచ్చేది పని చెయ్యది. ఎందుకని అల్లా చుస్తారేమి, తొంభై శాతం లంచం ఇచ్చి మందులు సరఫరా చేసే ఫార్మా వాళ్ళు బతకద్దూ.


 ఒక  పాత టపాలో రాసినట్టు మా వూరు పెద్ద బొమ్మల కొలువు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వ కారణం.పట్టణ వీధులు సమస్తం పార్టీ బొమ్మల పరం. కొన్ని బొమ్మలైతే కింద పేరు చదివితే కాని ఆ మగాను భావుడో/భావురాలో తెలవని పరిస్తితి. ట్రాఫ్ఫిక్ ఆ బొమ్మలు చుట్టూ గిరగిరా తిరుగుతూ బూతులు తిట్టుకుంటుంటే, పెట్టినోల్లకు మా చెడ్డ ఇష్టం.


ఎవ్వరికీ జనం వాళ్ళ సమస్యలు ఎప్పుడు పట్టిసావని ఈ గొప్ప అవ్యవస్తలో నాకు నచ్చే అంశం. ఎన్నికలప్పుడు మా వోళ్ళు అన్ని పార్టీ ల దగ్గరా డబ్బు తీస్కుంటారు.కాని వోటు మాత్రం వాళ్ళకు నచ్చిన పార్టీ కే వేస్తారు. అదే మరి పెజస్వమ్యంలో గొప్పదనం. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. అదేమీ వాళ్ళ డబ్బు కాదు. ఏ జన్మ భూమి లోనో, పనికి ఆహరంలోనో లేక టూ జీ లోనో నొక్కేసినా మీ డబ్బే. ఇంకా రెండో విషయానికొస్తే, ఆ డబ్బు ఇవ్వని వాడికి వోటేస్తే మన వోటు సార్ధక మైనట్టే. ఇలా డబ్బులు పంచే వాళ్ళకొక వోటు దెబ్బ. పంచని వాడు వెధవే అయ్యాడనుకోండి . పెజాస్వామ్యం లో అందరికి ఒకే రకమైన అవకాశాలు ఉండాలి. ఈ సారి ఈ కొత్త వాడిని  సంపాదించుకో నివ్వండి :)



Friday, March 9, 2012

పెద్ద మనిషి రిటైర్- అమెరికతలు-౧౬



మొన్నెప్పుడో పర్సులో చెత్త ఎక్కువైందని చూస్తుంటే, బైట పడ్డది. డిగ్రీ నుంచి నేను పదిలంగా కాపాడు కొంటున్న చిన్న ఫోటో.కట్ కొట్టాడో ఏమో అటు వైపు చూస్తూ, తనదైన స్టైల్ లో బాట్ ఇంకో చేతులో పదిలం గా పట్టుకొని రన్ కోసం పోతున్న యువకుడు. రాహుల్ ద్రావిడ్.
రికార్డులు ప్లకార్డులు పక్కన పెడితే, ఇండియన్ క్రికెట్ లో నేను చూసిన   స్టైలిస్ట్ బాట్స్మన్.కట్ కొట్టినా, స్ట్రైట్ డ్రైవ్ చేసినా, పుల్ చేసినా,లేట్ కట్ చేసినా, అతను ఆడితేనే చూడాలి. టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఉంటుందో కాని, ద్రావిడ్ ఆట చూసి టెక్స్ట్ బుక్స్ రాయచ్చేమో అన్నట్టు  అనిపిస్తుంది.
ద్రావిడ్ ఆట తీరు బహు ముచ్చట గొలుపుతుంది. ప్రతి షాట్ లో ఖచితత్వం.అదేదో డాక్టర్ శాస్త్ర చికిత్శ చేస్తున్నట్టు, శిల్పకారుడు , శిల్పాన్ని మలుస్తున్నట్టు, ఏకాగ్రత సున్నితత్వం కలగలిపి, ఇంకెవరైనా అదే షాట్ ఆడితే చూడబుద్ది కానంత నైపుణ్యం తో ఆడటం ద్రావిడ్ కే చెల్లు.
రాహుల్ వ్యక్తిత్వం అతనిలో మరో కోణం. గెలుపోటములలో తొణకని నైజం.నేటి క్రికెటేర్లలాగా  ప్రతి చిన్న విషయానికి పేపర్ల కు ఎక్కటం, నానా యాగి చెయ్యటం రాహుల్ కు తెలియదు. బైట వచ్చే ఆరోపణలను, విమర్శలను తన ఆట తీరు తో జవాబు చెప్పడం తనకు అలవాటు. వయసుకి మించిన పరిణతి రాహుల్ లో చూడొచ్చు.అందుకే పెద్దమనుషుల ఆటలో రాహుల్ చాలా పెద్ద మనిషి.
ఇంతకూ,నా పర్సు సంగతి చెప్పలేదు కదూ.నేను ఆ ఫోటోని బద్రంగా  అందులోనే పెట్టాను.

Monday, February 27, 2012

ప్రయాణం...అమెరికతలు-౧౫

నడుస్తున్నాను..
అందరికి దూరంగా, ఎల్లలు లేని నడక..
నన్ను నా అనుకునేవాళ్లు, నేను నాకే అనుకున్న వాళ్ళు,
దూరంగా చుక్కల్లా...కలకాలం కధలలాగా..
మల్లా వెనక్కి రమ్మంటూ...నీకు మేమున్నాం కదంటూ..

పిలుపులకు అందనంత దూరం నేను జరిగి 
కాలం కందని మనోమార్గాలలో
కాళ్ళు కందినా, కళ్ళలో కలలు కరిగినా.
ఆగలేని అలపు రాని ప్రయాణం.

ఎవ్వరికోసమో ఎందుకో తెలీదు.
ఆది అంతం లేని నడకలలో 
ప్రయాణమే తప్ప గమ్యం పై ద్యాస లేదు.
దారిలో పలకరించే బాటసారి దోస్తుల్లో
ఏనాడో నేను మరచిన చిన్ననాటి ఊసులను నెమరేసుకుంటూ

Sunday, February 12, 2012

పెన్ను కొచ్చెను పొయ్యేకాలం..అమెరికతలు-౧౪

అదేమీ రాత రా..కృష్ణా నదిలా అని వంకరలు తిరిగింది..మా తెలుగు మేస్టారి గొంతు నాకింకా గుర్తుంది. బడిలో ఉన్నప్పుడు నా చేతి రాత మీద ఆయనకున్న అభిమానమంతా రెండు మూడు పదాల్లో పెట్టలేక తెగ ఇబ్బంది పడేవాడు ఆయన.మనసులో భావం గొంతులో సరిగ్గా పలికించలేక.పోనిలే పాపం ఆయన కోసమైనా సరిగ్గా రాద్దాం అంటే, దాని దుంప దెగ, నా పెన్ను ఒక దున్నపోతును కట్టి లాగుతున్న నాగలి లాగ సహస్ర వంకరలు పోయేది.ఇక మన బాషలో ఉన్న వత్తులు పొల్లులు, వీటి సిగదరగ..అదేమిటో మా చెడ్డ తల పొగరు వాటికి..
తప్పంతా నాది కాదు పెన్నుది అని చాల పెన్నులే మార్చినట్టు గుర్తు. ప్రతి పరీక్షకి నేను పొద్దునే వెళ్ళటం, పెన్నుల కొట్టు సుబ్బా రెడ్డి 'ఎమబ్బా...నిన్ననే గదా పెన్ను కొనినావు..అప్పుడే యమాయే' అని అడగటం...ఈ తంతు ఒక సంవత్సరమే నడిచింది. తర్వాత్తర్వాత , నాలుగు తన్నులు పడ్డ కొంటె కుర్రాడువలె ఆయన కొన్ని ప్రశ్నలు అడగటం మానుకున్నాడు. ౫ పరీక్షలకి ౫ రకాల పెన్నులు సిద్దం గా పెట్టడం నేర్చుకున్నాడు.
ఈ నా పెన్నుదారా వ్రతానికి బెంబేలెత్తిన మరో మనిషి మా నాన్నగారు.రోజుకో పెన్ను దేనికి అంటే, నిన్న అది సరిగా రాయలేదు అని నా గోడ మీద కొట్టిన బంతి జవాబు. ఆయన పరిశోధన లో తేలిందేమంటే, తప్పు పెన్నులో లేదు నాలో ఉంది అని.ఇంకా చూస్కో నాయనా, కాపీ పుస్తకాలు,అదేమిటో పెద్ద పెద్ద లైన్ లవి, రెండు లైన్ ల మద్య కక్కుర్తిగ  ఉండే చిన్నచిన్న లైన్లవి. కట్టలు కట్టలు తెచ్చి ఇంట్లో పడేసేవాళ్ళు. రెండు మూడు సార్లు ఆయనే చేత్తో పట్టి రాయించడం గుర్తే.
కొన్ని రోజుల తర్వాత, మా నాన్నగారు మంచి గుండ్రటి అక్షరాలూ రాయటం నేర్చుకుంటే, గుడ్డి లో మెల్ల లా నా రాత మనుషులు చదివే విదంగా తయారయ్యింది.అప్పుడప్పుడు నా పుస్తకాల్లో కనపడి పలకరిస్తాయి అ రాత పుస్తకాలు. తరతరాల అణచివేతకు గుర్తుగా వాటిలోంచి తొంగి చూస్తుంటాయి నా చిన్నప్పటి అక్షరాలూ.
ఈ మద్య కాలం లో నా చేతి రాత పేపరు మీద చూస్కొని చాల కాలం అయింది.చేతి రాత ను బట్టి మనస్తత్వం కనిపెట్టేవాళ్ళు నైల్ కట్టర్లు కొనటం మానేసి కూడా చాల కాలం అయి వుంటుంది.ఈ దెబ్బతో నా రాత బాలేదు అనేవాల్లకీ ఆ ఛాన్స్ లేదు.అసలు పెన్ను వాడటమే అక్కర్లేదు కదా ఇప్పుడు.
ఆ మద్య కొన్ని రోజులు పెన్ను , ఫోన్ నం గట్రా రాసుకోటానికి ఒక చిన్న పుస్తకం జేబులో ఉండటం గుర్తే.
ఇప్పుడు నా ఫోన్ తోనే అన్ని పనులు అయిపోతున్నాయి.చెక్కుల మీద సంతకం పెట్టడం లాంటి పనులకు కూడా ఎలెక్ట్రిక్ పాడ్లు వచ్చాక పెన్నుతో ఆ పని కూడా లేకుండా పోయింది.
బ్లాగులు గట్రా రాసుకోవటానికి, పెన్నెందుకు టైపు చేస్కో వచ్చు కదా.ఇక్కడైతే  హాయి గా ఎన్ని సార్లైనా రాసుకోవచు తుడుపు కోవచ్చు. వొక సారి వెనక్కు తిరిగి చూసుకుంటే,అందరి అక్షరాలూ ఒకేలా ఉండటం నాకు పెద్ద ఉపసమనం.
ఈ లెక్కన కొన్ని రోజులకి మా పిల్లలు మీ పిల్లలు, సత్తే కాలం లో మా పూర్వీకులు పెన్ను వాడేవాల్లని చదువు కోవటం.మ్యుజియంలో డైనోసార్ ఎముకల పక్కన మనం ఈ నాడు వాడుతున్న పెన్నులు అపురూపం గా పెట్టుకు చూసుకోవటం జరగుతుందేమో. ఒకానోకాపుడు కనిపెట్టబడి వాడబడి అవసరం లేకుండా పోయిన వేలాది వస్తువులలో పెన్ను చేరటం తద్యం అనిపిస్తుంది. 
ఈ విషయం పై తాజాగా ఈనాడు లో ప్రచురితమైన వ్యాసం.
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20120624a_003101013&ileft=270&itop=1196&zoomRatio=133&AN=20120624a_003101013



Friday, January 6, 2012

రంగుల రాట్నం...ఇండియన్ క్రికెట్ ...అమెరికతలు-౧౩

నిజమే...జీవితమే కాదు..మన క్రికెట్ కూడా..
వరల్డ్ కప్ తర్వాత మన వీరాధి వీరులు వెస్ట్ ఇండీస్ వెళ్లారు.ఎనిమిదో స్తానంలో ఉన్న పసికూనలమీద మీసం మేలేసారు.తర్వాత ఇంగ్లాండ్ వెళ్లారు.అన్ని ఫార్మట్లలోను వాళ్ళు మనల్ని ఉతికి ఆరేసారు.ఆపద్భందావుల్లా మల్లా, వెస్ట్ ఇండీస్ ఇండియా వచ్చారు. ఆ పూనం పాండే చెప్పినట్టు, హోం గ్రౌండ్ లో మనోళ్ళు చెలరేగిపోయారు.ఇక, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు మన టీం ని ఉతికి గంజి పెడుతున్నారు.

రంగుల రాట్నం అంటే ఇదే కదా.ఇంట్లో లయన్ వీదిలో కౌన్ అన్నట్టు ఉంది మన క్రికెట్ పరిస్తితి.ఆశావహులేవరైనా ఇంగ్లాండ్ లో చాల మంది గాయాల బారిన పడ్డారని సముదాయించు కోవచ్చు.కాని ఇప్పుడేమి చెబుతారు.మా దోస్తు ఒకడు ఇండియా గ్రహస్తితి బాలేదని వక్కాణించాడు.నేను కొంతవరకు ఆమోదించాను.గ్రౌండ్లో ఆడే బాలు కూడా గ్రహాలవలె గుండ్రం గానే ఉంటుంది కదా..అదే అనుకూలించట్లేదు అని చెప్పాను.సంకల్ప బలం కన్నా ఏ గ్రహబలం అక్ఖర్లేదని ఇక్కడదే కొరవడిందని చూస్తేనే తెలుస్తుంది.

ఆస్ట్రేలియా టూర్ ముందు, ఇంకేముంది ఇంత వీక్ బౌలింగ్ లైన్ అప్ తో ఉన్న వాళ్ళను చిత్తూ చిత్తూ గా వోడించ వచ్చు అనుకున్నాం. కానీ, చరిత్ర అడ్డం తిరిగింది.పులి వేటగాడి వెంట పడింది.తుపాకి చేతిలో పట్టుకొని కూడా వేటగాడు పారి పోతున్నాడు.మరి విశ్వ విఖ్యాత బాటింగ్ లైన్ అప్ గురుంచి నేనిన్కేమి చెప్పనూ.కర్ణుడి టైపు లో పుట్టడం తోనే బాట్లతో పుట్టారా అన్నట్టు ఉంటాయి మన వాళ్ళ రికార్డులు.అదీ నిజమేనేమో, మంచి యుద్ధం లో కర్ణుడికి శాపాలు ముసురుకున్నట్టు మనోల్ల బాట్లు స్కోరే చేయటం లేదు.ఇక వాళ్ళ సంగతి.ఏ టీం ఐనా ఫార్మ్ లో కి రావాలంటే, ఇండియా ని ఒక టూర్ కి పిలిస్తే చాలు అని గవాస్కర్ అన్నట్టు, అన్ని విభాగాల్లో వారు చనిపోయే వానికి సంజీవని దొరికినట్టు పునరుజ్జీవనం పొందారు.

సర్వకాల సర్వావస్తలలో   అనుమానాస్పదం గా ఉండే మన బౌలింగ్ మళ్ళీ అభాసు పాలైంది.అంతేనా,సచిన్,ద్రావిడ్ లక్ష్మణ్ బాటింగ్ లైన్ అప్ లో గొప్ప బాట్స్మాన్ అని వరసగా పిల్చుకుంటూ ఉంటె, వాళ్ళు అపార్దం చేసుకున్నట్టు ఉంది.వరసగా పెవిలియన్ దారి పడుతున్నారు. వేయి ఆవులను గుటుక్కు మని పించిన రాబందు ఒక్క తుఫానుకు హుష్ కాకి అన్నట్టు, మంచి బౌలింగ్ ఎటాక్ ముందు,మన బాటింగ్ లైన్ అప్ బుర్జ్ దుబాయ్ కాదు, పేక మేడ అని నిరూపించేస్తున్నారు.

భారత క్రికెట్ అభిమానుల్లారా...ఇక ఒకే ఒక దారి. టీం ఇండియా 4 - ౦ తో వోడిపోకుండా ఉండాలంటే...మీ మీ ఇష్ట దైవాలను ప్రార్దించండి.శక్తి కొలది ఫలమో పుష్పము తోయమో సమర్పించేసుకోండి. ఎందుకంటె, ఇక వాళ్ళే ఈ సీరీస్ లో ఏమైనా చెయ్యగలరు, ;)



Monday, January 2, 2012

నీ రాకతో...

నేను వేచాను నీకై..
తెప్పరిల్లిన రాత్రిలో
నిద్రరాని కళ్ళలో నలిగి పోయిన ఆశలతో.
మంచుతో కప్పిన భూమి ఎండ పొడకై వేచినట్టు..
మబ్బులు కమ్మిన ఆకాశం తొలి పొద్దుకై చూచినట్టు.


మరి నీ రాక
కావాలి ఒక శుభ శకునం
తేవాలి మరో  నవ కవనం
తెల్లారని జీవితాలకు తొలి పొద్దువు కావాలి
మరో  ప్రపంచపు మహా గీతానికి తొలి రాగం తీయాలి
 నీ చిన్నారి అడుగుల చప్పుడుతో తిమిరానికి ఆయువు మూడాలి
జగమంతా ఆనందం తాండవ మాడాలి


యక్ష ప్రశ్నలు

1. మగోళ్ళ స్వర్గం లో రంభ ఊర్వశి  ఉంటే, ఆడోళ్ళ స్వర్గం లో ఎవరుంటారు??
2 . మందు తాగటం, ఇత్యాదివి భూలోకం లో తప్పైతే, స్వర్గం లో సురాపానము మేజువాణి ఒప్పెట్లా అవుతాయి..ఇల్లాంటి పనులు ఇక్కడ చేయటం మానుకుంటే స్వర్గం దొరికే పనైతే, అక్కడి కెళ్ళినా ఇదే వ్యవహారం అయితే అదేదో ఇక్కడే చేస్తే పోలా. :)
౩. మన పురాణాల్లో మొగోల్లకందరికి ఇంతిత పొడుగు పొడుగు జుట్లుంటాయి...ఆరోజుల్లో ఏ హెయిర్ ఆయిల్ వాడెవరో...బుట్ట పుర్రె రాకుండా ఏం చేసేవారో...
4 . ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత రోజే పెట్రోల్ ధర ఎందుకు తగ్గుతుంది?
5 . మీరు కొన్న తర్వాతే, మీ పక్కింటాయన మీకన్నా తక్కువ ధరకు ఇంకా లేటెస్ట్ మోడల్లో టీవీ లేక లాప్ టాప్ ఎలా కొనేస్తారు?
6. ఢిల్లీ నుండి ఆగ్రా కి యెంత దూరమో ఆగ్రా నుంచి ఢిల్లీ కూడా అదే దూరం...
మరి ఫ్రైడే నుండి సండే రెండు రోజులే ఎందుకుంది...( తింగరి ప్రశ్న ;))
7 . చేప ముందా..గుడ్డు ముందా..
8   పెళ్ళిళ్ళు  స్వర్గం లో జరిగితే బారసాలలు నామకరణాలు ఎక్కడ జరుగుతాయి ???
9  మనుషులు కోతులనుండి పుడితే, మరి దేవుళ్ళు దేవతలు ???
10  ఈ ప్రశ్నఈ బ్లాగ్  చదివేవాళ్ళకు..మీరే పూరించండి